Zodiac Signs : జూన్ 05 ఆదివారం ఈ రోజు మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే….?
మేషరాశి ఫలాలు : మంచి వాతావరణంలో ఈరోజు గడుస్తుంది. ఆహ్లాదకరమైన వాతావరణం కోసం విహారానికి వెళ్తారు. మిత్రులు, బంధువుల నుంచి శుభవార్తలు. మంచి ఆలోచనలు చేస్తారు. ఆర్థికంగా బాగుంటుంది. శ్రీ సూర్యనారాయణ ఆరాధన చేయండి. వృషభ రాశి ఫలాలు : కొంత శ్రమించాల్సిన రోజు. ఆర్థికంగా మందగమనం. వ్యాపారాలు సాఫీగా సాగవు. మనస్సు స్థిరంగా ఉండదు. పలు రకారకాల ఆలోచనలు చేస్తారు. ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. కుటుంబంలో చిన్నచిన్న సమస్యలు. విద్యా, ఉద్యోగంలో ప్రతికూలత. శ్రీ ఆదిత్యహృదయం పారాయణం చేయండి.
మిథునరాశి ఫలాలు : ముఖ్యమైన వస్తువులు కొంటారు. ఆనందంగా గడుపుతారు. ఆస్తి విషయంలో చాలా కాలంగా ఉన్న సమస్యలు తొలిగిపోతాయి. ఆభరణాలు కొంటారు. శుభకార్యయోచన చేస్తారు. అన్ని రకాలుగా బాగుంటుంది. శ్రీ లలితాదేవి ఆరాధన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : కుటుంబంలో చక్కటి ఆనందకరమైన వాతావరణం. అన్నదమ్ముల నుంచి ప్రయోజనాలు పొందుతారు. ఆర్థిక పరిస్తితి మెరుగుపడుతుంది. దూర ప్రాంత ప్రయాణాలకు ప్లాన్ చేసుకుంటారు. అనుకోని అవకాశాలు వస్తాయి. శ్రీ సూర్యనారాయణ ఆరాధన చేయండి.
సింహ రాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. అనుకోని సమస్యలు వస్తాయి. వివాదాలకు దూరంగా ఉండాల్సిన రోజు. కుటుంబంలో చికాకులు పెరుగుతాయి. ఆరోగ్య జాగ్రత్త. సాయంత్రం నుంచి కొంచెం వాతావరణం తేలికవుతుంది. మంచి వార్తలు వింటారు. ధనలాభాలు వస్తాయి. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.
కన్యారాశి ఫలాలు : చాలా సంతోషంగా ఉంటారు. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. ఆదాయం పెరుగుతుంది. కోర్టు వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. విలువైన వస్తువులు కొంటారు. అన్నదమ్ముల నుంచి లాభాలు పొందుతారు. విదేశీ ప్రయాణ సూచన. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.
తులారాశి ఫలాలు : చాలా మంచి రోజు. అప్పుల కోసం ప్రయత్నిస్తారు. పాత బాకీలు వసూలు అవుతాయి. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. పై అధికారుల ప్రశంసలు అందుతాయి. విద్య, ఉద్యోగ విషయాలు అనుకూలం. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఇష్టదేవతరాధన చేయండి.,
వృశ్చిక రాశి ఫలాలు : కొంచెం కష్టంగా ఉంటుంది ఈరోజు. అనుకోని లాభాలు వస్తాయి. ఖర్చులు పెరుగుతాయి. అప్పుల కోసం ప్రయత్నిస్తారు. ఆనుకోని వివాదాలు వస్తాయి. దూర బంధువుల నుంచి వత్తిడులు వస్తాయి. శ్రీ కాలభైరావాష్టకం పారాయణం చేయండి.
ధనస్సు రాశి ఫలాలు : ఆనందంగా గడుపుతారు. అప్పుల కోసం చేసిన ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్య, ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. కొత్త అవకాశాలు వస్తాయి. విదేశీ విద్య విషయాలు పురోగతి కనిపిస్తాయి. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.
మకర రాశి ఫలాలు : శుభకరమైన రోజు. ఆనందంగా ఈరోజు గడుస్తుంది. మంచి వార్తలు వింటారు. కుటుంబంలో సానుకూలమైన మార్పులు. వైవాహిక జీవితం సాఫీగా సాగుతుంది. ఆర్థిక పురోగతి కనిపిస్తుంది. శ్రీ లక్ష్మీ గణపతి ఆరాధన చేయండి.
కుంభ రాశి ఫలాలు : కొంచెం కష్టంగా ఉంటుంది. కొంచెం సంతోషంగా ఉంటుంది. అప్పుల కోసం ప్రయత్నిస్తారు. అనుకోని లాభాలు వస్తాయి. బంధువుల నుంచి శుభ వార్తలు వింటారు. గతంలో పెట్టిన పెట్టుబడులు లాభాలు వస్తాయి. తల్లితరపు వారి నుంచి లాభాలు వస్తాయి. శ్రీ లక్ష్మీ దేవి ఆరాధన చేయండి.
మీన రాశి ఫలాలు : ప్రతికూలంగా ఉంటుంది. సంతానం వల్ల ఇబ్బందులు పడుతారు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాల్సిన రోజు. మానసకి అశాంతి కనిపిస్తుంది. వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి. కుటుంబంలో పెద్ద వారి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాల్సిన రోజు. మహిళలకు పని భారం. శ్రీ చింతామణి గణపతి ఆరాధన చేయండి.