Gurukul Jobs : గురుకులాల్లో 6 వేల‌కు పైగా ఖాళీలు.. ఇంకా 60 రోజుల సమయం ఉంది అప్లై చేసుకోండి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Gurukul Jobs : గురుకులాల్లో 6 వేల‌కు పైగా ఖాళీలు.. ఇంకా 60 రోజుల సమయం ఉంది అప్లై చేసుకోండి..!

Gurukul Jobs : తెలంగాణలోని లోని SC, ST, BC, మైనారిటీ, సాధారణ గురుకులాల్లో 6 వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 2023లో ఇచ్చిన నోటిఫికేషన్‌లో 1,800కు పైగా బ్యాక్‌లాగ్ ఖాళీలు ఉన్నట్లు అంచనా. డీఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీతో పాటు వివిధ విభాగాల్లో ఉన్న ఉద్యోగాలను 2025-26 జాబ్ క్యాలెండర్‌లో భర్తీ చేయనున్నట్లు సమాచారం. డీఎస్సీ, జేఎల్ నియామకాల తర్వాత మొత్తం ఖాళీలపై స్ప‌ష్ట‌త వస్తుందని అధికారులు చెబుతున్నారు. డీఎల్, జేఎల్, […]

 Authored By ramu | The Telugu News | Updated on :17 August 2024,7:00 am

ప్రధానాంశాలు:

  •  Gurukul Jobs : గురుకులాల్లో 6 వేల‌కు పైగా ఖాళీలు.. ఇంకా 60 రోజుల సమయం ఉంది అప్లై చేసుకోండి..!

Gurukul Jobs : తెలంగాణలోని లోని SC, ST, BC, మైనారిటీ, సాధారణ గురుకులాల్లో 6 వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 2023లో ఇచ్చిన నోటిఫికేషన్‌లో 1,800కు పైగా బ్యాక్‌లాగ్ ఖాళీలు ఉన్నట్లు అంచనా. డీఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీతో పాటు వివిధ విభాగాల్లో ఉన్న ఉద్యోగాలను 2025-26 జాబ్ క్యాలెండర్‌లో భర్తీ చేయనున్నట్లు సమాచారం. డీఎస్సీ, జేఎల్ నియామకాల తర్వాత మొత్తం ఖాళీలపై స్ప‌ష్ట‌త వస్తుందని అధికారులు చెబుతున్నారు.

డీఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీ స్థాయి నుంచి కిందిస్థాయి వరకు భర్తీ చేయకపోవడం, ఒకేసారి నాలుగైదు కేటగిరీ పోస్టుల ఫలితాలు ఇవ్వడంతో కొందరు అభ్యర్థులు ఒకటి కన్నా ఎక్కువ పోస్టులకు ఎంపికయ్యారు. వారంతా ఏదేని ఒక పోస్టులో చేరుతూ మిగిలిన వాటిని వదులుకుంటున్నారు. గతంలో మాదిరి రీలింక్విష్‌మెంట్‌ సదుపాయం లేకపోవడంతో ఆయా పోస్టులు ఖాళీగా మిగిలిపోనున్నాయి. ఆగస్టు మొదటి వారంలో కొత్తగా నియమితులైనవారికి గురుకుల సొసైటీలు పోస్టింగులు ఇచ్చాయి. అభ్యర్థులు ఆయా పోస్టుల్లో చేరేందుకు 60 రోజుల సమయం ఉంది. ఈ గడువు తర్వాత గురుకులాల్లో బ్యాక్‌లాగ్‌ పోస్టులపై మరింత స్పష్టత వస్తుందని సొసైటీ వర్గాలు పేర్కొంటున్నాయి.

Gurukul Jobs గురుకులాల్లో 6 వేల‌కు పైగా ఖాళీలు ఇంకా 60 రోజుల సమయం ఉంది అప్లై చేసుకోండి

Gurukul Jobs : గురుకులాల్లో 6 వేల‌కు పైగా ఖాళీలు.. ఇంకా 60 రోజుల సమయం ఉంది అప్లై చేసుకోండి..!

డీఎస్సీ, జేఎల్‌ పరీక్షల ఫలితాల అనంతరం గురుకులాల్లో మరో వెయ్యి నుంచి 2 వేల పోస్టులు ఖాళీ కానున్నట్లు సమాచారం. ఎస్సీ గురుకుల సొసైటీలో దాదాపు 1,800కు పైగా పోస్టులతో పాటు మిగిలిన సొసైటీల్లోనూ ఖాళీలు ఉన్నాయి. గతేడాది ఈ పోస్టులకు సకాలంలో ప్రతిపాదనలు సమర్పించకపోవడంతో భర్తీకి అనుమతి లభించలేదు. ఈ పోస్టులన్నీ కలిపితే గురుకులాల్లో దాదాపు 6 వేలకు పైగా కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది