Zodiac Signs : మీరు ఈ తేదీల్లో పుట్టారా.. అయితే అదృష్టవంతులే..
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం నమ్మే వారు చాలా మంది ఉన్నారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ శాస్త్రంలో న్యూమరాలజీ అనేది ప్రత్యేకమైన విభాగంగా ఉంది. ఇందులో జాతకాన్ని బట్టి రాశులు, నక్షత్రాలు, గ్రహాలు, రాశి ఫలాలు అంటూ రకరకాల కొలమానాల ఆధారంగా జ్యోతిష్య శాస్త్ర పెద్దలు పలు విషయాలు చెప్తుంటారు. ఇకపోతే న్యూమరాలజీకి కూడా మంచి డిమాండ్ ఉంది.ఈ న్యూమరాలజీ ప్రకారం అంకెల ఆధారంగా మానవుడి జీవితం ఏ విధంగా ప్రభావితమవుతున్నది. ఎంత ముందుకు వెళ్లాడా? […]
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం నమ్మే వారు చాలా మంది ఉన్నారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ శాస్త్రంలో న్యూమరాలజీ అనేది ప్రత్యేకమైన విభాగంగా ఉంది. ఇందులో జాతకాన్ని బట్టి రాశులు, నక్షత్రాలు, గ్రహాలు, రాశి ఫలాలు అంటూ రకరకాల కొలమానాల ఆధారంగా జ్యోతిష్య శాస్త్ర పెద్దలు పలు విషయాలు చెప్తుంటారు. ఇకపోతే న్యూమరాలజీకి కూడా మంచి డిమాండ్ ఉంది.ఈ న్యూమరాలజీ ప్రకారం అంకెల ఆధారంగా మానవుడి జీవితం ఏ విధంగా ప్రభావితమవుతున్నది. ఎంత ముందుకు వెళ్లాడా? డబ్బు సంపాదన ఎలా ఉండబోతుంది? వ్యక్తిగత, వివాహ, భవిష్యత్తుకు సంబంధించిన విషయాలు చెప్తుంటారు.
సంఖ్యాశాస్త్రం ఆధారంగా వ్యక్తి జీవితానికి సంబంధించిన పలు విషయాలను జ్యోతిష్య శాస్త్ర పెద్దలు వివరిస్తున్నారు. ఈ సంఖ్యా శాస్త్రం ప్రకారం.. ఈ తేదీల్లో పుట్టిన వారు చాలా అదృష్టవంతులు. 9 అనే సంఖ్య చాలా ప్రభావవంతమైనదే కాదు.. అదృష్ట సంఖ్యగానూ ఉంటుంది. 9, 18, 27 తేదీలలో పుట్టినవారిని రాడిక్స్ అని సంఖ్యా శాస్త్రం ప్రకారం పిలుస్తుంటారు. పుట్టిన తేదీ అంకెలను కలిపితే వచ్చే సంఖ్యను రాడిక్స్ అని పిలుస్తారని జ్యోతిష్య శాస్త్ర పెద్దలపేర్కొంటున్నారు.న్యూమరాలజీ ప్రకారం 9 అనే రాడిక్స్ కలిగిన ప్రతీ ఒక్కరు తమ జీవితంలో చాలా బలంగా ముందుకెళతారు. జీవితంలో వీరు ఏది సాధించాలనుకున్నా చక్కగా సాధించగలుగుతారు.
మేధస్సు, శక్తి వీరి సొంతం. వీరు ఎక్కడికి వెళ్లినా అతి తక్కువ టైంలోనే ఉన్నత స్థానానికి వెళ్తారని జ్యోతిష్య శాస్త్ర పెద్దలు వివరిస్తున్నారు. ఇకపోతే తొమ్మిది అనే సంఖ్య అనగా రాడిక్స్ ప్రకారం.. వీరు కుటుంబం, ఫ్రెండ్స్, బంధువులకు అత్యంత ప్రయారిటీ ఇస్తుంటారు. అయితే, స్వభావరిత్యా వీరు చాలా ధైర్యవంతులు. ఇకపోతే తమకు తాము ఏర్పరుచుకునే నిబంధనల వల్ల వీరి వైవాహిక జీవితంలో ఇబ్బందులు తలెత్తే చాన్సెస్ ఉంటాయి. 9 అనే రాడిక్స్ కలిగిన తేదీల్లో పుట్టిన వారికీ ఈ విధమైన పరిస్థితులు ఉంటాయని సంఖ్యా శాస్త్ర పెద్దలు పేర్కొంటున్నారు.