e-commerce : సక్సెస్‌ స్టోరీ : దిగ్గజాలు చేతులు ఎత్తేసిన రంగంలో 21 ఏళ్ల కుర్రాడు అద్బుతాన్ని ఆవిష్కరించాడు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

e-commerce : సక్సెస్‌ స్టోరీ : దిగ్గజాలు చేతులు ఎత్తేసిన రంగంలో 21 ఏళ్ల కుర్రాడు అద్బుతాన్ని ఆవిష్కరించాడు

 Authored By himanshi | The Telugu News | Updated on :26 February 2021,1:12 pm

e-commerce : ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఈకామర్స్ బిజినెస్ కు విపరీతమైన ఆధరణ ఉంది. ఇలాంటి సమయంలో ప్రతి ఒక్క వ్యాపారవేత్త కూడా ఈ వ్యాపారం గురించి ఆలోచన చేస్తున్నారు. గ్రాసరీస్ డోర్‌ డెలవరీ వ్యాపారంను అంతర్జాతీయంగా పేరున్న బడా సంస్థలు దిగ్గజ వ్యాపారులు ఈ వ్యాపారంను నెత్తికి ఎత్తుకుని ఇప్పుడు వదిలేశారు. ఒకటి రెండు సంస్థలు మాత్రమే ఈ గ్రాసరీస్ బిజినెస్ లో ముందడుగు వేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఢిల్లీకి చెందిన 21 ఏళ్ల షెరుంగ్‌ జలాన్ ప్రస్తుతం ఈ బిజినెస్ లో దూసుకు పోతున్నాడు. 19 ఏళ్ల వయసులోనే అతడికి ఈ ఆలోచన వచ్చింది. తన వద్ద ఉన్న రూ.30 వేల రూపాయలు మరియు తల్లిదండ్రుల వద్ద ఉన్న కొంత మొత్తం ను తీసుకుని వ్యాపారంను మొదలు పెట్టాడు. ఆ సమయంలో కాస్త ఒడిదొడుకులు ఎదురు అయ్యాయి. ఉద్యోగులను పెట్టుకుని ఈ వ్యాపారం చేయాల్సి ఉంటుంది. కాని ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న సమయంలో ఈ వ్యాపారంను నిర్వహించడం కష్టం అనుకున్నాడు. ఆ సమయంలో తాత్కాలికంగా ఆపేసి మళ్లీ తన వ్యాపారంను ఇటీవలే మొదలు పెట్టాడు.

A 21 year old boy has made a name for himself in the field of giants

A 21-year-old boy has made a name for himself in the field of giants

e-commerce: వినియోగదారులకు రెండు గంటల్లో డెలవరీ..

ప్రస్తుతం జలాన్‌ బజార్‌ క్రాఫ్ట్‌ అనే ఈ కామర్స్‌ సంస్థను రన్‌ చేస్తున్నాడు. 43 మంది టీమ్ గా ఉన్న బజార్‌ క్రాప్ట్‌ ప్రతి రోజు యావరేజ్‌ గా 200 ఆర్డర్లు వస్తున్నట్లుగా చెబుతున్నారు. మొదట్లో స్టోర్‌ ల నుండి వినియోగదారులకు రెండు గంటల వ్యవదిలో సరుకులు డెలవరీ ఇచ్చే వారు. కాని ఇప్పుడు మాత్రం నేరుగా తయారు సంస్థల నుండి సరుకులు కొనుగోలు చేస్తున్నట్లుగా జలాన్‌ పేర్కొన్నాడు. ఇలా చేయడం వల్ల ఎక్కువ కమీషన్ మిగులుతుంది అలాగే వినియోగదారులకు తాము ఆఫర్‌ లు ఇవ్వడానికి కూడా సాధ్యం అవుతుంది. ప్రస్తుతం సంస్థకు వస్తున్న ఆదాయంకు మరియు పెడుతున్న ఖర్చుకు మద్య స్వల్ప తేడానే ఉంది. కనుక త్వరలోనే మేము బ్రేక్‌ ఈవెను సాధిస్తామని జలాన్ నమ్మకంగా చెబుతున్నాడు.

ఈరంగం మంచిదే కాని జాగ్రత్తలు అవసరం..

ఈ టెయిలింగ్ వ్యాపారం అనేది చాలా లాభసాటి వ్యాపారం. కాని ఆరంభంలో ఉద్యోగస్తులకు ఎక్కువ జీతాలు ఇవ్వడం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. కాని ఉద్యోగుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే ఖచ్చితంగా లాభాలను దక్కించుకోవచ్చు. ఉద్యోగుల విషయంలో జలాన్ తెలివిగా అప్పుడే చదువు పూర్తి చేసుకున్న వారిని చదువు మద్యలో వదిలేసిన వారిని ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారిని ఫ్రెషర్స్ ను తీసుకోవడం జరిగింది. దాంతో వారు తక్కువ జీతానికే ఎక్కువ ఆసక్తితో చేస్తారు. అలా జీతాలను దాదాపుగా 30 నుండి 40 శాతం వరకు తగ్గించుకున్నాడు. కొత్త వ్యాపారం మొదలు పెట్టాలనుకునే వారికి జలాన్ ఆదర్శంగా నిలుస్తాడు అనడంలో సందేహం లేదు.

Advertisement
WhatsApp Group Join Now

Also read

himanshi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది