Hyderabad : పెళ్లి చేసుకుందాం… అన్నందుకు బాయ్ ఫ్రెండ్ పై కత్తితో దాడి చేసిన యువతి.. చంపేద్దామనుకుందా?

Authored By Breaking News 2 | The Telugu News | Published on: December 9, 2022, 8:30 am

Hyderabad : సాధారణంగా చిన్నపిల్లలపై, అమ్మాయిపై, యువతులపై, మహిళలపై దాడులు జరుగుతుంటాయి. కానీ.. హైదరాబాద్ లో మాత్రం రివర్స్ అటాక్ జరిగింది. అవును.. పెళ్లి విషయంలో యువతీయువకుల మధ్య జరిగిన గొడవ చివరకు ప్రాణాల మీదికి తెచ్చింది. నగరంలోని కూకట్ పల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఏపీలోని రాజమండ్రికి చెందిన ఓ యువతి డిగ్రీ పూర్తి చేసి హైదరాబాద్ కు ఉద్యోగరిత్యా వచ్చింది. కూకట్ పల్లిలోని ఓ హాస్టల్ లో ఉంటూ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తోంది. గుంటూరుకు చెందిన ఓ యువకుడు కూడా హైదరాబాద్ కు వచ్చి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ యువతి ఉంటున్న హాస్టల్ పక్కనే ఈ యువకుడు కూడా హాస్టల్ లో చేరాడు.

young woman attacks young boy in kukatpally hyderabad

young woman attacks young boy in kukatpally hyderabad

అయితే.. అక్కడే ఉన్న ఓ టీ స్టాల్ వద్ద వీళ్లకు పరిచయం ఏర్పడింది. 6 నెలల పాటు వీళ్ల మధ్య ఉన్న స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఎప్పుడైతే అశోక్ ప్రేమను ఒప్పుకుందో అప్పటి నుంచి పెళ్లి చేసుకుందాం అని అశోక్ తనపై ఒత్తిడి తీసుకురావడం స్టార్ట్ చేశాడు. దీంతో అప్పటి నుంచి పెళ్లి విషయాన్ని దాటవేస్తూ వచ్చింది ఆ యువతి.

Hyderabad : టీ స్టాల్ వద్ద అశోక్ పై కత్తితో దాడి

ఈనెల 5 వ తారీఖున అశోక్ తన పుట్టిన రోజున అదే టీ స్టాల్ వద్ద మళ్లీ ఆ యువతిని కలిశాడు. మళ్లీ పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. ఎప్పుడు పెళ్లి చేసుకుందామని అడిగాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ స్టార్ట్ అయింది. దీంతో తన దగ్గర ఉన్న మినీ చాక్ తో అశోక్ పై దాడి చేయబోయింది ఆ యువతి. తను దాడి చేస్తుందని గ్రహించి తప్పించుకునే ప్రయత్నిం చేసినా కూడా అప్పటికే తన మెడ భాగంలో, చెంప భాగంలో తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించారు. మొత్తం 50 కుట్లు వేసి అశోక్ ప్రాణాలను డాక్టర్లు కాపాడారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని అశోక్ పై దాడి చేసిన యువతిని వెంటనే అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. స్థానికంగా ఈ ఘటన చర్చనీయాంశమైంది.

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp