Zodiac Signs : జూన్ 22 బుధవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….?

మేషరాశి ఫలాలు : సంతోషంగా, ఆనందంగా ఈరోజు గడిచిపోతుంది. సానుకూలమైన నిర్ణయాలను తీసుకుంటారు. ఆర్థికంగా శక్తిమంతంగా ఉంటారు. మంచి తెలివి తేటలతో ఈరోజును ఉపయోగిస్తారు. కెరీర్ గురించి ప్లాన్ చేసుకుంటారు. ప్రేమికులకు అనుకూలమైన వాతావరణం. పేదలకు ఆహారం ఇవ్వడం చేయడం వల్ల లాభాలు కలుగుతాయి. వృషభరాశి ఫలాలు : కచ్చితమైన నిర్ణయం తీసుకుంటారు. ఆర్తికంగా మంచి రోజు. అనవసర ఖర్చులు. ఈరోజు ఇంట్లో కలహాలు, గొడవలు. పని విషయంలో మీరు పడుతున్న చక్కని శ్రమంతా ఈ రోజు ఫలించనుంది. సుబ్రమణ్య స్వామి ఆరాధన చేయండి.

Advertisement

మిథున రాశి ఫలాలు : ఆరోగ్యంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో ఈరోజు ముందుకుపోతారు. ప్రశాంతకరమైన రోజు. ఇతరులకు ధనసహాయం చేస్తారు. మీ బంధువులు లేదా స్నేహితుల నుంచి కానుకలు, బహుమతులు అందుతాయి. మహిళలకు లాభదాయకమైన రోజు. శ్రీ లక్ష్మీ గణపతి ఆరాదన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : అనవసర విషయాల జోలికి వెళ్లకండి. చేసే పనిలో నిమగ్నం కావాల్సిన రోజు. ఆర్థికంగా పర్వాలేదు. అవసరానికి ధనం చేతికి అందుతుంది. ప్రేమికుల మధ్య కొంత దూరం పెరిగే అవకాశం ఉంది. ఆఫీస్‌లో పై అధికారుల ద్వారా శుభవార్తలు వింటారు. ఇష్టమైన వారి నుంచి సంతోషం కలిగించే వార్తలు అందుతాయి. ఇష్టదేవతరాధన చేయండి.

Today Horoscope June 22 2022 Check Your Zodiac Signs
Today Horoscope June 22 2022 Check Your Zodiac Signs

సింహ రాశి ఫలాలు : అనవసర మానిసిక భయంతో ఈరోజు ఇబ్బంది పడుతారు. ఆర్థికంగా చక్కటి పలితాలు. కొత్త పనులు,ప్రాజెక్టులు ప్రారంభించడానికి శుభకరమైన రోజు. అనుకోని అతిథి రాకతో ఇంట్లో సందడి వాతావరణం. అదృష్టం మీ వెంటే ఉంటుంది. పిల్లల ద్వారా సంతోషం మరింత పెరుగుతుంది. శ్రీ చింతామణి గణపతి ఆరాధన చేయండి.

కన్యా రాశి ఫలాలు : పెద్దల ద్వారా శుభవార్తలు వింటారు. అమ్మ తరుపువారి నుంచి ధనలాభాలు.
కొత్త ఒప్పందాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. పాత మిత్రుల కలయిక
ధన సంబంధ విషయాలలో అనకూలత. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. శ్రీ లక్ష్మీగణపతి ఆరాధన చేయండి.

తులా రాశి ఫలాలు : ప్రశాంత వాతావరణం. ధన లాభాలు వస్తాయి. రియల్‌ ఎస్టేట్లో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం. కొత్త పరిచయాలు పెరుగుతాయి. చాలా కాలంగా వేచి చూస్తున్న శుభ వార్తలు వింటారు. అమ్మ తరపు వారి నుంచి లాభాలు. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.

వృశ్చిక రాశి ఫలాలు : ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. వివాదాలకు దూరంగా ఉండాల్సిన సమయం. ప్రేమకు అనుకూలం. వ్యాపారాలలో లాభాలు వస్తాయి. వైవాహిక జీవితంలోకెల్లా అత్యుత్తమమైన క్షణాలను మీ జీవిత భాగస్వామి పొందుతారు. విద్య, ఉద్యోగ విషయాలు అనుకూలం. శ్రీ గణపతి ఆరాధన చేయండి.

ధనుస్సు రాశి ఫలాలు : ఆకింత భావంతో పనిచేస్తే మంచి ఫలితాలను ఈరోజు సాధిస్తారు. ఇతరులకు ఆదర్శంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. ఆర్థికంగా పురోగతి కనిపిస్తుంది. భవిష్యత్‌ పెట్టుబడులకు ప్లాన్‌ చేస్తారు. సంతోషంగా గడుపుతారు. శ్రీ లలితా దేవి ఆరాధన చేయండి.

మకర రాశి ఫలాలు : వత్తిడి పెరుగుతుంది. అనవసర ఖర్చులు పెరుగుతాయి. దూర ప్రాంతం నుంచి మీకు వచ్చే కానుకల ద్వారా మీకు చాలా సంతోషం కలుగుతుంది. ఆఫీసులో ఈ రోజు గుర్తింపు లభించనుంది. విద్య, వ్యాపరాలలో లాభాదాయకంగా ఉంటాయి. అప్పులు తీరుస్తారు. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.

కుంభ రాశి ఫలాలు : అనారోగ్య సూచన. ఈరోజు విశ్రాంతికి ప్రాధాన్యం ఇస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు. అర్థికంగ కొన్ని రోజుల నుంచి పడుతున్న ఇబ్బందులు తొలుగుతాయి. అన్ని రకాల వృత్తుల వారికి ఇబ్బంది తొలిగి ముందుకుపోతారు. శ్రీ కాలభైరవాష్టకం పారాయణం చేయండి.

మీన రాశి ఫలాలు : మానసిక ప్రశాంతత లభిస్తుంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తిచేస్తారు. ధన సంబంధ విషయాలలో సానుకూలమైన వాతావరణం. చాలా కాలంగా వేచి చూస్తున్న శుభవార్తలు వింటారు. మధ్యవర్తిత్వానికి దూరంగా ఉండాల్సిన రోజు. అందరిలో మీరు ఈ రోజు ప్రత్యేకంగా కనిపిస్తారు. ఇష్టదేవతారాధన చేయండి.

Advertisement