Palm Tree Climbing Girl : తాటిచెట్టు ఎక్కి కల్లు తీస్తున్న బాలిక.. ఆశ్చర్యపోతున్న స్థానికులు.. ఎక్కడో తెలుసా?

Advertisement
Advertisement

Palm Tree Climbing Girl : తాటిచెట్టు ఎక్కి కల్లు గీయడం అనేది మామూలు విషయం కాదు. చాలా ప్రమాదకరమైన పని అది. అయినా కూడా గౌడ్స్ తమ వృత్తి కాబట్టి దాన్ని కాపాడుకోవడం కోసం ప్రాణాలకు తెగించి రోజూ తాటిచెట్టు ఎక్కి కల్లు గీస్తారు. కల్లును చెట్టు నుంచి కిందికి తీసుకొస్తారు. ఒకరకంగా చెప్పాలంటే చెట్టు ఎక్కి కల్లు తీసుకొని రావడం అనేది సాహసం అనే చెప్పాలి. ఆ పని పెద్దవాళ్లు మాత్రమే చేయగలరు. మగవాళ్లు మాత్రమే చేసే పని. కానీ.. ఓ బాలిక మాత్రం చకచకా తాటిచెట్టు ఎక్కి కల్లు తీస్తోంది. అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇంతకీ ఆ బాలిక ఎందుకు తాటిచెట్టు ఎక్కి కల్లు గీస్తోంది. కల్లు గీయడం ఆ బాలిక ఎలా నేర్చుకుందో తెలుసుకుందాం రండి.

Advertisement

9th class girl climbing palm tree for toddy in tamilnadu villupuram

తమిళనాడులోని విల్లుపురానికి చెందిన తొమ్మిదో తరగతి చదివే బాలిక కరిష్మా చకచకా తాటిచెట్లు ఎక్కేయగలదు. అంతే వేగంగా కల్లును కూడా గీయగలదు. ఓవైపు చదువుతూనే మరోవైపు తన తండ్రికి సాయంగా తాటిచెట్లు ఎక్కుతోంది. తన తండ్రి వృత్తిని గౌరవిస్తూ.. దాన్ని నేర్చుకొని తండ్రికి సాయంత్రం పూట సాయంగా ఉంటోంది.

Advertisement

Palm Tree Climbing Girl : కల్లుగీత కనుమరుగు కాకూడదనే నేర్చుకున్నా

ఈ వృత్తి ఎందరినో ఆదుకుంది. ఎందరికో దారి చూపింది. చాలామందికి ఇదే జీవనాధారం అయింది. అటువంటి ఈ వృత్తి ఇప్పుడు కనుమరుగువుతోంది. ఒకప్పుడు ఈ వృత్తినే చాలామంది వారసత్వంగా ఎంచుకునేవారు. కానీ.. ఇప్పుడు ఈ వృత్తిని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. అందరూ చదువులు, ఉద్యోగాలంటూ పట్నాలకు వెళ్లిపోతున్నారు. నేను కూడా అలాగే చేస్తే మా వృత్తిని అవమానించినట్టే. అందుకే.. మా నాన్న వృత్తిని నేను కొనసాగిస్తా. అందుకే.. కల్లుగీతను నేర్చుకున్నా. మానాన్నకు సాయంగా కల్లు గీస్తున్నా.. అని చెప్పుకొచ్చింది కరిష్మా.

9th class girl climbing palm tree for toddy in tamilnadu villupuram

కరిష్మాకు ఒక అక్క కూడా ఉంది. తను కూడా కల్లు గీసేందుకు మొగ్గు చూపుతోందట. తన తండ్రి కూడా తమకు కల్లు గీతనే వారసత్వంగా ఇస్తానని చెప్పడం విశేషం.

నాకు తెలిసిందే కల్లు గీయడం. ఆ వృత్తినే నా పిల్లలను కూడా నేర్పిస్తున్నా. ఇందులో తప్పేముంది. కల్లుగీత కనుమరుగు కాకూడదు. దీని మీద ఆధారపడి వేల కుటుంబాలు జీవిస్తున్నాయి. దీన్ని సజీవంగా ఉంచాలంటే.. పిల్లలకు కూడా నేర్పించాలి.. అని కరిష్మా తండ్రి చెప్పుకొచ్చాడు.

9th class girl climbing palm tree for toddy in tamilnadu villupuram

అయితే.. అక్కడి స్థానికులు మాత్రం చిన్నపిల్లకు తాటిచెట్టు ఎక్కడం నేర్పించడం ఏంటి.. అంటూ ప్రశ్నిస్తున్నారు. అది ప్రమాదకరమైన వృత్తి. ఆ బాలికకు ఏదైనా అయితే ఎలా.. చదువుకోవాల్సిన వయసులో ఆ బాలికకు ఇవన్నీ నేర్పించడం ఏంటి అంటూ స్థానికులు పెదవి విరుస్తున్నారు. మరికొందరు మాత్రం ఆ బాలిక తాటి కల్లు తీసే విధానాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు.

(Photos Credit : BBC News Telugu)

Recent Posts

Anaganaga Oka Raju Movie Review : నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు మూవీ ఫ‌స్ట్ రివ్యూ అండ్ రేటింగ్‌..!

Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…

5 hours ago

Nari Nari Naduma Murari Movie : నారీ నారీ నడుమ మురారి మూవీ సంక్రాంతి బాక్సాఫీస్‌కి కొత్త టర్నింగ్ పాయింట్‌..!

Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…

6 hours ago

Sreeleela : వామ్మో ఆ హీరో తో శ్రీలీల డేటింగ్ లో ఉందా..?

Sreeleela : బాలీవుడ్‌లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో స్టార్‌గా ఎదిగిన కార్తీక్ ఆర్యన్, ఇప్పుడు తన సినిమాల…

8 hours ago

Chandrababu : చంద్రబాబు తీసుకున్న నిర్ణయం తో అమరావతి రైతుల్లో ఆనందం..!

Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులకు కూటమి ప్రభుత్వం భారీ…

9 hours ago

Anil Ravipudi: అనిల్ నెక్స్ట్ చేయబోయేది మన డిప్యూటీ సీఎం తోనేనా ?

Anil Ravipudi: టాలీవుడ్‌లో అపజయం ఎరుగని 'హిట్ మెషిన్'గా పేరుగాంచిన అనిల్ రావిపూడి, తన కెరీర్‌లో వరుసగా తొమ్మిది విజయాలను…

10 hours ago

Vijay : విజయ్ కూడా ఉచితాలపైనే ఆధారపడ్డాడా..?

Vijay  : తమిళనాడు Tamila Nadu Politics  రాజకీయ యవనికపై 'తమిళగ వెట్రి కజగం' ( TVK ) పార్టీతో…

11 hours ago

Hyundai EV Sector : సూప‌ర్ గుడ్‌న్యూస్‌.. ఛార్జింగ్ తో పనిలేకుండా నడిచే వాహనాన్ని తీసుకరాబోతున్న హ్యుందాయ్..!

Hyundai EV Sector : ఎలక్ట్రిక్ వాహనాల (EV) ప్రపంచంలో ఛార్జింగ్ సమస్యలకు చరమగీతం పాడుతూ హ్యుందాయ్ మోటార్ గ్రూప్…

12 hours ago

Indiramma Atmiya Bharosa: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..ఇక వారందరీ అకౌంట్లోకి ఏడాదికి రూ.12,000 భరోసా..

Indiramma Atmiya Bharosa Scheme : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అండగా నిలవాలనే…

13 hours ago