Zodiac Signs : మార్చి 28 సోమవారం ఈ రోజు మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేషరాశి ఫలాలు : మంచి నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబంలో శుభకార్య యోచన. అప్పుల బాధలు తీరుతాయి. మీరు చేసే పనులలో ఆటంకాలు తొలిగిపోతాయి. అనుకోని అతిథి రాకతో సంతోషం. శ్రీ శివారాధన చేయండి. వృషభ రాశి ఫలాలు : ఈరోజు ఈ రాశివారు చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. పెద్దల ద్వారా ముఖ్య సమాచారం తెలుసుకుంటారు. అనుకోని ధనలాభాలు వస్తాయి. కుటుంబంలో సంతోషం. ఇష్టదేవతారాధన చేయండి.
మిధున రాశిఫలాలు : ఈరోజు చక్కటి శుభ పలితాలను పొందుతారు. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. చేసే పనులలో వేగం పెరుగుతుంది. ఆర్తికంగా మంచి రోజు. మహిళలకు శుభ ఫలితాలు. లక్ష్మీదేవి ఆరాధన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : విద్యా, ఉద్యోగ విషయాలలో దూసుకెళ్తారు. అనుకోని ధనలాభాలు వస్తాయి. మధ్యాహ్నం తర్వాత కొంచెం ప్రతికూల వాతావరణం కనిపిస్తుంది. కానీ మీ తెలివితేటలతో వాటిని అధిగమిస్తారు. వివాదాలకు దూరంగా ఉండండి. శివాలయంలో ప్రదక్షణలు, దీపారాధన చేయండి.

Today Horoscope march 28 2022 check your zodiac signs
సింహ రాశి ఫలాలు : అందరి నుంచి మీకు సహాయ సహకారాలు అందుతాయి. అప్తుల నుంచి శుభవార్తలు వింటారు. విద్యా, వ్యాపార వర్గాల వారికి లాభాలు. ఈ రోజు విందులు, వినోదాలలో పాల్గొంటారు. శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో ప్రదక్షణల చేయండి.
కన్య రాశి ఫలాలు : మీకు కొంచెం ఇబ్బంది. అయితే మీరు ధైర్యంతో మందుకుపోతారు. అప్పులు తీరుస్తారు. అనుకోని ధనలాభాలు రావచ్చు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. మహిళలకు కొంచెం శ్రమ పెరుగుతుంది. శ్రీ లక్ష్మీ అష్టోతరంతో దేవుడి పూజ చేయండి.
తుల రాశి ఫలాలు : కొంచెం ప్రతికూల వాతావరణం అయినా మీరు అధిగమిస్తారు. కుటంబంలో సఖ్యత పెరుగుతుంది. ఆర్థిక విషయాలలో మంచి అభివృద్ధి కనిపిస్తుంది. అన్నింటా జయం. ఇష్టదేవతరాధన చేయండి.
వృశ్చిక రాశి ఫలాలు : మీరు విజయాలను సాధిస్తారు. అనుకున్న సమయానికి ముందే మీరు చేసే పనులను పూర్తిచేస్తారు. కుటుంబంలో శుభ కార్య యోచన చేస్తారు. పిల్లల ద్వారా శుభవార్తలు వింటారు. శ్రీ శివారాధన చేయండి.
ధనస్సు రాశి ఫలాలు : కొంచెం ప్రతికూలం. వివాదాలకు దూరంగా ఉండండి. ధైర్యంతో పనులు చేయాలి. అప్పులు చేయకండి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. మహిళలకు పని భారం, అనారోగ్య సూచన. శివాభిషేకం చేయించండి.
మకర రాశి ఫలాలు : మీరు సంతోషకరమైన వార్తలు వింటారు. అన్నదమ్ముల నుంచి సహాయం అందుతుంది. విలువైన ఆస్తులు, వస్తువులు కొంటారు. పనులను సాఫీగా పూర్తిచేస్తారు. శ్రీ శివకవచం పారాయణం మంచి ఫలితాన్నిస్తుంది.
కుంభ రాశి ఫలాలు : కొంచెం కష్టంగా ఈరోజు గడుస్తుంది. అనుకోని అపదలు రావచ్చు. వాహనాలను నడిపేటప్పుడు జాగ్రత్త. ఎవరికి అప్పులు ఇవ్వకండి. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాల్సి న రోజు. శ్రీ రుద్రాభిషేకం చేయండి.
మీన రాశి ఫలాలు : ఈరోజు సానుకూలమైన రోజు. అనుకోని విధంగా ఈరోజు మీకు స్నేహితులు లేదా కుటుంబ సభ్యుల నుంచి సమయానికి సహాయం అందుతుంది. సాయంత్రం నుంచి శుభవార్తలు వింటారు. మహిళలకు ధనలాభ సూచన. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.