Zodiac Signs : జూన్ 12 ఆదివారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….?

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 11 June 2022, 10:40 pm

మేష రాశి ఫలాలు : ఆర్థికంగా చక్కటి శుభఫలితాలు వస్తాయి. ఆనుకోని వారి నుంచి శుభవార్తలు వింటారు. మీ శ్రమకు తగ్గ ఫలితం కనిపిస్తుంది. అతిథి రాకతో సంతోషంగా ఉంటారు. మహిళలకు లాభాలు. శ్రీ సూర్యారాధన చేయండి, వృషభరాశి ఫలాలు : కొంచెం శ్రమించాలి. కానీ మీకు అనుకూలంగా ఉంటుంది ఈరోజు. భూ సంబంధ విషయాలలో అనుకూలత. ఆర్థికంగా పర్వాలేదు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. అన్నదమ్ముల నుంచి మంచి సహాయం అందుతుంది. ఇష్టదేవతారాధన చేయండి.

మిథున రాశి ఫలాలు : కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. వివాదాలకు ఆస్కారం ఉంది. అనుకోని విషయాలల వల్ల మానసికప్రశాంతత కోల్పోతారు. మహిళలకు పని వత్తిడి బాగా పెరుగుతుంది. శ్రీ కాలభైరావాష్టం పారాయణ చేయండి. కర్కాటక రాశి ఫలాలు : మంచి చేద్దామన్నా మీకు సాధ్యం కాని రోజు. అనుకోని నష్టాలు. ఆర్థికంగా మందగమనం. ఆర్థిక విషయాలలో సమస్యలు రావచ్చు. మధ్యవర్తిత్వం వహించవద్దు. బంధువులతో ఇబ్బంది. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.

Today Horoscope June 12 2022 Check Your Zodiac Signs

Today Horoscope June 12 2022 Check Your Zodiac Signs

సింహరాశి ఫలాలు : అన్నదమ్ముల నుంచి మంచి వార్తలు అందుతాయి. వివాహప్రయత్నాలు సఫలం అవుతాయి. కుటుంబంలో పండుగ వాతావరణం. అన్నింటా విజయం సాధిస్తారు. మహిళలకు మంచి లాభాలు. శ్రీ లక్ష్మీ కుబేర ఆరాధన చేయండి.

కన్యారాశి ఫలాలు : ఉల్లాసంగా గడుపుతారు. విందులు, వినోదాలకు హాజరవుతారు. విలువైన వస్తువులు కొనుగోలుకు ప్రయత్నిస్తారు. ఆర్థికంగా పురోగతి కనిపిస్తుంది. మీరు పెండింగ్‌ పనులు పూర్తి చేస్తారు. శ్రీ ఆదిత్య హృదయం పారాయణం చేయండి.

తులారాశి ఫలాలు : ప్రతికూలమైన వాతావరణం. అన్నింటా చిన్నచిన్న సమస్యలు. వివాదాలకు ఆస్కారం. అన్నదమ్ముల నుంచి మాటపట్టింపులు. ఆర్థిక మందగమనం. వ్యాపారాలలో నష్టాలకు అవకాశం. శ్రీ సంతోషిమాతా ఆరాధన చేయండి.

వృశ్చిక రాశి ఫలాలు : మీకు కొంచెం కష్టం అయినా సాయంత్రానికి అనుకూల ఫలితాలు వస్తాయి. దూర ప్రాంతం నుంచి శుభ వార్తలు అందుతాయి. విదేశీ ప్రయత్నాలు, విద్యా, ఉద్యోగ అనుకూలతలు కనిపిస్తున్నాయి. శ్రీ రాఘవేంద్రస్వామి ఆరాధన చేయండి.

ధనుస్సు రాశి ఫలాలు : అప్పులు తీరుస్తారు. అన్ని పనులు సత్వరంగా పూర్తిచేస్తారు. సాయంత్రం నుంచి ఉత్సాహంగా, ఉల్లాసంగా గడుపుతారు. విందులు, వినోదాలు, క్షేత్ర పర్యటనలకు ఆస్కారం. శ్రీదేవి ఆరాదన చేయండి.

మకర రాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. అనుకున్న పనులు నిదానంగా పూర్తిచేస్తారు. ఆర్థికంగా సాధారణ స్థితి. అప్పుల కోసం ప్రయత్నిస్తారు. మహిలలకు లాభాలు. బంధువుల నుంచి సమస్యలు రావచ్చు జాగ్రత్త. శ్రీ దుర్గా స్తోత్రం పారాయణం చేయండి.

కుంభ రాశి ఫలాలు : చక్కటి శుభకరమైన రోజు. అన్ని రకాలుగా బాగుంటుంది. ప్రేమ విషయాలలో అనుకూలతలు. అర్థిక పరిస్తితి పురోగతి కనిపిస్తుంది. మీరు చేసే అన్ని పనులు పూర్తి చేస్తారు. శ్రీ లలితాదేవి ఆరాధన చేయండి.

మీన రాశి ఫలాలు : సంతోషకరమైన వార్తలు వింటారు. ఆర్థికంగా పురోగతి కనిపిస్తుంది. మంచి స్నేహితులు లభిస్తారు. కొత్త అవకాశాలు. కొత్త పరిచయాలకు అనుకూలమైన రోజు. అన్ని రకాలుగా బాగుంటుంది. శ్రీ లక్ష్మీ స్తోత్రం పారాయణ చేయండి.

Advertisement

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

  1. "Ravi Teja : అచ్చం రవితేజనే అనుకుంటారు.. ఈ వ్యక్తి వీడియో చూసి షాక్ అవుతున్న నెటిజన్లు!"

  2. "Bengaluru Triple Murder AI ని ఈ రేంజ్‌లో వాడుతున్నారా.. మర్డర్ నుంచి శ‌వం మాయం చేసేవ‌ర‌కు దర్యాప్తులో షాకింగ్ విషయాలు..!"

  3. "Gabbar Singh Actor Ramesh Brain Stroke : పవన్ కల్యాణ్ గబ్బర్ సింగ్’ నటుడు రమేష్‌కు బ్రెయిన్ స్ట్రోక్.. ప‌రిస్థితి విష‌మం"

  4. "Uppal Beerappagadda : ఉప్పల్‌ బీరప్పగడ్డలో SIR ప్రచార రథానికి శ్రీకారం.. ఓటరు జాబితా సవరణపై పరమేశ్వర్ రెడ్డి కీలక పిలుపు"

  5. "Telangana Farmers : తెలంగాణ రైతులకు కేంద్రం బంపర్ గుడ్ న్యూస్ చెప్పిన మోదీ..!"

  6. "Uppal Congress : ఉప్పల్‌లో కాంగ్రెస్ భారీ నిరసన.. రాహుల్ గాంధీ అరెస్టుపై ఆగ్రహం, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్"

  7. "NEET Protest Delhi : నీట్ ఆందోళనలో కొత్త ట్విస్ట్.. విద్యార్థుల సమస్యా? రాజకీయ పోరాటమా..? సీజేపీ నాయకులు ఎక్కడ?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి