Zodiac Signs : నవంబర్ 12 శనివారం ఈరోజు మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే?
మేష రాశి ఫలాలు : అన్నింటా మీకు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి అవకాశం ఉంది సమాజంలో మీకు ఈరోజు గౌరవం, విలువ పెరుగుతుంది.. భూముల కొనుగోలు యత్నాలు అమ్మవారి ఆరాధన చేయండి. వృషభ రాశి ఫలాలు : అనుకున్న విధంగా ఈరోజు గడువదు. ఆర్థికంగా మిశ్రమగా ఉంటుంది. అన్నదమ్ముల నుంచి సహకారం అందుతుంది. అభరణాలు కొనుగోలు యత్నాలు సఫలం. ఈరోజు మీరు మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాల పొందుతారు. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.
మిథున రాశి ఫలాలు : అన్నింటా మీకు ఆటంకాలతో కూడిన రోజు. ఆర్థికంగా ఇబ్బందులు. మీ ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. విరోధాలు, మానసిక అశాంతి. అనుకోని ప్రయాణాలు పొందుతారు. మహిళలకు ఇబ్బందులు. శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. కర్కాటక రాశి ఫలాలు : ఈరోజు చక్కటి శుభఫలితాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. అన్ని పనులు చక్కగా పూర్తి చేస్తారు. సామాజిక సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. కటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. మహిళలకు చక్కటి రోజు. శ్రీ విష్ణు సహస్రనామాలను పారాయణం చేయండి.
సింహ రాశి ఫలాలు : అన్ని పనులను సకాలంలో పూర్తిచేస్తారు. మీకు శ్రమకు తగ్గ ఫలితం వస్తుంది. ఆనందంగా మిత్రులతో కలుపుతారు. ఆదాయం పెరుగుతుంది. అప్పులు తీరుస్తారు. అమ్మ తరపు వారి నుంచి శుభవార్తలు అందుతాయి. శ్రీ హనుమాన్ ఆరాధన చేయండి.
కన్య రాశి ఫలాలు : అనుకోని సమస్యలు వస్తాయి. ఆదాయం తగ్గుతుంది. ఆనుకోని ఖర్చులు వస్తాయి.
కుటుంబ సమస్యలు. మీ ఆలోచనలు స్థిరంగా ఉండవు. మిత్రులతో విభేదాలు. ముఖ్యమైన పనులు వాయిదా పడుతాయి. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.
తులారాశి ఫలాలు : ఈరోజు చక్కటి అవకాశాలు వస్తాయి. ఈరోజు మీ ఆదాయం పెరుగుతుంది. కుటుంబ సమస్యలు పరిష్కారమై ముందుకు ఓతారు. చక్కటి ప్రశాంతత పొందుతారు. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. కొత్త పరిచయాలు పెరుగుతాయి. కొత్త ఆలోచనలు కలిసి వస్తాయి.మహిళలకు ఆకస్మిక ధనలాభం. ఇష్టదేవతరాధన చేయండి.
వృశ్చిక రాశి ఫలాలు : అనుకోని విధంగా ఈ రోజు మీరు పనులలో జాప్యం పెరుగుతుంది. ఆదాయం కోసం చేసే కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి. పెద్దల సహకారంతో ముందుకు పోతారు. అన్నదమ్ముల నుంచి ఇబ్బందులు తొలిగిపోతాయి. మహిళలకు లాభదాయకమైన రోజు. శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆరాధన చేయండి.
ధనస్సు రాశి ఫలాలు : అన్ని పనులు సకాలంలో పూర్తిచేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. కొత్త పనులు ప్రారంభిస్తారు. సాయంత్రం మీరు శుభవార్తలు వింటారు. కొత్త వాహనాలు కొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులకు అనుకూలం. విందు వినోదాలలో చురుకుగా పాల్గొంటారు.శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.
మకర రాశి ఫలాలు : ఇబ్బందులు తొలిగిపోతాయి. ఆదాయం సాధారణంగా ఉంటుంది. అనుకోని విధంగా ఈరోజు మీరు చక్కటి ప్రశాంతత లభిస్తాయి. మీరు చాలా రోజులుగా ఆందోళన తగ్గి ప్రశాంతత లభించును. బంధువుల ఆహ్వానాలు అందుతాయి. ఇష్టదేవతరాధన చేయండి.
కుంభ రాశి ఫలాలు : కొంచెం కష్టంగా ఉంటుంది. ఆదాయం కోసం బాగా శ్రమిస్తారు. అనుకోని లాభాలు వస్తాయి. వ్యాపారాలలో ఇబ్బందులు. మహిళలకు పని భారం. విద్యా, ఉపాది విషయంలో అనుకోని ఇబ్బందులు. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.
మీనరాశి ఫలాలు : కొత్త పనులు ప్రారంభిస్తారు. ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. . బంధువుల నుంచి శుభవార్తలు. విద్యార్థులకు నూతనోత్సాహం. వ్యాపారులకు ధన లాభం. శుభవార్తలు వింటారు. గోసేవ, విష్ణు సహస్రనామాలను పారాయణ చేయండి.