Inspirational : సాయం చేయాలనుకుంటే లక్షలు, కోట్లు ఉండాల్సిన అవసరం లేదని మంచి మనసుంటే చాలని నిరూపించాడు పుణేకు చెందిన రాజేష్ కచి. తను సెలబ్రిటీ కాకున్నా ఆ ప్రాంతంలో అతడి పేరు చెబితే చాలు చిన్న పిల్లలైనా ఏకంగా శివాజీ నగర్‌లోని రాజేష్ ఇంటికి తీసుకువెళతారు. స్ట్రీట్ ఫుడ్ విక్రయిస్తూ బతుకు బండి నెట్టుకొచ్చే రాజేష్ అంతమంది గుండెల్లో ఎలా చోటు సంపాదించాడనే సందేహాలు వెంటాడే వారికి ఆ సామాన్యుడు ఏకంగా 150 మంది ప్రాణాలను కాపాడాడని తెలిస్తే వావ్ అనక మానరు. తోఫ్కానా స్లమ్‌లో చిన్న ఇంటిలో ఉండే రాజేష్ తన ఇంటికి 200 మీటర్ల దూరంలో ఉండే ఫుడ్ స్టాల్‌లో ఎగ్ బుర్జీ అమ్ముతూ పొట్టపోసుకుంటాడు. ఆయన ఇంటిలో చుట్టూ మనకు అవార్డులే కనిపిస్తాయి. 50 ఏండ్ల రాజేష్ జీవితంలో ఇంతకుమించి సాధించాల్సిదేముందని అతడితో కొద్దిసేపు మాట్లాడినవారికి అనిపిస్తుంటుంది.
ఇంటి నుంచి ఫుడ్ స్టాల్‌కు రాజేష్ ప్రతిరోజూ ముత్తా నదిపై బ్రిడ్జిని దాటి వెళ్లాలి. రాజేష్ చిన్నప్పటి నుంచి ఈ నదిలో ఈత కొడుతూ పెరిగాడు. నదితో లోతైన అనుబంధం తనదని తాను ముత్తా నది రాజానని మురిపెంగా చెప్పుకుంటాడు. గత మూడు దశాబ్దాలుగా ఈ నదిలో మునిగిపోకుండా వందలాది మందిని రాజేష్ కాపాడి వారిని ఒడ్డుకు చేర్చాడు. విధి విసిరే సవాల్‌లో సుదూర తీరాలకు చేరాల్సిన ఎందరినో ఒడ్డుకు చేర్చి బతుకునివ్వడంతోనే రాజేష్ అందరికీ హీరో అయ్యాడు. చిన్నతనంలోనే తల్లితండ్రులను కోల్పోయిన రాజేష్ స్కూల్‌ను అర్ధంతరంగా ముగించి బతుకు పోరాటంలో రాటుదేలాడు.
అమ్మమ్మ దగ్గర పెరిగిన తాను నదీతీరంలో వ్యవసాయ పనుల్లో నిమగ్నమవడంతో పాటు చిన్నతనంలో నదిలో ఈత కొట్టేవాడినని రాజేష్ చెబుతుంటాడు. తాను 19 ఏండ్ల వయసులో ఓ బాలిక నదిలో మునిగిపోవడం చూసి వెంటనే నీటిలో దూకి ఆమెను కాపాడానని గుర్తుచేసుకున్నాడు. ఇష్టం లేని పెండ్లి చేస్తున్నారనే బాధతో ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించిందని కుటుంబసభ్యులు కంటతడి పెడుతూ తమ కూతురిని కాపాడినందుకు వారు తనను మెచ్చుకుంటే ఉద్వేగానికి గురయ్యానని గుర్తుచేసుకున్నాడు. అప్పటినుంచి తన కండ్ల ముందు ఎవరూ చనిపోకూడదని తీర్మానించుకున్నానని చెబుతాడు. అప్పటినుంచి 150 మందికిపైగా నదిలో మునిగిపోతున్న వారిని, ఆత్మహత్యకు ప్రయత్నించేవారిని రాజేష్ కాపాడాడు.
వరదల్లోనూ నది ఉప్పొంగిన సమయాల్లో రాజేష్ ఆపన్నహస్తం అందించేవాడు. అలా తన పేరు అందరికీ తెలియడంతో ఆపదలో తనను పిలిచేవారని, ఆ సమయంలో ఫుడ్ స్టాల్‌లో ఎంత బిజీగా ఉన్నా పరుగున అక్కడికి చేరుకునే వాడినని చెబుతున్నాడు. అర్ధరాత్రి పిలిచినా రాజేష్ అందుబాటులో ఉండి ఆపద నుంచి కాపాడేవాడని అతడి గురించి తెలిసిన వారు చెబుతారు. సంపద లేని సామాన్యుడు, స్కూల్ డ్రాపవుట్ అయిన రాజేష్ తన పరిధిలో చేస్తున్న సాయం ఆ ప్రాంత వాసులకు అతడిని ఆత్మీయుడిని చేసింది. రాజేష్ రియల్ హీరో అని వారంతా చెబుతుంటే అదేమీ పట్టనంటూ తన పనిలో పడుతుంటాడు ఆయన.
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
This website uses cookies.