Zodiac Signs : జూన్ 14 మంగళవారం ఈ రోజు మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే….?
మేషరాశి ఫలాలు ; అనుకున్న పనులు చేస్తారు. కుటుంబంలో అనుకోని మార్పులు వస్తాయి. ఆర్థిక పరిస్తితి అనుకూలం. దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అన్నింటా సానుకూలమైన ఫలితాలు. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి. వృషభ రాశి ఫలాలు : చక్కటి ఫలితాలను పొందుతారు. వ్యవహరాలు అన్ని సాఫీగా సాగుతాయి. ఆర్థికంగా చక్కట ఫలితాలు. అనుకోని మార్పులు. వ్యాపారాలలో లాభాలు వస్తాయి. దూర ప్రాంతం నుంచి శుభవార్త అందుతుంది. ఇష్టదేవతారాధన చేయండి,.
మిథున రాశి ఫలాలు : కొంచెం కష్టం పడాల్సి రావచ్చు. అనుకున్న సమయానికి మీరు పనులు పూర్తి చేయలేరు. ప్రయణాల వల్ల నష్టాలు. ఇంటా, బయటా అనుకోని మార్పులు జరుగుతాయి. కుటుంబంలో కొంచెం ఇబ్బంది కలుగుతుంది. శ్రీ కుజ మంగళ గౌరీ ఆరాధన చేయండి. కర్కాటకరాశి ఫలాలు : మంచి ఫలితాలను పొందుతారు. ఆనుకున్న సమయానికి ధనం చేతికి అందుతుంది. అప్పులు తీరుస్తారు. విలువైన వస్తువులను కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తారు. అన్నింటా శుభ ఫలితాలు. శ్రీ గణపతి ఆరాధన చేయండి.
సింహ రాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. శ్రమచేసిన దానికి తగ్గ ఫలితం రాదు. విద్య, వ్యాపారాలలో సాధారణ ఫలితాలు. అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చులు పెడుతారు. వృథా ప్రయాసలు. సాయంత్రం నుంచి కొంచెం బాగుంటుంది. శ్రీ లలితాదేవీ ఆరాధన చేయండి.
కన్యారాశి ఫలాలు : మిత్రులతో ప్రయోజనాలు పొందుతారు. ఇంటా, బయటా అనుకూల వాతావరణం. ప్రయాన సూచన. కుటుంబంలో సానుకూలమైన మార్పులు. మంచి వార్తలు వింటారు. ఆర్థికంగా బాగుంటుంది. లక్ష్మీగణపతి ఆరాదన చేయండి.
తులారాశి ఫలాలు : శ్రమకు తగ్గ ఫలితం రాక చికాకులు పడుతారు. ధన సంబంధ విషయాలో జాగ్రత్త తీసుకోవాల్సిన రోజు. అనుకోని వివాదాలకు ఆస్కారం. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఆరోగ్య విషయాలు జాగ్రత్త. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణ మంచి ఫలితాన్నిస్తుంది.
వృశ్చిక రాశి ఫలాలు : మీరు చేసే అన్ని పనులు చక్కగా ముందుకు సాగుతయాఇ. దూర ప్రాంతం నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. విద్యా, ఉద్యోగ విషయాలలో అనుకూలత కనిపిస్తుంది. అమ్మవారి ఆరాధన చేయండి.
ధనుస్సు రాశి ఫలాలు : శ్రమకు తగ్గ ఫలితం రాదు. ఆర్థిక మందగమనం. విద్యార్థులు బాగా శ్రమించాల్సిన సమయం. అనుకోని వారి నుంచి ఇబ్బంది పడుతారు. ఇంటా, బయటా మీ మాట వినేవారు ఉండరు. శ్రీ చింతామణ గణపతి ఆరాధనన చేయండి.
మకర రాశి ఫలాలు : ష్ట పడాల్సి రావచ్చు. ధైర్యంతో ముందుకుపోవాఇ. అనుకున్న పనులలో జాప్యం పెరుగుతుంది. దీర్ఘ కాలిక సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. సాయంత్ర అనుకోని అతిథి రాకతో సంతోషంగా గడుపుతారు. శ్రీ కాలభైరాష్టకం పారాయన చేయండి.
కుంభ రాశి ఫలాలు : చక్కటి ఫలితాలను సాధిస్తారు. ఆర్థికంగా చక్కటి రోజు. అనుకోని మార్గాల ద్వారా ఆదాయం పెరుగుతుంది. చాలాకాలంగా ఉన్న సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. వ్యాపారాలలో లాభాలు. శ్రీ దేవి ఆరాధన చేయండి.
మీనరాశి ఫలాలు : ఉత్సాహంగా పనిచేస్తారు. ఆర్థికంగా మంచి ఫలితాలు సాధిస్తారు. అనుకున్న దానికంటే ముందే మీ పనులు పూర్తిచేస్తారు. విదేశీ వ్యవహారాలు, ఆర్థిక విషయాలలో సానుకూల పలితాలు. అన్నింటా విజయం. శ్రీ లక్ష్మీ, లలితాదేవి ఆరాధన చేయండి.