Zodiac Signs : మార్చి 20 ఆదివారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే..?

మేషరాశి ఫలాలు : శుభకరమైన రోజు. అనుకోని లాభాలు వస్తాయి. మంచి వార్తలు వింటారు. ఆర్థిక విషయాలలో మంచి ఫలితాలు వస్తాయి. మహిళలకు ధనలాభాలు. విద్యా, ఉద్యోగ సంబంధ విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఇష్టదేవతారాధన చేయండి. వృషభరాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. ఇంటా, బయటా చికాకులు పెరుగుతాయి. కుటుంబంలో మనస్పర్థలు పెరుగుతాయి. ఆర్థికంగా సాధారణ పరిస్థితి. అప్పుల బాధలు పెరుగుతాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. శ్రీ సూర్యారాధన చేయండి.

మిధునరాశి ఫలాలు : ఈరోజు కొంచెం ప్రతికూల వాతావరణం కనిపిస్తుంది. అప్పుల కోసం ప్రయత్నం చేస్తారు. అనుకోని వారి నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి. బంధువులతో విభేదాలు. మహిళలకు చికాకులు. శ్రీ దుర్గా స్తోత్రం చదువుకోండి.
కర్కాటకరాశి ఫలాలు : మంచి ఫలితాలతో ముందుకుపోతారు. ఆర్థిక విషయాలలో పురోగతి కనిపిస్తుంది. శుభవార్తలు వింటారు. పాత బాకీలు వసూలు అవుతాయి. అన్నింటా విజయం సాధిస్తారు. ఇష్టదేవతారాధన చేయండి.

Today Horoscope march 20 2022 check your zodiac signs

సింహరాశి ఫలాలు : తొందరపాటుతో నష్టపోతారు. అనవసరం ఎవరిని నమ్మవద్దు ఈ రోజు. పనులు చేసేటప్పుడు ఆలోచించి చేయండి. ఎవరికి డబ్బులు ఇవ్వవద్దు. మనస్సు స్థిరంగా ఉండదు. మహిళలకు అనారోగ్య సూచన. శ్రీ ఆదిత్య హృదయం పారాయణం చేయండి.

కన్యారాశి ఫలాలు : చాలా కాలం తర్వాత ఆనందంగా గడుపుతారు. కుటుంబంలో సంతోషం వాతావరణం. సోదర, సోదరీల మధ్య ప్రేమ బంధం బలోపేతం అవుతుంది. అనవసర విషయాల చర్చతో కాలం వృథా చేస్తారు. మహిళలకు లాభాలు కనిపిస్తాయి. శ్రీ లక్ష్మీ ఆరాధన చేయండి.

తులారాశి ఫలాలు : మిశ్రమ ఫలితాలతో గడుస్తుంది ఈరోజు. ఆర్థికంగా సాధారణ స్థితి. చికాకులు పెరుగుతాయి. ఇంటా, బయటా పని భారం పెరుగుతుంది. అనవసర ఖర్చులు వస్తాయి. మహిళలకు శ్రమ పెరుగుతుంది. శ్రీ కాలభైరావాష్టకం చదవండి.

వృశ్చికరాశి ఫలాలు : ఆనందంగా గడుపుతారు ఈరోజు. ఆప్తుల నుంచి శుభవార్తలు వింటారు. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆఫీస్‌లో పై అధికారుల ప్రశంసలు పొందుతారు. వ్యాపారాలు సాఫీగా, లాభాల బాటలో నడుస్తాయి. మహిళలకు శుభవార్తలు వింటారు.శ్రీ శివారాధన చేయండి.

ధనుస్సురాశి : అన్నింటా మీకు మంచి జరుగుతుంది. ఖర్చులు తగ్గిస్తారు. ఆదాయాన్ని సేవింగ్స్‌ వైపు మళ్లిస్తారు. అన్నదమ్ముల నుంచి సహాయం అందుతుంది. విహార యాత్రలకు అవకాశం. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. శ్రీ విష్ణు సహస్రనామాలను చదువండి.

మకరరాశి ఫలాలు : కొంచెం ప్రతికూలత, సాయంత్రం నుంచి అనుకూలత కనిపిస్తాయి. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు ఎట్టకేలకు పూర్తిచేస్తారు. ఆర్థిక విషయాలు సాఫీగా, లాభాల బాటలో పూర్తవుతాయి. మహిళలకు విశ్రాంతి. విందులు, వినోదాలు. ఇష్టదేవతారధన చేయండి.

కుంభరాశి ఫలాలు : ఈరోజు పర్వాలేదు అన్నట్లు గడుస్తుంది. ఆర్థిక, రాజకీయ, వ్యాపార విషయాలు సాధారణంగా నడుస్తాయి. విద్యా, ఉద్యోగ విషయాలు సామాన్యంగా ఉంటాయి. మహిళలకు చికాకులు వచ్చినా వాటిని అధిగమిస్తారు. శ్రీ లలితా దేవి ఆరాధన చేయండి.

మీనరాశి ఫలాలు : అన్నింటా సానుకూలమైన ఫలితాలు వస్తాయి. ఆర్థిక విషయాలో సంతృప్తి కలుగుతుంది. మీకు ఇష్టమైన ఆహారం, విశ్రాంతి ఈరోజు లభిస్తాయి. అప్పులు తీరుస్తారు. దూర ప్రాంతం నుంచి లేటుగా శుభవార్త వింటారు. శ్రీ సూర్యనారాయణ స్వామి ఆరాధన చేయండి.

Recent Posts

Sand Mafia : కల్వచర్లలో మట్టి మాఫియా.. అర్థరాత్రి లారీలు, జేసీబీల‌ను అడ్డుకున్న స్థానిక ప్ర‌జ‌లు..!

Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…

4 hours ago

Viral Video : కోడితో పిట్ట కొట్లాట.. ఈ పందెంలో ఎవరు గెలిచారో చూడండి..!

Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…

6 hours ago

Rashmika Mandanna : 10 ర‌ష్మిక‌- విజ‌య్ దేవ‌ర‌కొండ రిలేష‌న్ గురించి ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించిన కింగ్‌డ‌మ్ నిర్మాత‌

Rashmika Mandanna :  చాలా రోజుల త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్‌డ‌మ్ చిత్రం విజ‌య్‌కి బూస్ట‌ప్‌ని…

7 hours ago

Three MLAs : ఆ ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడే ఛాన్స్..?

Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…

8 hours ago

Hero Vida : కేవలం రూ.45,000తో 142కి.మీ మైలేజ్‌.. రికార్డ్‌ స్థాయిలో అమ్మకాలు!

Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…

9 hours ago

PM Kisan : పీఎం కిసాన్ నిధులు విడుద‌ల‌.. రూ.2 వేలు ప‌డ్డాయా లేదా చెక్ చేసుకోండి..!

PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…

10 hours ago

Dharmasthala : ధర్మస్థలలో ఎక్కడ చూసిన మహిళల శవాలే.. అసలు ఏం జరిగింది..?

Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…

11 hours ago

Gudivada Amarnath : అక్రమంగా సంపాదించిన డబ్బును దాచుకోవడానికి చంద్రబాబు సింగపూర్ టూర్ : అమర్‌నాథ్

Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…

13 hours ago