Zodiac Signs : జూన్ 06 సోమవారం ఈ రోజు మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే….?
మేషరాశి ఫలాలు : శుభఫలితాలు సాధిస్తారు. కుటుంబంలో సంతోషం. అరోగ్యం బాగుంటుంది. విద్యా, ఉద్యోగ విషయాలలో అనకూలమైన రోజు. ఆర్థికంగా బాగుంటుంది. మహిళలకు ఆనందకరమైన రోజు. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి. వృషభరాశి ఫలాలు : ముఖ్యమైన వార్తలు వింటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థికంగా సాధారణంగా ఉంటుంది. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. అన్ని రకాలుగా బాగుంటుంది. శ్రీ సోమేశ్వరస్వామి ఆరాధన చేయండి.
మిధునరాశి ఫలాలు : చేసే పనులలోజాప్యం జరుగుతుంది. మీ శ్రమకు తగ్గ ఫలితం లభించదు. అనవసర వివాదాలకు ఆస్కారం ఉంది. పెద్దల మాట వినకపోవడం వల్ల నష్టం జరిగే అవకాశం ఉంది. ఇంటా, బయటా అనుకోని ఒత్తిడి. శ్రీశివాభిషేకం చేయించండి. కర్కాటకరాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. అనుకోని ఖర్చులు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది కానీ సంతృప్తి ఉండదు. విలువైన వస్తువులు జాగ్రత్త. ప్రయాణ సూచన. కుటుంబంలో చిన్నచిన్న సమస్యలు. మహిళలు ఇబ్బందులు. శివమానస పూజ, ఆదిత్య హృదయ పారాయణం చేయండి.
సింహరాశి ఫలాలు : శుభకార్య యోచన చేస్తారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావారణం. ప్రశాంత వాతావరణం. అనుకోని లాభాలు వస్తాయి. మిత్రుల ద్వారా లాభాలు గడిస్తారు. పాత బాకీలు వసూలు అవుతాయి. శ్రీసోమేశ్వరస్వామి ఆరాధన చేయండి.
కన్యారాశి ఫలాలు : కొంచెం కష్టంగా ఉంటుంది. చేసిన పనికి తగ్గ ఫలితం రాదు. ఆదాయం తగ్గుతుంది. కుటుంబంలో సమస్యలు. పెట్టుబడులకు సరైన రోజు కాదు. మహిళలకు సంతోషకరకమైన రోజు. శ్రీ కాలభైరావాష్టకం పారాయణం చేయండి.
తులారాశి ఫలాలు : చక్కటి శుభదినం ఈరోజు. అనుకోని మార్గాల ద్వారా ఆదాయం పెరుగుతుంది. పెండింగ్ పనులు పూర్తవుతాయి. మిత్రుల ద్వారా శుభవార్తలు. అనుకోని. లాభాలు. మహిళలకు శుభదినం. శ్రీకుబేర లక్ష్మీదేవి ఆరాధన చేయండి.
వృశ్చికరాశి ఫలాలు : ఆదాయమార్గాల పెరుగుతాయి. కుటుంబంలో చక్కటి శుభవాతావరణం. అనుకోని ఖర్చులు. పాత ఆస్తి వివాదాలు తీరుతాయి. అక్కచెల్లల ద్వారా ప్రయోజనాలు పొందుతారు. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.
ధనుస్సురాశి ఫలాలు ‘; కుటుంబంలో సంతోషకరంగా ఉంటుంది. అప్పులు తీరుస్తారు. ఆర్థిక పురోగతి కనిపిస్తుంది. అన్నింటా విజయం సాధిస్తారు. ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. క్షేత్ర పందర్శన చేస్తారు. శ్రీ శివార్చన చేయండి.
మకరరాశి ఫలాలు : కొంచెం కష్టపడాల్సిన రోజు. ఆనుకోని ఖర్చులు పెరుగుతాయి. బంధవుల ద్వారా చెడు వార్తలు. మిత్రుల కలయిక. మనసు ప్రశాంతత కోల్పోతారు. శ్రీలక్ష్మీ కుబేర ఆరాధన చేయండి.
కుంభరాశి ఫలాలు : శుభదినం. అన్నింటా జయం. అప్పులు తీరుస్తారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కుటుంబంలో చక్కటి వాతావరణం. మంచి గౌరవం, ఆదాయం లభిస్తాయి. మహిళలకు చక్కటి లాభదాయకమైన రోజు. శ్రీ రుద్రార్చన చేయండి..
మీనరాశి ఫలాలు : అనుకోని ఇబ్బందులు. ఉద్యోగార్థులకు కష్టపడాల్సిన రోజు. విద్య, వ్యాపార విషయాలలో సాధారణంగా ఉంటుంది. అనుకోని వివాదాలకు ఆస్కారం ఉంది. ప్రయాణలు చేసేటపుపడు జాగ్రత్త. మహిళలకు పని భారం పెరుగుతుంది. శ్రీ రుద్రాభిషేకం మంచి పలితాన్నిస్తుంది.