Zodiac Signs : మే 08 ఆదివారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….?

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 7 May 2022, 10:40 pm

మేషరాశి ఫలాలు : చక్కటి శుభ ఫలితాలు వస్తాయి. ఆనందంగా గడుపుతారు, ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులను కొంటారు. విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మహిళలకు లాభాలు. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి. వృషభ రాశి ఫలాలు : మంచి కాలం మీకు ఈరోజు.ఆర్థికంగా లాభదాయకమైన రోజు. చెడు వ్యక్తులకు దూరంగా ఉంటారు. అనుకోని చోట నుంచి ఆదాయం వస్తుంది. అన్ని రకాల వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. విద్యా, ఉద్యోగ అంశాలు చక్కగా సాగుతాయి. శ్రీ లలితాదేవి ఆరాధన చేయండి.

మిధునరాశి ఫలాలు : కొంచెం ఇబ్బందికరమైన రోజు. అనవసర ఖర్చులు వస్తాయి. భయం, ఆందోళనతో కూడిన రోజు. పక్కవారితో వివాదాలు. సంయమనం పాటించాల్సిన రోజు. ఆర్థిక మందగమనం. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. శ్రీ ఆదిత్య హృదయం పారాయణం చేయండి. కర్కాటక రాశి ఫలాలు : మీరు చేసే పనులలో జాప్యం పెరుగుతుంది. ఆశించిన మేర ఫలితాలు రావు. మీకు ఈరోజు కొంత చికాకులు ఎదురవుతాయి, అప్పులు ఎవరికి ఇవ్వద్దు. దైర్యంగా ముందుకుపోతేనే విజయం సాదించగలరు. అన్నదమ్ముల నుంచి సహకారం పొందుతారు. శ్రీ లక్ష్మీ గణపతి ఆరాధన చేయండి.

Today Horoscope may 08 2022 check your zodiac signs

Today Horoscope may 08 2022 check your zodiac signs

సింహరాశి ఫలాలు : చక్కటి సంతోషకరమైన రోజు. ఆనందంగా గడుపుతారు. మిత్రులతో కలిసి విందులు, వినోదాలకు హాజరవుతారు. విలువైన వస్తువులు కొంటారు. ఆర్థిక పురోగతి. మహిళలకు లాభాలు. శ్రీ లక్ష్మీ సూక్తంతో అమ్మవారి ఆరాధన చేయండి.

కన్యారాశి ఫలాలు : అనుకోని వారి నుంచి ప్రయోజనాలు పొందుతారు. అప్పులు తీరుస్తారు. ఆర్థికంగా మంచి రోజు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. సాయంత్రం శుభవార్త వింటారు. మిత్రులను కలుస్తారు. ఇష్టదేవతరాధన చేయండి.

తులారాశి ఫలాలు : మీరు చేసే పనులలో ఇబ్బందులు. ధైర్యం కోల్పోతారు, అనవసర ఆందోళనలు. ఇష్టమైన వారి నుంచి చెడు వార్తలు వింటారు. ఆర్థిక నష్టాలు. కుటుంబంలో సమస్యలు., మహిళలకు చికాకులు. శ్రీ కాలభైరావాష్టకం పారాయణం చేయండి.

వృశ్చికరాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. అప్పుల కోసం ప్రయత్నం. అనవసర వివాదాలకు ఆస్కారం ఉంది. కుటుంబంలో చికాకులు. మధ్యాహ్నం తర్వాత వాతావరణం మార్పులు. అనకూలతలు పెరుగుతాయి. అనందంగా గడపడానికి ప్రయత్నిస్తారు. శ్రీ దుర్గాదేవి ఆరాదన చేయండి.

ధనుస్సు రాశి ఫలాలు : విలువైన సమాచారం అందుతుంది. విదేశీ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. అనుకోని వారి నుంచి ప్రయోజనాలు పొందుతారు. దాన ధర్మాలు చేస్తారు. ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. మహిఃళలకు లాభాలు. శ్రీ లక్ష్మీనారాయణ ఆరాధన చేయండి.

మకరరాశి ఫలాలు : అనుకున్న పనులు పూర్తిచేస్తారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. విద్యా, ఉద్యోగ విషయాలలో అనుకూలత కనిపిస్తుంది. వాహనాలను కొనుగోలుకు ప్రయత్నిస్తారు,మంచి వార్తలు వింటారు. మిత్రులతో కలసి విందులకు హాజరవుతారు. ఇష్టదేవతారాధన చేయండి.

కుంభరాశి ఫలాలు : వివాదాలకు ఆస్కారం ఉంది. ఆదాయం పెరుగుతుంది కానీ సంతృప్తి ఉండదు. ఖర్చులు బాగా పెరుగుతాయి. విద్యార్థులు బాగా శ్రమించాల్సిన సమయం. వ్యాపారాలు, వృతివ్త విషయంలో కొంత చికాకులు వస్తాయి. మహిలలకు అనారోగ్య సూచన. అమ్మవారి ఆరాధన చేయండి.

మీనరాశి ఫలాలు : చక్కటి శుభ ఫలితాలు వస్తాయి. అనుకున్న దానికంటే ఎక్కువగా సంతోషంగా ఉంటారు. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. విద్యా, ఉపాది, వ్యాపారాలలో చక్కటి ఫలితాలను పొందుతారు. మహిలలకు స్వల్ప అనారోగ్య సూచన. శ్రీ ఆదిత్య హృదయం పారాయణం చేయండి.

Advertisement

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

  1. "Ravi Teja : అచ్చం రవితేజనే అనుకుంటారు.. ఈ వ్యక్తి వీడియో చూసి షాక్ అవుతున్న నెటిజన్లు!"

  2. "Bengaluru Triple Murder AI ని ఈ రేంజ్‌లో వాడుతున్నారా.. మర్డర్ నుంచి శ‌వం మాయం చేసేవ‌ర‌కు దర్యాప్తులో షాకింగ్ విషయాలు..!"

  3. "Gabbar Singh Actor Ramesh Brain Stroke : పవన్ కల్యాణ్ గబ్బర్ సింగ్’ నటుడు రమేష్‌కు బ్రెయిన్ స్ట్రోక్.. ప‌రిస్థితి విష‌మం"

  4. "Uppal Beerappagadda : ఉప్పల్‌ బీరప్పగడ్డలో SIR ప్రచార రథానికి శ్రీకారం.. ఓటరు జాబితా సవరణపై పరమేశ్వర్ రెడ్డి కీలక పిలుపు"

  5. "Telangana Farmers : తెలంగాణ రైతులకు కేంద్రం బంపర్ గుడ్ న్యూస్ చెప్పిన మోదీ..!"

  6. "Uppal Congress : ఉప్పల్‌లో కాంగ్రెస్ భారీ నిరసన.. రాహుల్ గాంధీ అరెస్టుపై ఆగ్రహం, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్"

  7. "NEET Protest Delhi : నీట్ ఆందోళనలో కొత్త ట్విస్ట్.. విద్యార్థుల సమస్యా? రాజకీయ పోరాటమా..? సీజేపీ నాయకులు ఎక్కడ?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి