Zodiac Signs : మే 15 ఆదివారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….?

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: May 14, 2022, 10:40 pm

మేషరాశి ఫలాలు : మీరు చక్కటి శుభ ఫలితాలను పొందుతారు. అన్ని విధాలుగా శుభదినం. అప్పులు తీరుస్తారు. కుటుంబంలో మంచి మార్పులు జరుగుతాయి. ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. ఇష్టదేవతారాధన చేయండి. వృషభరాశి ఫలాలు : మీరు చేసే పనులలో వేగం పెరుగుతుంది. విందులు, వినోదాలు. విశ్రాంతి లభిస్తుంది. కుటుంబంలో చక్కటి సంతోషకర వాతావరణం. ఆర్థికంగా మంచి రోజు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఆదిత్య హృదయం పారాయణం చేయండి.

మిథునరాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. అరోగ్యం కొంచెం ఇబ్బంది పెడుతుంది. ఆర్థిక మందగమనం. వ్యాపారాలు పర్వాలేదు. బంధవుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. విద్యా, ఉద్యోగ విషయాలు అనుకూలం. శ్రీ లలితాదేవి ఆరాధన చేయండి. కర్కాటకరాశి ఫలాలు : అన్నింటా శుభ ఫలితాలు వసస్తాయి. కుటుంబంలో శుభకార్య ప్రయత్నం. అనుకోని మార్పులు జరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. లాభాలు వస్తాయి. ప్రయాణ సూచన. చింతామణి గణపతి ఆరాధన చేయండి.

Today Horoscope may 15 2022 check your zodiac signs

Today Horoscope may 15 2022 check your zodiac signs

సింహరాశి ఫలాలు : అనుకోని ఇబ్బందులు వస్తాయి. అప్పుల కోసం ప్రయత్నిస్తారు. అనుకోని అతిథి రాకతో సందడి. విశ్రాంతి లభించక ఇబ్బంది పడుతారు. అనుకోని ప్రయాణాలు. ఒత్తిడులు. మహిళలకు పనిభారం. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.

కన్యారాశి ఫలాలు : శుభ దినం. అనుకూలమైన ఫలితాలు. విద్యా, ఉద్యోగ విషయాలు అనుకూలంగా ఉంటాయి. మంచి ఆహారం, విహారం లబిస్తాయి. పెద్దల ద్వారా లాభాలు గడిస్తారు. మహిళలకు శుభ వార్తలు. ఇష్టదేవతారాధన చేయండి.

తులారాశి ఫలాలు : మీరు చాలాకాలంగా చేస్తున్న పనులు పూర్తిచేస్తారు. అప్పులు తీరుస్తారు. కుటుంబంలో సంతోషం. విద్యా, ఉపాధి విషయాలు అనుకూలం. ఆర్థికంగా పురోగతి కనిపిస్తుంది. లలితాదేవి ఆరాధన చేయండి.

వృశ్చికరాశి ఫలాలు : అనుకోని లాభాలు వస్తాయి. పెద్దల ద్వారా శుభవార్తలు వింటారు. ఆర్థిక పురోగతి కనిపిస్తుంది. మంచి పనులు చేస్తారు. ఆధ్యాత్మిక వాతావరణం లో సంచరిస్తారు. వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. ఇష్టదేవతారాధన చేయండి.

ధనుస్సురాశి ఫలాలు : మంచి వార్తలు వింటారు. ఆర్థికంగా చక్కటి రోజు. కుటుంబంలో సంతోషం. విందులు, వినోదాలకు హాజరవుతారు. శుభకార్యం చేయాలని భావిస్తారు. అప్పులు తీరుస్తారు. శుభదినం. శ్రీ సూర్యారాధన చేయండి.

మకరరాశి ఫలాలు : కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ ధైర్యంతో ముందుకుపోతారు. అనుకోని మార్పులు జరుగుతాయి. వ్యాపారాలు సాఫీగా సాగినా లాభాలు రావు. ఆశించిన విధంగా రోజు గడవక చికాకు పడుతారు. విద్యా, ఉద్యోగ విషయాలు పర్వాలేదు. శివారాధన చేయండి.

కుంభరాశి ఫలాలు : మీరు చేసే ప్రతి పనిలోనూ కొంచెం ఇబ్బందిపడినా చివరకు అధిగమించి పని పూర్తిచేస్తారు. మంచి వార్తలు వింటారు. ఆర్థికంగా పర్వాలేదు. అనుకోని వారి నుంచి లాభాలు పొందుతారు. ఆలయ దర్శనాలు. వ్యాపార, రామ తారకాన్ని జపించండి.

మీనరాశి ఫలాలు : అనందంగా ఈరోజు గడుస్తుంది. కుటుంబంలో చికాకులు తొలిగిపోతాయి. అనుకోని వారి నుంచి శుభవార్తలు వింటారు. విద్యా, విదేశీ ప్రయాణాలు అనుకూలం. మంచి రోజు. ఇష్టదేవతారాధన చేయండి.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp