Zodiac Signs : సెప్టెంబర్ 8 గురువారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Zodiac Signs : సెప్టెంబర్ 8 గురువారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….?

 Authored By aruna | The Telugu News | Updated on :7 September 2022,10:40 pm

మేషరాశి ఫలాలు : ఈరోజు ఉమ్మడి వ్యాపారాలకు దూరంగా ఉండండి. ఇంట్లో పరిస్థితులు అనుకూలించవు. కొత్త పెట్టుబడులు పెట్టకండి. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన రోజు. ప్రయాణం చికాకులు కల్పిస్తుంది. ఆదాయం తగ్గుతుంది. వైవాహిక జీవితం సాధారణంగా ఉంటుంది. శ్రీ సాయిబాబా ఆరాధన చేయండి. వృషభరాశి ఫలాలు : ఖర్చులు పెరుగుతాయి. అతి మంచితనం ఈరోజు పనికి రాదు. శారీరకంగా మార్పులు చోటుచేసుకుంటాయి. ఈరోజు కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. అనుకోని వారి నుంచి ఇబ్బందులు రావచ్చు. ప్రేమికుల మధ్య సంతోషకరమైన వాతావరణం. బాగా శ్రమిస్తారు, కానీ మీరు ఆశించిన మేర ఫలితం రాదు. శ్రీ దత్తాత్రేయా స్వామి ఆరాధన చేయండి.

మిథునరాశి ఫలాలు : ఉత్సాహంగా, ఉల్లాసంగా ఈరోజు గడుస్తుంది. ప్రతి పనిని వేగంగా పూర్తిచేస్తారు. అనుకోని మార్గాల ద్వారా లాభాలు వస్తాయి. చాలా కాలంగా ఉన్న ఇబ్బందులు తొలిగిపోతాయి. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. కొత్త పరిచయాలు పెరుగుతాయి. నవగ్రహారాధన చేయండి. కర్కాటకరాశి ఫలాలు : ఇంట్లో సానుకూలమైన రోజు. ఆదాయం పెరుగుతుంది. అనుకున్న దాని కంటే ఎక్కువ ఖర్చులు రావడంతో కొంత నిరాశజనకంగా ఉంటుంది. ప్రశాంత వాతావరణం. అనుకోని అతిథి రాకతో సంతోషం పెరుగుతుంది. విలువైన వస్తువులు, వాహనాలు కొనుగోలుకు ప్రయత్నిస్తారు. ఇష్టదేవతరాధన చేయండి.

Today Horoscope September 8 2022 Check Your Zodiac Signs

Today Horoscope September 8 2022 Check Your Zodiac Signs

సింహరాశి ఫలాలు : ఈరోజు ఎక్కువ సంపాదించాలనే కోరిక పెరుగుతుంది. మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి. వివాదాలకు దూరంగా ఉండండి. ప్రేమికులకు అద్బుతమైన రోజు. కుటుంబం కోసం సమయం కేటాయించాల్సిన రోజు. ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. శ్రీ రామ రక్ష స్తోత్రం చదువుకోండి.

కన్యారాశి ఫలాలు : ఈరోజు చాలా బిజీగా గడుపుతారు. ఖర్చులు బాగా పెరుగుతాయి. ఇంట్లో అనుకోని మార్పులు సంభవిస్తాయి. పెండింగ్‌ పనులు పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. దగ్గరి వారితో వాదనలు చేసే అవకాశం ఉంది. పాత విషయాలను అనవసరంగా ముందుకు తేకండి. విద్యా, ఉపాధి విసయాలు సామాన్యంగా ఉంటాయి. అమ్మవారి ఆరాధన చేయండి.

తులారాశి ఫలాలు : ఈరోజు నష్టాలు వస్తాయి. అనుభవం లేని విషయంలో తలదూర్చకండి. పెద్దల మాటలు, సలహాలు తీసుకోండి,. ఆర్థికంగా పర్వాలేదు అనిపిస్తుంది. తెలివితేటలతో ముందుకుపోతారు. ఆఫీస్‌లో మార్పులు గమనిస్తారు. నిరాశ నుంచి ఆశ వైపు ప్రయాణిస్తారు,. మహిళలకు పర్వాలేదు. గోసేవ, గోవులకు బెల్లం పెట్టడం చేయండి.

వృశ్చికరాశి ఫలాలు : ఆర్థిక పురోగతి కనిపిస్తుంది. ఆన్నింటా మీకు సానుకూలత కనిపిస్తుంది. శుభవార్తలు అందుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబానికి అంతటికి సంతోషం. సంతానం వల్ల ఆనందం కలుగుతుంది. ప్రేమికులకు శుభదినం. సాయంత్రం విందులు, వినోదాలు. మహిళలకు మంచి రోజు. ఇష్టదేతరాధన చేయండి.

ధనుస్సు రాశి ఫలాలు : ఈరోజు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. విందులు, వినోదాలతో కూడిన రోజు. అప్పులను తీరుస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. అతిథి రాకతో సందడి. బిజీబిజీగా గడుపుతారు. ప్రేమికులకు అందమైన రోజు. ఆప్తు మిత్రుల సహాయం అందుతుంది. మహిళలకు మంచి ఫలితాలు. శ్రీ హనుమాన్‌ చాలీసా పారాయణం చేయండి.

మకర రాశి ఫలాలు : ఈరోజు మీరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. దీంతో ఇంట్లో పెద్దలు ఆందోళనతో ఉంటారు. ఆరోగ్యం కాపాడుకోవాల్సిన రోజు. కొత్త ప్రాజెక్టు అమలుకు ప్రయత్నిస్తారు. ప్రేమికులకు ఇబ్బందులు, ఆఫీస్‌లో పని భారం పెరుగుతుంది. ఉపాది విషయంలో ఆటంకాలు వస్తాయి. మానసిక ప్రశాంతత కొరవడుతుంది. శ్రీ కాలభైరావాష్టకం పారాయణం చేయండి.

కుంభరాశి ఫలాలు : చాలా రోజులుగా కంటున్న కలలు ఈ రోజు నెరవేరుతాయి. సంతోషం ఎక్కువతుంది. అనుకోని మార్గాల ద్వారా ఆదాయం లభిస్తుంది. ఆశ్చర్యకరమైన పలితాలతో ఈరోజు గడుస్తుంది. కొత్త అవకాశాలు వస్తాయి. ఉత్తేజంతో ముందుకుపోతారు. మహిళలకు లాభాలు. ఇష్టదేవతారాదన చేయండి.

మీనరాశి ఫలాలు : అనుకున్న పనులు పూర్తిచేస్తారు. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారాలలో లాభాలు వస్తాయి. ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి. ఆనందంగా గడుపుతారు. ప్రేమికుల మధ్య సఖ్యత పెరుగుతుంది. పెండింగ్‌ సమస్యలు పరిష్కరించుకుంటారు. బాగా కష్టపడుతారు. మహిళలకు ధనలాభాలు. శివారాధన చేయండి.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది