Zodiac Signs : మే 29 ఆదివారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….?

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: May 28, 2022, 10:40 pm

మేషరాశి ఫలాలు : ఆర్థికంగా బాగుంటుంది. చాలా కాలంగా వేచి చూస్తున్న శుభవార్తలు వింటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబంలో సానుకూలమైన వాతావరణం. అనుకోని ధనలాభాలు. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి. వృషభరాశి ఫలాలు : చికాకులతో ఈరోజు గడుస్తుంది. కుటుంబంలో అనుకోని మార్పులు. ఆర్థికంగా మందగమనం. అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేస్తారు. పాత బాకీలు వసూలు అవుతాయి. మహిళలకు చికాకులు. శ్రీ ఆదిత్య హృదయం పారాయణం చేయండి.

మిథునరాశి ఫలాలు : శుభవార్తలు వింటారు. ఆనందంగా గడుపుతారు. కుటుంబంలో మంచి వాతావరణం. అన్నదమ్ముల నుంచి లాభాలు పొందుతారు. బంధువుల నుంచి శుభవార్తలు. శ్రీ సూర్యనారాయణ స్వామి ఆరాధన చేయండి. కర్కాటకరాశి ఫలాలు : చక్కటి శుభసమయం. అనుకోని లాభాలు వస్తాయి. ఆర్థికంగా పురోగతి కనిపిస్తుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. విలువైన వస్తువులు కొంటారు. శ్రీ లక్ష్మీగణపతి ఆరాధన చేయండి.

Today Horoscope May 29 2022 Check Your Zodiac Signs

Today Horoscope May 29 2022 Check Your Zodiac Signs

సింహరాశి ఫలాలు : మీరు చేసే పనులలో ఆటంకాలు వస్తాయి. ఆర్థికంగా ఇబ్బందులు. రుణ ప్రయత్నం చేస్తారు. వ్యాపారా లావాదేవీలు సామాన్యంగా సాగుతాయి. ప్రయాణ సూచన. మిత్రుల సహకారంతో కొద్దిగా ఉపశమనం కలుగుతుంది. కాలభైరావాష్టకం పారాయణం చేయండి.,

కన్యారాశి ఫలాలు ; కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం. అనుకోని మార్గాల ద్వారా ఆదాయం. విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఇరుగుపోరుగు వారితో లాభాలు. మహిళలకు మంచి రోజు. ఇష్టదేవతారాధన చేయండి.

తులారాశి ఫలాల : చాలా కాలంగా వేచి చూస్తున్న ఆస్తి వివాదాలకు పరిష్కారం లభిస్తాయి. వ్యాపార లావాదేవీలు సాఫీగా సాగుతాయి. మిత్రులను కలుసుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో లాభాలు. శ్రీ శివారాధన చేయండి.

వృశ్చికరాశి ఫలాలు : చక్కటి ఆనందపూరితమైన రోజు. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారాలలో లాభాలు వస్తాయి. ఇంటా, బయటా ఆశ్చర్యకరమైన ఫలితాలు. విదేశీ ప్రయాణాలకు అనుకూలం. మహిళలకు లాభాలు. శ్రీలలితాదేవి ఆరాధన చేయండి.

ధనుస్సురాశి ఫలాలు : అన్ని రకాలుగా బాగుంటుంది. క్షేత్ర పర్యటనలకు అవకాశం ఉంది. తీసుకున్న రుణాలను తీరుస్తారు. మంచి వార్తలు వింటారు. ఆర్థిక ఫలితాలు బాగుంటాయి. మహిళలకు చక్కటి రోజు. దైవ చింతన పెరుగుతుంది. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.

మకరరాశి ఫలాలు : ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికంగా పురోగతి కనిపిస్తుంది. అనుకోని ప్రయాణాలు. వ్యాపారాలలో లాభాల గడుస్తాయి. మంచి వార్తలు వింటారు. మహిళలకు శుభఫలితాలు. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.

కుంభరాశి ఫలాలు : కుటుంబంలో అనుకోని సానుకూలమైన మార్పులు. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థికంగా మంచి ఫలితాలు. లాభాలు గడిస్తారు. ప్రోత్సాహకరమైన రోజు. విందులు, వినోదాలకు హాజరవుతారు. మహిళలకు తల్లితరుపు వారి నుంచి ఆహ్వానాలు. శ్రీ లక్ష్మీగణపతి ఆరాధన చేయండి.

మీనరాశి ఫలాలు : చికాకులు తగ్గుతాయి. అనుకోని చోట నుంచి శుభవార్తలు వింటారు. విపరీతమైన వత్తిడి ఉన్నా ధైర్యంతో వాటిని అధిగమిస్తారు. మహిళలకు లాభాలు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp