Zodiac Signs : నవంబర్ 20 ఆదివారం ఈరోజు మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే…?
మేష రాశి ఫలాలు : శుభకరమైన రోజు. అన్నింటా మీకు సానుకూలతలు పెరుగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది,. అప్పులు తీరుస్తారు. విద్యా, వ్యాపారం, ఆఫీస్లో అనుకూలతలు పెరుగుతాయి. మహిళలకు ప్రశాంతత లభిస్తుంది. శ్రీ ఆదినారాయణ స్వామి ఆరాధన చేయండి. వృషభ రాశి ఫలాలు : కొద్దిగా కష్టపడాల్సిన రోజు. ఆదాయం విషయంలో తగు జాగ్రత్తలు తప్పనిసరి. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ప్రయాణ సూచన. వివాహ ప్రయత్నాలు సఫలం. అన్నింటా మీకు శ్రమతో కూడిన రోజు. మహిళలకు మంచి వార్తలు అందుతాయి. శ్రీ కాలభైరావాష్టకం పారాయణ చేయండి.
మిధున రాశి ఫలాలు : మీరు ఆశించిన ఫలితాలు రాక నిరాశగా ఉంటారు. అన్నింటా మీరు ఇబ్బందులు పడుతారు. ఆదాయం తగ్గుతుంది. పెద్దల సహకారం లభిస్తుంది. విద్యా, వ్యాపారాలలో శ్రమ పెరుగుతుంది. మహిళలకు పనిభారం. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి. కర్కాటక రాశి ఫలాలు : కొద్దిగా పనిచేస్తే చాలు అన్నింటా మీకు జయం. వ్యాపారాలలో ఊహించని లాభాలు. ప్రయాణ లాభాలు. ఆరోగ్యం కోసం జాగ్రత్తలు తప్పనిసరి. అన్నదమ్ముల నుంచి మంచి వార్తలు వింటారు. కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం. మహిళలకు లాభదాయకమైన రోజు. పేదలకు అన్నదానం చేయండి,.
సింహ రాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. రోజు ప్రారంభంలో శుభంగా ఉన్నా సాయంత్రం కల్లా కొంత శ్రమ, చికాకులు పెరుగుతాయి. ఆదాయం అనుకున్న విధంగా రాదు. వ్యాపారాలలో శ్రమ తప్ప లాభం రాదు. మహిళలకు పని వత్తిడి కానీ ధనలాభాలు. ఇష్టదేవతరాధన చేయండి.
కన్య రాశి ఫలాలు : చక్కటి శుభవాతావరణం. అనుకోని మార్గాల ద్వారా ఆదాయం వస్తుంది. అన్నింటా చక్కటి ఫలితాలు. వ్యాపారాలలోఉమ్మడి వ్యాపారులకు లాభాలు. మహిళలకు స్వర్ణలాభాలు. కొత్త పనులు ప్రారంభిస్తారు. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.
తులా రాశి ఫలాలు : ప్రతికూలమైన రోజు. అన్నింటా మీకు ఆటంకాలు వస్తాయి. కొత్త కొత్త చిక్కులు. అప్పుల బాధలు పెరుగుతాయి. విద్యా, వివాహ ప్రయత్నాలు ఫలించవు. వ్యాపారాలలో సమస్యలు రావచ్చు. మహిళలకు మనఃశాంతి కొరవడుతుంది. శ్రీ సూర్యనారాయణ స్వామి ఆరాధన చేయండి.
వృశ్చిక రాశి ఫలాలు : విజయాలతో ఆనందంగా గడుపుతారు. వివాహ కోసం చేసే ప్రయత్నాలు సఫలం అవుతాయి, మంచి పనులు ప్రారంభిస్తారు. విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి. అమ్మ తరపు వారి నుంచి ఆహ్వానాలు. మహిళలకు ధనలాభాలు. ఆంజనేయస్వామి ఆరాధన చేయండి.
ధనస్సు రాశి ఫలాలు : చక్కటి శుభదినం ఈరోజు. వ్యాపారాలలో లాభాలు. ఊహించని వారి నుంచి మీకు ప్రయోజనాలు కలుగుతాయి. విదేశీ బంధువులు లేదా స్నేహితుల నుంచి కాల్ మీకు ఎగ్జైటింగ్గా వుంటుంది. ప్రేమికులకు అనుకూలం. వివాహం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. శ్రీ దక్షిణామూర్తి ఆరాధన చేయండి.
మకర రాశి ఫలాలు : ఈరోజు కొద్దిగా శ్రమించాలి. ఆదాయం తగ్గుతుంది. అయినా అవసరాలకు ధనం చేతికి అందుతుంది. కుటుంబంలోసఖ్యత పెరుగుతుంది. విద్యార్థులకు ప్రశాంతమైన రోజు. ఆనవసర విషయాలలో జోక్యం చేసుకోకండి. మహిళలకు మంచి వార్తలు. శ్రీ గణపతి ఆరాధన చేయండి.
కుంభ రాశి ఫలాలు ; పర్వాలేదు అన్నట్టు వుంటుంది ఈరోజు. ఆదాయం సాధారణం. వ్యాపారాలలో పెద్దగా లాభాలు రావు, నష్టాలు రావు. రొటీన్గా గడిచిపోతుంది. విద్యార్థులకు శ్రమతో కూడిన రోజు. సాయంత్రం నుంచి మంచి ఫలితాలను సాధిస్తారు. శ్రీ లక్ష్మీ, దుర్గాదేవి ఆరాధన చేయండి.
మీన రాశి ఫలాలు : శుభఫలితాలతో కూడిన రోజు. విందులు, వినోదాలకు హాజరవుతారు. అమ్మనాన్నల నుంచి సహకారంతో ముందుకుపోతారు. కుటుంబంలో చికాకులు తీరుతాయి. ఆదాయం పెరుగుతుంది. చేసే పనులను సకాలంలో పూర్తి చేస్తారు. శ్రీ ఆదిత్య హృదయం పారాయన చేయండి.