Zodiac Signs : మే 01 ఆదివారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….?

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: April 30, 2022, 10:41 pm

మేషరాశి ఫలాలు : మీరు చేసే పనులు వేగంగా పూర్తిచేస్తారు. అనుకోని లాభాలు వస్తాయి. అప్తుల నుంచి శుభ వార్తలు వింటారు. విందులు, వినోదాలు. మహిళలకు లాభాలు. శ్రీ లక్ష్మీ స్తోత్రం పారాయణం చేయండి. వృషభ రాశి ఫలాలు : అనుకోని ఇబ్బందులు. మహిళలకు చికాకులు పెరుగతాయి. ఆర్థికంగా మందగమనం. అనుకోని నష్టాలు వస్తాయి. ఆరోగ్య భంగం. చికాకులతో మనస్థాపం. శ్రీ కాలభైరావాష్టకం పారాయణం చేయండి.

మిథున రాశి ఫలాలు : విజయాలను సాధిస్తారు. అనుకోని మార్గాల ద్వారా ఆదాయం వస్తుంది. అప్పులు తీరుస్తారు. అమ్మ తరుపున వారి నుంచి లాభాలు. ఆరోగ్యం బాగుంటుంది. ప్రయాణ సూచన. వ్యాపారులకు లాభాలు. శ్రీ ఆదిత్య హృదయం పారాయణం చేయండి. కర్కాటక రాశి ఫలాలు : ఇంటా, బయటా అనుకూలమైన రోజు. పనులను వేగంగా పూర్తిచేస్తారు. అనుకున్న వాటిని సాధిస్తారు. లక్ష్య సాధనకు బాగా కస్టపడుతారు. అప్పులు తీరుస్తారు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. కుటుంబంలో సంతోషం. ఇష్టదేవతరాధన చేయండి.

Today Horoscope May 01 2022 Check Your Zodiac Signs

Today Horoscope May 01 2022 Check Your Zodiac Signs

సింహరాశి ఫలాలు : మీరు చేసే పనులలో ఆటంకాలు వస్తాయి. అర్థికంగా ఇబ్బందికరమైన రోజు. వివాదాలకు అవకాశం ఉంది. అనుకోని ప్రయాణాలు. చికాకులు కనిపిస్తున్నాయి. మానసిక ప్రశాంతత కొరవడుతుంది. ఆదిత్య హృదయం పారాయణం చేయండి.

కన్యారాశి ఫలాలు : అనుకోని నష్టాలు వస్తాయి. కుటుంబంలో చిన్నచిన్న సమస్యలు వస్తాయి. అప్పుల కోసం ప్రయత్నిస్తారు. మాట పట్టింపుతో ఇబ్బందులు. సర్దుకుని పోవాల్సిన రోజు. మహిళలకు లాభాలు. కాలభైరావాష్టకం పారాయణం చేయండి.

తులారాశి ఫలాలు : కుటుంబంలో అనుకోని మార్పులు. అనవసర విషయాలతో ఇబ్బందులు. ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. రియల్ ఎస్టేట్లో పెట్టుబడులకు అనకులమైన రోజు కాదు. శివారాధన చేయండి.

వృశ్చికరాశి ఫలాలు : మీరు చేసే ప్రతి పనిలోనూ అనూహ్యమైన విజయం సాధిస్తారు. కుటుంబంలో మంచి వాతావరణం. శుభ వార్తలు వింటారు. పెద్దల నుంచి, సోదరుల నుంచి సహాయం, గౌరవాన్ని పొందుతారు. మహిళలకు ధనలాభాలు. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.

ధనుస్సురాశి ఫలాలు : మీరు జాగ్రత్తగా వ్యవహిరించాల్సిన రోజు. అనుకోని నష్టాలు వస్తాయి. ఆర్థికంగా మందగమనం. పెద్దల ద్వారా ఇబ్బంది. ఆరోగ్య సమస్యలు రావచ్చు. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు. కాలభైరావాష్టకం పారాయణం చేయండి.

మకరరాశి ఫలాలు : మంచి వార్తలు వింటారు. కుటుంబంలో సంతోషవాతావరణం కనిపిస్తుంది. ఆర్థికంగా చక్కటి ఫలితాలు. అనిన రకాల వ్యాపారాలు లాభదాయకంగా సాగుతాయి. విద్యా, ఉద్యోగం అనుకూలం. శ్రీ కనకదుర్గదేవి ఆరాధన చేయండి.

కుంభరాశి ఫలాలు : మీరు అన్నింటా ఆచితూచి అడుగువేసి విజయం సాధిస్తారు, పెద్దల ద్వారా ప్రయోజనాలు పొందుతారు. ఆర్థికంగా చక్కటి శుభదినం. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. మహిళలకు స్వర్ణలాభాలు. ఇష్టదేవతరాధన చేయండిజ

మీనరాశి ఫలాలు : మిశ్రమ ఫలితాలతో ఇబ్బంది పడుతారు. సాయంత్రం నుంచి కొంచెం అనుకూలత పెరుగుతుంది. ఆర్థికంగా చికకాకులు, ఎవరికి అప్పులు ఇవ్వద్దు. పెట్టుబడులకు మంచి రోజు కాదు. వ్యాపారాలు సాధారణం. మహిళలకు పనిభారం. శ్రీ విష్ణు సహస్రనామాలను పారాయణం చేయండి.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp