Zodiac Signs : సెప్టెంబర్ 27 మంగ‌ళ‌వారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….?

Authored By aruna | The Telugu News | Published on: September 26, 2022, 10:40 pm

మేషరాశి ఫలాలు : కొద్దిగా శ్రమతో కూడిన రోజు. కానీ అన్నింటా మీకు సానుకూలత కనిపిస్తుంది. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. అదాయం పెరుగతుఉంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. మహిళలకు శుభసూచకం. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి. వృషభ రాశి ఫలాలు : అన్నింటా శుభ ఫలితాలు వస్తాయి. ఆదాయం మార్గాలు పెరుగుతాయి. విద్యా, ఉపాధి, వ్యాపారాలలో లాభాలు. ఇంటా, బయటా అనుకూలత పెరుగుతుంది. వివాహప్రయత్నాలు ఫలిస్తాయి. మహిళలకు శుభవార్తలు అందుతాయి. శ్రీ బాల త్రిపురసుందరీ ఆరాధన చేయండి.

మిథున రాశి ఫలాలు : అనుకోని కష్టాలు వస్తాయి. ఆదాయం తగ్గుతుంది. సమయం అనవసరంగా వృథా చేస్తారు వ్యసనాల వల్ల నష్టాలు వస్తాయి. వివాదాలకు దూరంగా ఉండండి. అమ్మవారి ఆరాధన, గుడి సందర్శన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : ఈరోజు చక్కటి ఫలితాలు అందుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారాలలో ఉమ్మడి వ్యాపారాలు కలసివస్తాయి. సమాజంలో మీకు మంచి పేరుప్రఖ్యాతలు వస్తాయి. విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి. శ్రీ లలితా సహస్రనామాలను పారాయణ చేయండి.

Today Horoscope September 27 2022 Check Your Zodiac Signs

Today Horoscope September 27 2022 Check Your Zodiac Signs

సింహరాశి ఫలాలు : ఈరోజు కొన్ని విషయాలలో అనుకూత కనిపిస్తుంది,. మరికొన్నింటాలో ఇబ్బందులు వస్తాయి. ఆదాయం తగ్గుతుంది కానీ అవసరాలకు మాత్రం ధనం చేతికి వస్తుంది. ఆఫీస్‌లో మీకు మంచి అవకాశం లభిస్తుంది. మహిళలకు స్వర్ణలాభాలు వస్తాయి. శ్రీ కనకదుర్గాదేవి ఆరాదన చేయండి.

కన్య రాశి ఫలాలు : చికాకులు పెరుగుతాయి. ఆర్థికంగా మందగమనం. వ్యాపారాలలో స్వల్ప నష్టాలు వస్తాయి. కొన్ని సమస్యలు వస్తాయి. ఖర్చుల కారణంగా ఇబ్బందులకు గురవుతారు. ఆరోగ్య సమస్యలు.శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.

తులారాశి ఫలాలు : అనవసర వివాదాలు వస్తాయి, కానీ మీ తెలివితేటలతో వాటి నుంచి బయటపడుతారు. వివాహ ప్రయత్నాలు అనుకూలం. ధన సంబంధ విషయాలలో పురోగతి కనిపిస్తుంది. వ్యాపారాలలో లాభాలను గడిస్తారు. మహిళలకు మంచి రోజు. ఇష్టదేవతరాధన చేయండి.

వృశ్చిక రాశి ఫలాలు : అనుకోని ఖర్చులు వస్తాయి., ఆదాయం అనుకున్నంత రాదు. వివాదాలకు అవకాశం ఉంది. అనవసర ప్రయణాలు. అవసరాలకు మిత్రులు సహాయం అందిస్తారు. విందులు, వినోదాలు. మహిళలకు చక్కటి రోజు. గోసేవ, అమ్మవారి ఆరాధన చేయండి.

ధనుస్సు రాశి ఫలాలు : చక్కటి శుభ ఫలితాలతో కూడిన రోజు. ఆర్థిక విషయాలలో పురోగతి కనిపిస్తుంది. మంచి వార్తలువింటారు. విలువైన వస్తువులు కొంటారు. అన్నింటా జయం కనిపిస్తుంది. ఇష్టదేవతరాధన చేయండి.

మకర రాశి ఫలాలు : ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది. కుటుంబంలో జరుగుతున్న వివాదాల ద్వారా మనస్తాపం. ఆదాయం అంతంతమాత్రంగా ఉంటుంది. దీర్ఘకాలిక పెట్టుబడులకు అనకూలం. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. పెద్దల మాటలు వినడం వల్ల ప్రయోజనాలు పొందుతారు. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.

కుంభ రాశి ఫలాలు : సంతోషం, ఉత్సాహం నిండిన రోజు. అన్నింటా సానుకూల ఫలితాలు వస్తాయి. కోరికలు నెరవేరుతాయి. ఆస్తి సంబంధ విషయాలలో అనుకూల పలితాలు. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. నవగ్రహ సోత్రం పారాయణం చేయండి.

మీన రాశి ఫలాలు : అన్నింటా శుభఫలితాలు వస్తాయి. వ్యాపారాలలో లాభాలు వస్తాయి. విద్యా, వివాహ ప్రయత్నాలు అనుకూలం. మంచి వార్తలు వింటారు. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. కుటుంబంలో సంతోషం. మహిలలకు లాభాలు. అమ్మవారి ఆరాధన చేయండి.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp