Uppal Nalla Pochamma : ఉప్పల్ బీరప్పగడ్డ భక్తిశ్రద్ధల మధ్య నల్ల పోచమ్మ విగ్రహ ప్రతిష్ట..!
ప్రధానాంశాలు:
Uppal Nalla Pochamma : ఉప్పల్ బీరప్పగడ్డ భక్తిశ్రద్ధల మధ్య నల్ల పోచమ్మ విగ్రహ ప్రతిష్ట..!
Uppal Nalla Pochamma : ఉప్పల్ Uppal నియోజకవర్గంలోని బీరప్పగడ్డ బుడగ జంగాల కాలనీలో శ్రీశ్రీశ్రీ నల్ల పోచమ్మ Sri Nalla Pochamm విగ్రహ ప్రతిష్ట మహోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ ప్రత్యేక ఆహ్వానం మేరకు ఉప్పల్ Uppal నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి Parameshwar Reddy ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆలయానికి చేరుకున్న ఆయన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వేదమంత్రాల నడుమ జరిగిన ఈ మహోత్సవం భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించింది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో బోనాలు, పూజా సామగ్రితో పాల్గొనగా, స్థానిక ప్రజలు, యువత పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. భక్తుల జైజైకారాలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి.
Uppal Nalla Pochamma : ఉప్పల్ బీరప్పగడ్డ భక్తిశ్రద్ధల మధ్య నల్ల పోచమ్మ విగ్రహ ప్రతిష్ట..!
Uppal Nalla Pochamma ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించిన Parameshwar Reddy
పూజల అనంతరం మాట్లాడిన పరమేశ్వర్ రెడ్డి Parameshwar Reddy, నల్ల పోచమ్మ Nalla Pochamma తల్లి ఆశీస్సులు ఉప్పల్ Uppal నియోజకవర్గ ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి కుటుంబం ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, సుఖసంతోషాలతో జీవించాలని ప్రార్థించారు. ప్రజల సంక్షేమం, శాంతి, అభివృద్ధి కోసం అమ్మవారి కృప ఎంతో అవసరమని పేర్కొన్నారు.అనంతరం ఆలయ అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు పరమేశ్వర్ రెడ్డిని శాలువాతో ఘనంగా సత్కరించి, అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయ అభివృద్ధికి అందరూ కలిసి సహకరించాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు ఆకిటి ఆగం రెడ్డి, బొమ్మల శ్రీరాములు, బొమ్మల సుధాకర్, బొమ్మల ఐలేష్, తూర్పాటి జంగయ్య, శ్రవణ్ కుమార్, జగదీష్ ముదిరాజ్, కృష్ణ, వంశీ, జావిద్, ఫషీమ్, సంఘం సభ్యులు, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం భక్తి, సంప్రదాయం, సామాజిక ఐక్యతకు ప్రతీకగా నిలిచింది.
Uppal Nalla Pochamma , నల్ల పోచమ్మ , శ్రీశ్రీశ్రీ నల్ల పోచమ్మ, నల్ల పోచమ్మ విగ్రహ ప్రతిష్ట, ,ఉప్పల్ వార్తలు , పరమేశ్వర్ రెడ్డి, ఉప్పల్ కాంగ్రెస్
, ఉప్పల్ ఆలయ కార్యక్రమం ,బీరప్పగడ్డ ,తెలంగాణ దేవాలయ వార్తలు ,కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ , Nalla Pochamma , Sri Nalla Pochamma, Nalla Pochamma Idol Installation ,Uppal News ,Parameshwar Reddy ,Uppal Congress ,Temple Event Uppal ,Beerappa Gadda







