Zodiac Signs : మే 10 మంగళవారం ఈ రోజు మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే….?
మేషరాశి ఫలాలు : కొంచెం కష్టం, కొంచెం సుఖంతో కూడిన రోజు. అనుకోని నష్టాలు వస్తాయి. అప్పుల కోసం ప్రయత్నిస్తారు. ఆర్థికంగా ఇబ్బంది. ఆరోగ్యం బాగుండదు. అన్నదమ్ముల నుంచి వత్తిడులు. అన్ని రంగాల వారికి కొంచెం కష్టం. సాయంత్రం నుంచి కొంచెం విశ్రాంతి. నవగ్రహ ఆరాధన చేయండి. వృషభరాశి ఫలాలు : మీరు చేసే అన్నిపనులు చక్కగా పూర్తిచేస్తారు. అప్పులు తీరుస్తారు. ఆర్థికంగా బాగుంటుంది. వ్యాపార లావాదేవీలు సాఫీగా సాగుతాయి. కుటుంబంలోసఖ్యత, ఆనందం నిండిన రోజు. ఇష్టదేవతారాధన చేయండి.
మిథునరాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. శుభ వార్తల కోసం ఎదురుచూసి నిరాశ పడుతారు. అనుకోని ఖర్చులు వస్తాయి. మనస్సు స్థిరంగా ఉండదు. అన్ని రంగాల వారికి ఇబ్బందుల నుంచి బయడపడుతారు. మహిళలకు లాభదాయకంగా ఉంటుంది. కాలభైరావాష్టకం పారాయణం చేయండి. కర్కాటక రాశి ఫలాలు : మీరు చేసే అన్నింటా విజయం సాధిస్తారు. కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.
సింహరాశి ఫలాలు ; కొంచెం శ్రమించాల్సిన అవసరం. పెద్దలతో చికాకులు వస్తాయి. వివాదాలకు ఆస్కారం. అనుకోని మార్గాల ద్వారా ఆదాయం కోసం ప్రయత్నిస్తారు. అప్పులు చేస్తారు. మహిళలకు చికాకులు. శ్రీ ఆంజనేయస్వామి ఆరాధన చేయండి.
కన్యారాశి ఫలాలు : మీరు చేసిన పనులతో లాభాలు ఆర్జిస్తారు. అనుకోని లాభాలు వస్తాయి. అప్పులు తీరుస్తారు. ఆర్థికంగా పురోగతి కనిపిస్తుంది. మంచి విషయాలను తెలుసుకుంటారు. ఇంట్లో సందడి వాతావరణం. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.
తులారాశి ఫలాలు : చాలా కాలంగా ఎదురుచూస్తున్న శుభవార్తలు వింటారు. ఆరోగ్యం బాగుంటుంది. అనుకున్న పనులు చేస్తారు. ఆర్థికంగా చక్కటి ఫలితాలు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. మహిలలకు లాభాలు. శ్రీ గణపతి ఆరాధన చేయండి.
వృశ్చిక రాశి ఫలాలు : మీరు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. విద్యా, ఉద్యోగ విషయాలలో అనుకూలతలు కనిపిస్తున్నాయి. ప్రయాణాలు చేస్తారు. మనస్సు స్థిరంగా ఉండదు. మహిళలకు లాభాలు. ఇష్టదేవతారాధన చేయండి.
ధనుస్సు రాశి ఫలాలు : అన్ని రకాల వృత్తుల వారికి చక్కటి శుభ ఫలితాలు. ఆర్థికంగా లాభాలు వస్తాయి. ఉద్యోగాల చేసేవారికి శుభదినం. అప్పులు వసూలు అవుతాయి. మహిలలకు మంచిరోజు. కుటుంబంలో సంతోషం. చింతామణి గణపతి ఆరాధన చేయండి.
మకరరాశి ఫలాలు : అనుకోని కష్టాలు వస్తాయి. అప్పుల కోసం ప్రయత్నిస్తారు. కుటుంబంలో ఆదరణ పెరుగుతుంది. వాహనయోగం. అన్ని రకాల వ్యాపారులకు కొంచెం కష్టంగా ఉంటుంది. విద్యార్థులు శ్రమంచాల్సిన సమయం. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.
కుంభ రాశి ఫలాలు : ఆనందంగా ఈరోజు గడుస్తుంది. కుటుంబంలో సంతోషం. శుభకార్య యోచన. అనుకోని వారి నుంచి లాభాలు వస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. మహిళలకు ధనలాభాలు. ఇష్టదేవతరాధన చేయండి.
మీన రాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. ఆర్థికంగా సాధారణ పరిస్థితి ఉంటుంది. అప్పుల కోసం ప్రయత్నిస్తారు. ఇంట్లో చికాకులు పెరుగుతాయి. సాయంత్రం శుభ వార్త వింటారు. మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది. నవగ్రహాల చుట్టు ప్రదక్షణలు చేయండి.