Home » Devotional » Today Horoscope October 1 2022 Check Your Zodiac Signs
Devotional

Zodiac Signs : అక్టోబర్ 01 శనివారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….?

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: September 30, 2022 8:14 pm
Advertisement

Zodiac Signs :మేషరాశి ఫలాలు: ఈరోజు శ్రమ అధికంగా ఉంటుంది. కుటుంబంలో కలతలు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఆదాయం తగ్గుతుంది. వైవాహిక జీవితంలో సర్దుబాటుకు ప్రయత్నించండి. మహాదేవుడి ఆరాధన చేయండి.వృషభరాశి ఫలాలు: శ్రమించాల్సిన రోజు. విందులు, వినోదాలకు హాజరవుతారు. అనవసర ఖర్చులు వస్తాయి. క్రొత్త పరిచయాలు ఏర్పడతాయి. మహిలలకు మంచిరోజు. శ్రీరామ జయరామ జయజయ రామ నామాన్ని 108 సార్లు పారాయణం చేయండి.

Advertisement

మిథునరాశి ఫలాలు: గతంలో పెట్టిన పెట్టుబడులు మంచి లాభాలను ఇస్తాయి. అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. అనారోగ్యం నుంచి విముక్తి కలుగుతుంది. ఆఫీస్లో మీరు పనులను సమర్థవంతంగా నిర్వహిస్తారు. శ్రీ గణపతి ఆరాధన చేయండి. కర్కాటక రాశి ఫలాలు: ఈరోజు ప్రశాంతంగా ఉంటారు. సోదరిలు, సోదరుల సహకారం లభిస్తుంది. మంచి వార్తలు వింటారు. కోర్టు వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. క్రీడలలో పాల్గొంటారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆరాధన చేయండి.

Today Horoscope October 1 2022 Check Your Zodiac Signs

Advertisement

సింహరాశి ఫలాలు: ఈరోజు ఆదాయం తగ్గినా సమయానికి అవసరమైన ధనం చేతికి అందుతుంది. చెడువ్యసనాలకు దూరంగా ఉండాల్సిన రోజు. జీవిత భాగస్వామితో ఇబ్బందులు కలుగవచ్చు. ఆరోగ్య సమస్యలు రావచ్చు. శ్రీదుర్గాదేవి ఆరాధన చేయండి.

కన్యరాశి ఫలాలు: ఈరోజు కష్టాల నుంచి విముక్తి పొందడానికి కుటుంబ సభ్యులు సహాయం చేస్తారు. శ్రమ భారం పెరిగినా బాధ్యతగా పనులు చేస్తారు. మిత్రులతో ఆర్ధికంగా ప్రయోజనాలను పొందుతారు. శ్రీ రుద్రపారాయణం చేయండి.

Advertisement

తులారాశి ఫలాలు: ఇంటివద్ద పనులతో బిజీగా గడుపుతారు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. రోజంతా డల్గా ఉంటుంది. అనారోగ్యం. పిల్లలకు చదువుపట్ల శ్రద్ధ ఉండదు. శ్రీ కృష్ణ ఆరాధన చేయండి.

వృశ్చికరాశి ఫలాలు: ఈరోజు విద్యా, ఉద్యోగ విషయాలలో చక్కటి ఫలితాలు సాధిస్తారు. ప్రేమికులకు సంతోషమైన రోజు. వ్యాపార లావాదేవీలు సాఫీగా సాగుతాయి. ఆర్ధికప్రయోజనాలను పొందుతారు. శ్రీ లక్ష్మీ,కుబేర ఆరాధన చేయండి.

ధనుస్సురాశి ఫలాలు: ఇతరుల కోసం దూబరా ఖర్చు పెట్టకండి. ఆర్థికంగా సాధారణంగా ఉంటుంది. ప్రయాణాలు కలసిరావు. మానసిక వత్తిడి ఉంటుంది. ఇంట్లో సమస్యలు తలెత్తవచ్చు. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.

మకరరాశి ఫలాలు: పెండింగ్ లో ఉన్న ప్రాజెక్ట్ లు, పథకాలు చివరిదశకు వస్తాయి. ఆధ్యాత్మికలలో పాల్గొంటారు. అన్ని పనులు వేగంగా పూర్తిచేస్తారు. అనారోగ్యం నుంచి విముక్తి. శ్రీకృష్ణారాధన చేయండి.

Advertisement

కుంభరాశి ఫలాలు: అన్నదమ్ముల నుంచి మంచి సహకారం అందుతుంది. ధనలాభాలు రాక ఇబ్బంది పడుతారు. వ్యాపారాలలో నష్టలు రావచ్చు. ముఖ్యమైన విషయాలను కుటుంబ సభ్యులతో చర్చిస్తారు. శ్రీ శ్వేతార్క గణపతి ఆరాధన చేయండి.

మీనరాశి ఫలాలు: ఈరోజు అనుకోని మార్గాల ద్వారా శుభవార్తలు వింటారు. ఓర్పు ద్వారా మీరు మీ లక్ష్యాలను చేరుకుంటారు. విద్యార్థులకు మంచి వార్తలు. అభివృద్ధి మార్గంలో పయనిస్తారు. ఆర్థిక సమస్యలు తీరుతాయి. శ్రీ లలితాదేవి ఆరాధన చేయండి.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి