Zodiac Signs : జూలై 31 ఆదివారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Zodiac Signs : జూలై 31 ఆదివారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….?

 Authored By aruna | The Telugu News | Updated on :30 July 2022,10:40 pm

మేష రాశి ఫలాలు : ఈరోజు సమస్యలను ఎదురుకోవాల్సి రావచ్చు. నిగ్రహం,ఓపిక చాలా అవసరం. కోపాన్ని ప్రదర్శించకండి. రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడులకు అనుకూలమైన రోజు. పెండింగ్‌ పనులతో ఈరోజు గడిచిపోతుంది. ప్రేమికులకు అత్యంత అనుకూలమైన రోజు. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. అన్ని రకాల వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఇష్టదేవతరాధన చేయండి. వృషభ రాశి ఫలాలు : ఈరోజు అభివృద్ధి మార్గంలో ముందుకుపోతారు. అన్నింటా జయం సాధిస్తారు. విశ్వాసం పెరుగుతుంది. ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక సమస్యలను ఎదరుకోవడానికి అమ్మనాన్నల అండదండలు ఉంటాయి. ఎవరి మాటలను నమ్మవద్దు. ఆనందంగా ఈరోజును గడుపుతారు. మహిలలకు లాభాలు. శ్రీ రుణహర గణపతి స్తోత్రం పారాయణం చేయండి.

మిథున రాశి ఫలాలు : ఈరోజు చికాకులు, అసౌకర్యంతో గడుస్తుంది. తల్లిదండ్రుల సహాయంతో ముందుకుపోతారు. కుటుంబ సభ్యులతో ఓపికతో మెలగండి. ప్రేమ తిరస్కారానికి గురవుతుంది. పక్కన జరుగుతున్న విషయాలలో అనవసర జోక్యం చేసుకోకండి. మీరు నిజం మాట్లాడటానికి ప్రయత్నిస్తారు. అనవసర వివాదాలు దూసుకువస్తాయి జాగ్రత్త. శ్రీ శివ తాండవ స్తోత్ర్ం వినడం లేదా చదవడం చేయండి. కర్కాటక రాశి ఫలాలు : ఈరోజు మీ వ్యసనాలను దూరం చేయడానికి ప్రయత్నం చేస్తే తప్పక విజయం సాధిస్తారు. ఆర్థికంగా పర్వాలేదు. అన్ని రకాల వ్యాపారాలలో లాభాలు వస్తాయి. ప్రియమైన వారి నుంచి చెడు వార్తలు వింటారు. అలసటగా ఉంటుంది ఈరోజు. వైవాహిక జీవితంలో స్పెషల్ ఈరోజు. దూర ప్రయాణ సూచన. శ్రీ పంచముఖ హనుమాన్‌ ఆరాధన చేయండి.

Today Horoscope July 31 2022 Check Your Zodiac Signs

Today Horoscope July 31 2022 Check Your Zodiac Signs

సింహ రాశి ఫలాలు : ఈరోజు ప్రాతఃకాలంలో కొంచెం ఇబ్బంది ఎదురవుతుంది కానీ రోజు గడిచే కొద్ది మంచి ఫలితాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. అనుకోని ప్రయాణాలు. శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఈరోజు సమయం దొరికనపుడు కలలో మునిగి తేలుతారు. సాయంత్రం మంచి శుభవార్తను వింటారు. ఇష్టదేవతారాధన చేయండి.

కన్యా రాశి ఫలాలు : ఈరోజు విజయం కోసం పరితపిస్తారు. కొత్త ఆలోచనలు చేస్తారు. ఆదాయం కోసం కొత్త మార్గాలను అన్వేసిస్తారు. ఇంట్లో ఒకరి ఆరోగ్యం కొంత ఇబ్బంది కలిగిస్తుంది. కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి కలుగుతుంది. ఈరోజు ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటారు. వైవాహిక జీవితం ఆనందభరితంగా ఉంటుంది. శ్రీ నారసింహ ఆరాధన చేయండి.

తులా రాశి ఫలాలు : ఈరోజు చక్కటి శుభదినం. విహార యాత్రలతో లేదా గెట్‌ టూ గెదర్‌తో గడిచిపోతుంది. ఆర్థికంగా మంచి పురోగతి కనిపిస్తుంది. బంధువుల నుంచి సహాయం అందుతుంది. ప్రేమికులకు వసంతం ఈరోజు. అనుకోని చోట నుంచి శుభవార్తలు వింటారు. శ్రీ తారా దేవి ఆరాధన చేయండి.

వృశ్చిక రాశి ఫలాలు : ఆస్థి సంబంధ విషయాలలో లాభాలు వస్తాయి, ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంట్లో సందడి వాతావరణం. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇంటా, బయటా అనందంగా గడిచిపోతుంది. శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆరాధన చేయండి.

ధనుస్సు రాశి ఫలాలు : దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూలం. పని వత్తిడి ఎక్కువగా ఉంటుంది. భార్య భర్తల మధ్య అనుకూలత, సఖ్యత ఎక్కువగా ఉంటుంది. ఆనందంగా ఉంటారు. వ్యాపారాలలో లాభాలను పొందుతారు. పిల్లలతో ఆనందంగా గడుపుతారు. వైవాహిక జీవితం సంతోషకరంగా ఉంటుంది. శ్రీ శక్తి గణపతి ఆరాధన చేయండి.

మకర రాశి ఫలాలు : ఈరోజు వత్తిడి, ఆందోళనలు ఎక్కువగా పెరుగుతాయి. ప్రయాణ చికాకులు వస్తాయి. విలువైన వస్తువులను కొంటారు. కానీ వస్తువులు జాగ్రత్త. ఆదాయం తగ్గుతుంది. ఆఫీస్‌ విషయాలలో జాగ్రత్తగా ఉండండి. మహిళలకు పని భారం పెరుగుతుంది. శ్రీ జ్వాలా నారసింహ ప్రార్థన చేయండి.

కుంభ రాశి ఫలాలు : మీరోజు అనారోగ్య సమస్యలు రావచ్చు. ధనం సంపాదించినా అనుకోని ఖర్చులు వస్తాయి. పాత స్నేహితుల సపోర్ట్‌ లభిస్తుంది. ప్రేమికులకు సంతోషకరమైన రోజు. విశ్రాంతి దొరకక ఇబ్బంది పడుతారు. అనుకోని ప్రయాణాలు. మానసిక అశాంతి. శ్రీ కాలభైరావాష్టకం పారాయణం చేయండి.

మీన రాశి ఫలాలు : ఈరోజు సమాజంలో మంచి గౌరవమర్యాదలు లభిస్తాయి. ఆదాయ వనరులు పెరుగుతాయి. కుటుంబంలో చక్కటి వాతావరణం. శాంతి, ప్రశాంతత లభిస్తాయి. ఎవరికి తెలియకుండా ప్రయాణాలు చేస్తారు. వ్యాపారాలలో లాభాలుల వస్తాయి. సమయం మాత్రం వృథా చేస్తారు. పిల్లల ద్వారా శుభవార్తలు వింటారు. శ్రీ సూర్యనారాయణ స్వామి ఆరాధన చేయండి.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది