e-commerce : ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఈకామర్స్ బిజినెస్ కు విపరీతమైన ఆధరణ ఉంది. ఇలాంటి సమయంలో ప్రతి ఒక్క వ్యాపారవేత్త కూడా ఈ వ్యాపారం గురించి ఆలోచన చేస్తున్నారు. గ్రాసరీస్ డోర్ డెలవరీ వ్యాపారంను అంతర్జాతీయంగా పేరున్న బడా సంస్థలు దిగ్గజ వ్యాపారులు ఈ వ్యాపారంను నెత్తికి ఎత్తుకుని ఇప్పుడు వదిలేశారు. ఒకటి రెండు సంస్థలు మాత్రమే ఈ గ్రాసరీస్ బిజినెస్ లో ముందడుగు వేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఢిల్లీకి చెందిన 21 ఏళ్ల షెరుంగ్ జలాన్ ప్రస్తుతం ఈ బిజినెస్ లో దూసుకు పోతున్నాడు. 19 ఏళ్ల వయసులోనే అతడికి ఈ ఆలోచన వచ్చింది. తన వద్ద ఉన్న రూ.30 వేల రూపాయలు మరియు తల్లిదండ్రుల వద్ద ఉన్న కొంత మొత్తం ను తీసుకుని వ్యాపారంను మొదలు పెట్టాడు. ఆ సమయంలో కాస్త ఒడిదొడుకులు ఎదురు అయ్యాయి. ఉద్యోగులను పెట్టుకుని ఈ వ్యాపారం చేయాల్సి ఉంటుంది. కాని ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న సమయంలో ఈ వ్యాపారంను నిర్వహించడం కష్టం అనుకున్నాడు. ఆ సమయంలో తాత్కాలికంగా ఆపేసి మళ్లీ తన వ్యాపారంను ఇటీవలే మొదలు పెట్టాడు.
ప్రస్తుతం జలాన్ బజార్ క్రాఫ్ట్ అనే ఈ కామర్స్ సంస్థను రన్ చేస్తున్నాడు. 43 మంది టీమ్ గా ఉన్న బజార్ క్రాప్ట్ ప్రతి రోజు యావరేజ్ గా 200 ఆర్డర్లు వస్తున్నట్లుగా చెబుతున్నారు. మొదట్లో స్టోర్ ల నుండి వినియోగదారులకు రెండు గంటల వ్యవదిలో సరుకులు డెలవరీ ఇచ్చే వారు. కాని ఇప్పుడు మాత్రం నేరుగా తయారు సంస్థల నుండి సరుకులు కొనుగోలు చేస్తున్నట్లుగా జలాన్ పేర్కొన్నాడు. ఇలా చేయడం వల్ల ఎక్కువ కమీషన్ మిగులుతుంది అలాగే వినియోగదారులకు తాము ఆఫర్ లు ఇవ్వడానికి కూడా సాధ్యం అవుతుంది. ప్రస్తుతం సంస్థకు వస్తున్న ఆదాయంకు మరియు పెడుతున్న ఖర్చుకు మద్య స్వల్ప తేడానే ఉంది. కనుక త్వరలోనే మేము బ్రేక్ ఈవెను సాధిస్తామని జలాన్ నమ్మకంగా చెబుతున్నాడు.
ఈ టెయిలింగ్ వ్యాపారం అనేది చాలా లాభసాటి వ్యాపారం. కాని ఆరంభంలో ఉద్యోగస్తులకు ఎక్కువ జీతాలు ఇవ్వడం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. కాని ఉద్యోగుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే ఖచ్చితంగా లాభాలను దక్కించుకోవచ్చు. ఉద్యోగుల విషయంలో జలాన్ తెలివిగా అప్పుడే చదువు పూర్తి చేసుకున్న వారిని చదువు మద్యలో వదిలేసిన వారిని ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారిని ఫ్రెషర్స్ ను తీసుకోవడం జరిగింది. దాంతో వారు తక్కువ జీతానికే ఎక్కువ ఆసక్తితో చేస్తారు. అలా జీతాలను దాదాపుగా 30 నుండి 40 శాతం వరకు తగ్గించుకున్నాడు. కొత్త వ్యాపారం మొదలు పెట్టాలనుకునే వారికి జలాన్ ఆదర్శంగా నిలుస్తాడు అనడంలో సందేహం లేదు.
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
This website uses cookies.