Zodiac Signs : మార్చి 05 శనివారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే..?

Authored By Devotional Desk | The Telugu News | Updated on: March 5, 2022, 12:27 am

Zodiac Signs మేషరాశి : లాభదాయకమైన రోజు ఈరోజు. అనుకోని చోట నుంచి శుభవార్తలు వింటారు. అప్పులు తీరుస్తారు. ఆనందంగా గడుపుతారు. అన్ని రకాల వారికి అనుకూలమైన రోజు. మహిళలకు ధనలాభ సూచన కనిపిస్తుంది. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి. వృషభరాశి ఫలాలు : కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక విషయాలు సాఫీగా సాగుతాయి. చాలా కాలంగా ఉన్న చికాకులు తొలిగిపోతాయి. వ్యాపారంలో లాభాలు వస్తాయి. మహిళలకు మంచిరోజు. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి.

Zodiac Signs మిధునరాశి ఫలాలు : ప్రతికూలమైన విషయాలు. అప్పుల బాధలు పెరుగుతాయి. ఆనారోగ్య సూచన కనిపిస్తుంది. కుటుంబంలో అనుకోని చికాకులు. విద్యార్థులు, ఉద్యోగులకు శ్రమ భారం పెరుగుతుంది. మహిళలకు పని భారం పెరుగుతుంది. గోవులకు బెల్లం, దానా సమర్పించండి. కర్కాటకరాశి ఫలాలు : ఆర్థిక విషయాలలో నిరాశజనకంగా ఉంటుంది. వ్యాపారంలో కొత్త పెట్టుబడులు పెట్టకండి. కుటుంబంలో సమస్యలు. ప్రయాణ భారం. విద్యార్థులు అనుకోని చోట నుంచి వత్తిడి ఎదురుకుంటారు. శని థశరథ స్తోత్రం చదువుకోండి.

today horoscope march 05 2022 check your zodiac signs

today horoscope march 05 2022 check your zodiac signs

సింహరాశి ఫలాలు : ఉల్లాసంగా ఉంటారు. వేగంగా పనులు పూర్తిచేస్తారు. ఆర్థిక విషయాలలో పురోగతి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. విద్యార్థులకు శ్రమకు తగ్గ ఫలితాలు. మంచి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మహిళలకు స్వర్ణలాభాలు. శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.

Zodiac Signs కన్యారాశి ఫలాలు : ఆర్థిక పరిస్తితులు సంతృప్తికరంగా ఉంటుంది. చేసే పనులలో విజయం సాధిస్తారు. వస్తులాభాలు. విద్యార్థులకు విజయం లభిస్తుంది. మహిళలకు లాభదాయకమైన రోజు. కుటుంబంలో అనుకోని మార్పులు జరుగుతాయి. అమ్మవారి ఆరాధన చేయండి.

Zodiac Signs తులారాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. ఆర్థిక విషయాలలో నిరాశజనకంగా ఉంటుంది. అనారోగ్య సూచన కనిపిస్తుంది. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. కార్యాలయంలో పనివత్తిడి పెరుగుతుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు. మహిళలకు అనారోగ్య సూచన. హనుమాన్‌ చాలీసా పారాయణం చేయండి.

Zodiac Signs వృశ్చికరాశి ఫలాలు : ఈరోజు సాధారణంగా ఉంటుంది. ఆర్థిక విషయాలలో సాధారణంగా ఉంటుంది. విద్యార్థులు బాగా శ్రమించాల్సిన రోజు. అనారోగ్య సూచన. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. మహిళలకు పని భారం. శ్రీ లక్ష్మీ సూక్తంతో పూజ చేయండి.

Zodiac Signs ధనుస్సురాశి ఫలాలు : ఆనుకోని లాభాలు వస్తాయి. అప్పుల బాధలు తీరుతాయి. పెద్దల నుంచి ప్రయోజనాలు పొందుతారు. కుటుంబంలో వ్యవహారాలు ఉత్సాహంగా సాగుతాయి. మంచి రోజు. అన్నిరకాల వ్యాపారులు, వృత్తుల వారికి సానుకూలమైన రోజు. ఇష్టదేవతరాధన చేయండి.

మకరరాశి ఫలాలు : ప్రతికూల ఫలితాలు వస్తాయి. ఆర్థిక సమస్యలు రావచ్చు. వ్యాపారాలు సాఫీగా సాగవు. పక్కవారితో వివాదాలకు ఆస్కారం. మనస్సులో ప్రతికూల ఆలోచనలు వస్తాయి. వృత్తికి సంబంధించిన చికాకులు. మహిళలకు చికాకులు. శ్రీ వేంకటేశ్వర వజ్రకవచం పారాయణం చేయండి.

కుంభరాశి ఫలాలు : చక్కటి ఫలితాలతో ఉల్లాసంగా గడుపుతారు. ఆకస్మిక లాభాలు వస్తాయి. పెద్దలతో పరిచయాలు. కీర్తిప్రతిష్టలు. విదేశీ విద్యకు అనుకూలమైన రోజు. ఆకస్మిక ప్రయాణాలు. మహిళలకు ఈరోజు సంతృప్తికరంగా ఉంటుంది. ఆంజనేయస్వామి ఆరాధన చేయండి.

మీనరాశి ఫలాలు : మీరు చేసే పనులలో జాప్యం పెరుగుతుంది. ఆర్థికంగా నిరాశజనకమైన రోజు. అన్ని రకాల వ్యాపారులు ఇబ్బందికరంగా ఉంటాయి. కుటుంబ పరిస్థితి ప్రతికూలంగా ఉంటుంది. మహిళలకు అనారోగ్య సూచన కనిపిస్తుంది. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన, దీపారాధన చేయండి.

Devotional Desk

No bio available for this author.

  1. "Driving Licence : మొబైల్ నంబర్ అప్డేట్ చేయకపోతే లైసెన్స్ క్యాన్సిల్ అవుతుందా..?"

  2. "Bathing Dinner : భోజనం చేసిన వెంటనే వేడి నీటితో స్నానం చేస్తే ఏమవుతుంది? నిజం ఇదే"

  3. "Radhika Apte : 41 ఏళ్లలోనే నా శరీరం, కోరికలపై అసలైన క్లారిటీ వచ్చింది: రాధికా ఆప్టే"

  4. "Yanamala Krishnudu : టీడీపీ ఎమ్మెల్యే ఉన్న చోట జనసేనలోకి మాజీ ప్రత్యర్థులు.. కాకినాడ రాజకీయాల్లో కొత్త లెక్కలు"

  5. "Vangaveeti Ranga Statue : వంగవీటి రంగా విగ్రహం చుట్టూ ముదురుతున్న రచ్చ.. జనసేన-వైసీపీ మధ్య మైండ్‌గేమ్స్..!"

  6. "Dada Movie : బాలయ్య ‘దాదా’ టీమ్‌కు డెడ్‌లైన్ టెన్షన్.. డిసెంబర్ రిలీజ్ కష్టమేనా..?"

  7. "Khairatabad Bypoll : ఖైరతాబాద్ బైపోల్ వేళ కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్.. జీహెచ్ఎంసీపై జెండా పాతేందుకు భారీ వ్యూహం..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp