Zodiac Signs : మార్చి 08 మంగళవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే..?

Authored By Devotional Desk | The Telugu News | Published on: March 7, 2022, 11:10 pm

మేష రాశి ఫలాలు : అన్ని పనులను వేగంగా ఈరోజు పూర్తిచేస్తారు. మంచి ఆహారం, విశ్రాంతి లభిస్తుంది. విద్యార్థులకు, ఉద్యోగులకు చక్కటి అవకాశాలు. ఆర్థిక పురోగతి కనిపిస్తుంది. వ్యాపారాలకు శుభదినం. మహిళలకు అనందంగా ఉంటుంది. శ్రీరామ తారకాన్ని కనీసం 108 సార్లు జపించండి. వృషభరాశి ఫలాలు : వివాదాలకు ఆస్కారం ఉంది జాగ్రత్త. గ్రహచలనాల రీత్యా కొంత ప్రతికూల వాతావరణం. ఆర్థికంగా మందగమనం. అనవసర ఖర్చులు వస్తాయి. అప్పులు ఎవరికి ఇవ్వకండి. అనారోగ్య సూచన. మహిళలకు పని భారం పెరుగుతుంది. హనుమాన్‌ చాలీసా పారాయణం చేయండి శుభం కలుగుతుంది.

మిథునరాశి ఫలాలు : శుభ ఫలితాలు వస్తాయి. అప్పులు తీరుస్తారు. అనుకూలమైన ఫలితాలతో మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆర్థిక వృద్ధి కనిపిస్తుంది. మహిళలకు లాభాలు. అన్ని రంగాల వారికి శుభ దినం. ఇష్టదేవతారాధన చేయండి. కర్కాటకరాశి ఫలాలు : మంచి ఆదాయం వస్తుంది. కొత్త అవకాశాలు లభిస్తాయి. మంచి గౌరవం పెరుగుతుంది. ప్రయాణాల వల్ల ఆనందం, లాభాలు వస్తాయి. సమస్యల నుంచి విముక్తి పొందుతారు. మహిలలకు లాభాలు. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.

సింహరాశి ఫలాలు : చెడు ఫలితాలు వస్తాయి. అప్పుల బాధలతో ఇబ్బంది. ఆర్థిక మందగమనం కనిపిస్తుంది. కుటుంబంలో వ్యవహారాలు నిరాశజనకంగా ఉంటాయి. మహిళలకు చికాకులు కనిపిస్తాయి. శ్రీ ఆంజనేయస్వామి ఆరాధన చేయండి.

Today Horoscope march 08 2022 check your Zodiac signs

Today Horoscope march 08 2022 check your Zodiac signs

కన్యరాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. ఆర్థిక విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగులకు పని భారం పెరుగుతుంది. వ్యాపారాలు సాదారణంగా ఉంటాయి. మహిళలకు సమస్యలు. శ్రీ లక్ష్మీ ఆరాధన చేయండి.

తులారాశి ఫలాలు : సానుకూల ఫలితాలు వస్తాయి. ఆనందంగా ఈరోజు గడుస్తుంది. సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. ఆనుకోని లాభాలు కనిపిస్తున్నాయి. స్త్రీల ద్వారా ప్రయోజనాలు. మహిళలకు పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది. శ్రీకృష్ణారాధన చేయండి.

వృశ్చికరాశి ఫలాలు : చక్కటి ఫలితాలు వస్తాయి. అనుకోని లాభాలు వస్తాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. మహిళలకు లాభదాయకమైన రోజు. శ్రీ ఆంజనేయస్వామి ఆరాధన చేయండి.

ధనుస్సురాశి ఫలాలు : వివాదాలకు దూరంగా ఉండాల్సిన రోజు. అప్పుల ద్వారా ఇబ్బందులు. అనుకోని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అనవసర ఖర్చులు, ధన సంబంధ విషయాలలో నిరాశ. శ్రీ లక్ష్మీ ఆరాధన చేయండి.

మకరరాశి ఫలాలు : ధైర్యంతో ముందుకు పోతారు. మనఃశాంతి ప్రశాంతత కరవు అవుతుంది. బంధవుల నుంచి ఇబ్బందులు. విద్యార్థులు బాగా శ్రమించాల్సిన రోజు. ప్రయాణాల వల్ల చికాకులు. హనుమాన్‌ దేవాలయంలో ప్రదక్షణలు చేయండి.

కుంభరాశి ఫలాలు : ఉత్సాహంగా ఈరోజు గడుపుతారు. మీరు చేసిన పనులకు మంచి ఫలితాలు వస్తాయి. ఆర్థికంగా చక్కటి ఫలితం. కొత్త అవకాశాలు వస్తాయి. వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. ఇష్టదేవతరాధన చేయండి.

మీనరాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. వివాదాలకు ఆస్కారం కనిపిస్తుంది. మీరు చేసే పనులలో జాప్యం జరుగుతుంది. విద్యార్థులు, ఉద్యోగులకు శ్రమ బారం పెరుగుతుంది. మహిళలకు లాభాలు వస్తాయి. శ్రీ ఆంజనేయారాధన చేయండి.

Devotional Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp