Zodiac Signs : ఈ రాశిలోకి సూర్యగ్రహ ప్రవేశం.. అది ఎవరికి మంచిది? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Zodiac Signs : ఈ రాశిలోకి సూర్యగ్రహ ప్రవేశం.. అది ఎవరికి మంచిది?

 Authored By mallesh | The Telugu News | Updated on :4 March 2022,2:00 pm

Zodiac Signs : మనలో చాలా మంది జ్యోతిష్య శాస్త్రాన్ని ఎక్కువగా నమ్ముతారు. దాని ఆధారంగానే కొన్ని ఆచారాలు పాటిస్తారు. దీని ప్రకారం ఒక గ్రహం రాశి మారిన సమయంలో ఉదయించినప్పుడు అది మానవ జీవితంపై ప్రత్యక్ష ప్రభావం చూపిస్తుంది. గ్రహాలకు రాజు సూర్యడు. త్వరలోనే ఆయన మిత్రులు గురు రాశి అయిన మీనరాశిలో సంచరించబోతున్నాడు. మార్చి 15న రాత్రి 12.31 గంటలకు మీన రాశిలోకి సూర్యడు ప్రవేశించబోతున్నాడు. జ్యోతిష్య శాస్త్రంలో సూర్యుడిని ప్రతిష్ఠ, కీర్తికి కారకుడని భావిస్తుంటారు. దీని వల్ల సూర్యుడి సంచార ప్రభావం అన్ని రాశులపైనా పడుతుంది.

ముఖ్యంగా నాలుగు రాశుల వారికి ఇది లాభదాయకంగా ఉంటుంది. వృషభరాశి వారిపై సూర్యుడి సంచారం శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశి వారు వ్యాపారంలో ఆశించిన విజయాన్ని సాధిస్తారు. సూర్యభగవానుడు ఈ రాశిచక్రం ద్వారా 11వ పాదంలో సంచరిస్తాడు. ఈ సమయంలో వీరి ఆదాయం పెరుగుతుంది.మిథునరాశి నుంచి సూర్యుడు 10వ పాదంలో సంచరిస్తాడు. ఈ సమయంలో కొత్త ఉద్యోగానికి సంబంధించిన ఆఫర్‌ను పొందవచ్చు. వ్యాపారంలో డబ్బు సంపాదించే చాన్స్ ఉంటుంది. సూర్యుడు, బుధ గ్రహం మధ్య స్నేహ భావం ఉంటుంది. కర్కాటక రాశి వారికి సూర్య భగవానుడి సంచారం మంచి ఫలితాలను ఇస్తుంది.

Zodiac Signs sun entry in the constellations

Zodiac Signs sun entry in the constellations

Zodiac Signs : అంతా లాభదాయకమే..

సూర్యుడు ఈ రాశిలోని తొమ్మిదో పాదంలో సంచరిస్తాడు. దీనిని అదృష్టంగా భావిస్తారు. ఈ రాశి రావు ఏ పని మొదలుపెట్టినా అది విజయవంతంగా పూర్తవుతుంది. కుంభ రాశి వారికి సూర్యుడు రెండో పాదంలో సంచరిస్తారు. ఇది ధనానికి సంబంధించినది. ఈ రాశివారు ఆకస్మిక ధన లాభాలను పొందొచ్చు. వాహనాలు, భూములు, ఆస్తులను విషయంలో కొనుగోలు, విక్రయాలు అనుకూలంగా మారుతాయి. ఇవి కేవలం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చెప్పినవే. దీనికి సంబంధించి ఎలాంటి శాస్ట్రీయ ఆధారాలు లేవు. ఇవి కేవలం నమ్మకంపైనే ఆధారపడి ఉంటాయి.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది