Zodiac Signs : నవంబర్ 01 మంగళవారం ఈ రోజు మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే….?
మేషరాశి ఫలాలు :ఈరోజు వైవాహికంగా బాగుంటుంది. వ్యాపారాల్లో భాగస్వాముల వల్ల ధన లాభం కలుగుతుంది. ఆధ్యాత్మిక తత్వం ఏర్పడుతుంది. ప్రయాణాలు వాయిదా వేస్తారు. అదృష్టం మీ వెంటే ఉంటుంది. ముఖ్యమైన విషయాలను ధైర్యసాహసాలతో ముందడుగు వేసి గొప్ప నిర్ణయాలు తీసుకుంటారు. శివారాధన చేయండి. వృషభరాశి ఫలాలు ; వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి విముక్తి. మిత్రులకు సంబంధించిన శుభకార్యాలకు హాజరవుతారు. పెట్టుబడులు అనుకూలిస్తాయి. విద్యార్థులు కష్టపడాల్సిన రోజు. తల్లిదండ్రుల ఆస్తులు కలిసివస్తాయి. దుర్గాదేవిని ఆరాధించండి.
మిథునరాశి ఫలాలు : ఈరోజు ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువ అవుతుంది. కుటుంబ సభ్యులకు అనారోగ్యం. పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో వచ్చిన అవకాశాలు వెళ్లిపోతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి.కర్కాటకరాశి ఫలాలు ; ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీలో ఉన్న తెలివితో, సమయస్ఫూర్తితో ఎదుటివారిని మెప్పిస్తారు. నూతన ఒప్పందాల ద్వారా లాభాలు అందుకుంటారు. ఆచితూచి వ్యవహరించడం మంచిది. చాలా కాలంగా ఉన్న ఆస్తి వివాదాల పరిష్కారం. శ్రీ లలితా సహస్రనామ పారాయణ చేసుకోండి.
సింహరాశి ఫలాలు : ఆఫీస్‌లో ప్రశంసలు అందుకుంటారు. అందరితో సంతోషంగా సమయాన్ని గడుపుతారు. ఉద్యోగస్తులు అధికారుల మన్ననలు పొందుతారు. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు. పెద్దల సలహాతో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. దైవదర్శనాలు. అన్నపూర్ణా దేవిని ఆరాధించండి.
కన్యరాశి ఫలాలు ; ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ముందుకు సాగవు. అహంకారం వల్ల నష్టం ఏర్పడుతుంది. ఖర్చులు పెరుగుతాయి. మిత్రులు కూడా శత్రువులు అవుతారు. సహోద్యోగులు సహకారం అందిస్తారు. ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండండి. శివాష్టకం పారాయణం చేసుకోండి.
తులారాశి ఫలాలు ; ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో అవమానాలు. విద్యార్థులు చదువును వాయిదా వేస్తారు. మితమైన ఆహారం తీసుకోకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు కలుగుతాయి. ఇతరుల మీద ఆధారపడటం వల్ల ఇబ్బందులు. ధైర్యం కోల్పోతారు. శ్రీ వేంకటేశ్వర వజ్రకవచ పారాయణం చేసుకోండి.
వృశ్చికరాశి ఫలాలు : ఈరోజు ఆఫీస్‌లో ప్రశంసలు అందుకుంటారు. నూతన గృహాన్ని కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తారు. అనుకున్న పనులను సరైన సమయానికి పూర్తిచేస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కుతుంది. శివాష్టకం పారాయణం చేసుకోండి.
ధనస్సురాశి ఫలాలు : ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువ అవుతుంది. కుటుంబ సభ్యులకు అనారోగ్య సూచన కన్పిస్తుంది. రుణ బాధలు పెరుగుతాయి. అనుకోని సమస్యలు రావచ్చు. అవమానాలు ఎదురవుతాయి. ప్రయాణం చేసేటప్పుడు విలువైన వస్తువులు చేజారవచ్చు. కనకధారా స్తోత్ర పారాయణం చేసుకోండి.
మకరరాశి ఫలాలు : ఆర్ధిక నష్టం కలుగుతుంది. బంధువులతో మాటపట్టింపులు. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. ఉద్యోగాలలో నిరాశాజనకంగా ఉంటుంది. ఆనవసర వివాదాలలో తలదూర్చంకండి. కాలభైరవ అష్టకం పారాయణం చేసుకోండి.
కుంభరాశి ఫలాలు ; వ్యాపార భాగస్వాముల వల్ల లాభాలు. విద్యార్థులు విజయం సాధిస్తారు. ఆచార సాంప్రదాయాలకు ప్రాధాన్యతనిస్తారు. శుభకార్యాల ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వాక్చాతుర్యం వల్ల అందరినీ ఆకట్టుకుంటారు. శివాలయంలో ప్రదక్షణలు చేయండి.
మీనరాశి ఫలాలు : మీలో ఉన్న మొండితనం, అహంకారం వల్ల నష్టం ఏర్పడుతుంది. ఆఫీస్‌లో ముఖ్య విషయాలు తెలుసుకుంటారు. ఇంటిలో పరిస్థితులు సాఫీగా సాగిపోతాయి. వ్యవహారాలలో అవరోధాలు. మానసిక వేదనకు గురవుతారు. శ్రీరామ ఆరాధన చేయండి.