Zodiac Signs : మార్చి 20 ఆదివారం ఈ రోజు మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేషరాశి ఫలాలు : శుభకరమైన రోజు. అనుకోని లాభాలు వస్తాయి. మంచి వార్తలు వింటారు. ఆర్థిక విషయాలలో మంచి ఫలితాలు వస్తాయి. మహిళలకు ధనలాభాలు. విద్యా, ఉద్యోగ సంబంధ విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఇష్టదేవతారాధన చేయండి. వృషభరాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. ఇంటా, బయటా చికాకులు పెరుగుతాయి. కుటుంబంలో మనస్పర్థలు పెరుగుతాయి. ఆర్థికంగా సాధారణ పరిస్థితి. అప్పుల బాధలు పెరుగుతాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. శ్రీ సూర్యారాధన చేయండి.
మిధునరాశి ఫలాలు : ఈరోజు కొంచెం ప్రతికూల వాతావరణం కనిపిస్తుంది. అప్పుల కోసం ప్రయత్నం చేస్తారు. అనుకోని వారి నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి. బంధువులతో విభేదాలు. మహిళలకు చికాకులు. శ్రీ దుర్గా స్తోత్రం చదువుకోండి.
కర్కాటకరాశి ఫలాలు : మంచి ఫలితాలతో ముందుకుపోతారు. ఆర్థిక విషయాలలో పురోగతి కనిపిస్తుంది. శుభవార్తలు వింటారు. పాత బాకీలు వసూలు అవుతాయి. అన్నింటా విజయం సాధిస్తారు. ఇష్టదేవతారాధన చేయండి.

Today Horoscope march 20 2022 check your zodiac signs
సింహరాశి ఫలాలు : తొందరపాటుతో నష్టపోతారు. అనవసరం ఎవరిని నమ్మవద్దు ఈ రోజు. పనులు చేసేటప్పుడు ఆలోచించి చేయండి. ఎవరికి డబ్బులు ఇవ్వవద్దు. మనస్సు స్థిరంగా ఉండదు. మహిళలకు అనారోగ్య సూచన. శ్రీ ఆదిత్య హృదయం పారాయణం చేయండి.
కన్యారాశి ఫలాలు : చాలా కాలం తర్వాత ఆనందంగా గడుపుతారు. కుటుంబంలో సంతోషం వాతావరణం. సోదర, సోదరీల మధ్య ప్రేమ బంధం బలోపేతం అవుతుంది. అనవసర విషయాల చర్చతో కాలం వృథా చేస్తారు. మహిళలకు లాభాలు కనిపిస్తాయి. శ్రీ లక్ష్మీ ఆరాధన చేయండి.
తులారాశి ఫలాలు : మిశ్రమ ఫలితాలతో గడుస్తుంది ఈరోజు. ఆర్థికంగా సాధారణ స్థితి. చికాకులు పెరుగుతాయి. ఇంటా, బయటా పని భారం పెరుగుతుంది. అనవసర ఖర్చులు వస్తాయి. మహిళలకు శ్రమ పెరుగుతుంది. శ్రీ కాలభైరావాష్టకం చదవండి.
వృశ్చికరాశి ఫలాలు : ఆనందంగా గడుపుతారు ఈరోజు. ఆప్తుల నుంచి శుభవార్తలు వింటారు. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆఫీస్‌లో పై అధికారుల ప్రశంసలు పొందుతారు. వ్యాపారాలు సాఫీగా, లాభాల బాటలో నడుస్తాయి. మహిళలకు శుభవార్తలు వింటారు.శ్రీ శివారాధన చేయండి.
ధనుస్సురాశి : అన్నింటా మీకు మంచి జరుగుతుంది. ఖర్చులు తగ్గిస్తారు. ఆదాయాన్ని సేవింగ్స్ వైపు మళ్లిస్తారు. అన్నదమ్ముల నుంచి సహాయం అందుతుంది. విహార యాత్రలకు అవకాశం. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. శ్రీ విష్ణు సహస్రనామాలను చదువండి.
మకరరాశి ఫలాలు : కొంచెం ప్రతికూలత, సాయంత్రం నుంచి అనుకూలత కనిపిస్తాయి. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు ఎట్టకేలకు పూర్తిచేస్తారు. ఆర్థిక విషయాలు సాఫీగా, లాభాల బాటలో పూర్తవుతాయి. మహిళలకు విశ్రాంతి. విందులు, వినోదాలు. ఇష్టదేవతారధన చేయండి.
కుంభరాశి ఫలాలు : ఈరోజు పర్వాలేదు అన్నట్లు గడుస్తుంది. ఆర్థిక, రాజకీయ, వ్యాపార విషయాలు సాధారణంగా నడుస్తాయి. విద్యా, ఉద్యోగ విషయాలు సామాన్యంగా ఉంటాయి. మహిళలకు చికాకులు వచ్చినా వాటిని అధిగమిస్తారు. శ్రీ లలితా దేవి ఆరాధన చేయండి.
మీనరాశి ఫలాలు : అన్నింటా సానుకూలమైన ఫలితాలు వస్తాయి. ఆర్థిక విషయాలో సంతృప్తి కలుగుతుంది. మీకు ఇష్టమైన ఆహారం, విశ్రాంతి ఈరోజు లభిస్తాయి. అప్పులు తీరుస్తారు. దూర ప్రాంతం నుంచి లేటుగా శుభవార్త వింటారు. శ్రీ సూర్యనారాయణ స్వామి ఆరాధన చేయండి.