Zodiac Signs : మే 11 బుధవారం ఈ రోజు మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే….?
మేషరాశి ఫలాలు : కుటుంబంలో సంతోషం వాతావరణం. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. ఆర్థికంగా సంతోషం. అప్పులు తీరుస్తారు. ముఖ్య పనులను పూర్తిచేస్తారు. శ్రీ లక్ష్మీగణపతి ఆరాధన చేయండి. వృషభరాశి ఫలాలు : మంచి వార్తలు వింటారు. అనుకోని వారి నుంచి లాభాలు పొందుతారు. ధన యోగం ఉంది. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. సమాజంలో మంచి గౌరవం లభిస్తుంది. ఇష్టదేవతరాధన చేయండి.
మిధునరాశి ఫలాలు : కొంచెం కష్టం కొంచెం సుఖం ఉంటుంది. అప్పులు తీరుస్తారు. ఆదాయం పెరుగుతుంది. ఇంట్లోకు అవసరమైన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. మహిళలకు ధనలాభాలు. శ్రీ రామ తారకాన్ని ఆరాధన చేయండి. కర్కాటకరాశి ఫలాలు : మంచి చేద్దామనుకున్న చెడుగా మారుతుంది. అప్పులు తీర్చడానికి ప్రయత్నిస్తారు,. ఆదాయం సాదారణంగా ఉంటుంది. వ్యాపారాలు నిర్వహించే జాగ్రత్తగా చూసుకోవాలి. విద్యా, ఉద్యోగ సంబంధ విషయాలు సామాన్యంగా ఉంటాయి. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.
సింహరాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. అప్పులు చేస్తారు. ఆర్థికంగా మందగమనం. మానసిక ఆందోళన. అనుకోని ఇబ్బందులు. విద్యార్థులు బాగా శ్రమించాల్సిన సమయం. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.,
కన్యారాశి ఫలాలు : మీరు చేసే పనులు పూర్తిచేస్తారు. ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో శుభకార్య ఆలోచన చేస్తారు. సమాజ సేవలో పాల్గొంటారు. స్త్రీలకు ధనలాభాలు వస్తాయి. శ్రీ రామ ఆరాధన చేయండి.
తులారాశి ఫలాలు : కష్టపడాల్సిన రోజు. ఆర్థికంగా మందగమనం. అనుకోని ఖర్చులు వస్తాయి. వివాహ ప్రయత్నాలు చేస్తారు. విందులు, వినోదాలు. బంధువుల ద్వారా సహాయం అందుతుంది. శ్రీ కాలభైరావాష్టకం పారాయణం చేయండి.
వృశ్చికరాశి ఫలాలు : చక్కటి శుభ ఫలితాలు వస్తాయి. ఆనుకోని మార్గాల ద్వారా లాభాలు ఆర్జిస్తారు. అప్పులు తీరుస్తారు. అన్నదమ్ముల నుంచి ప్రయోజనాలు పొందుతారు. కుటుంబంలో శుభకార్యం. శ్రీ దుర్గాదేవి దగ్గర పసుపు వత్తులతో దీపారాధన చేయండి.
ధనుస్సురాశి ఫలాలు : శుభ సమయం. అనుకోని మార్గాల ద్వారా ధనం లభిస్తుంది. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబంలో సఖ్యత. ధన సంబంధ పురోగతి కనిపిస్తుంది. మహిళలకు శుభ దినం. శ్రీ గణపతి ఆరాధన చేయండి.
మకరరాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. ధన సంబంధ విషయాలలో ఆచితూచి వ్యవహరించాలి. కుటుంబంలో వివాదాలు. అప్పుల కోసం ప్రయత్నం. అనుకోని ఖర్చులు. ప్రయాణాలు చేస్తారు. అమ్మవారి ఆరాధన చేయండి.
కుంభరాశి ఫలాలు : పెద్దల ద్వారా మంచి వార్తలు వింటారు. గ్రహచలనాల రీత్యా అంతా సవ్యంగా ఉంటుంది. బంధవులతో లాభాలు పొందుతారు. అనుకోని వారి నుంచి లాభాలు సంపాదిస్తారు. విద్య, ఉద్యోగ సంబంధ విషయాలలో అనుకూలంగా ఉంటుంది. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.
మీనరాశి ఫలాలు : మీరు చేస్తున్న పనులలో ఆటంకాలు. అనుకోని ఖర్చులు వస్తాయి. ఆదాయం తగ్గుతుంది, కలహాలకు ఆస్కారం ఉంది. అందోళన, మానసిక ప్రశాంతత లోపించడం జరుగుతాయి. వివాదాలకు దూరంగా ఉండండి. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.