Coal India Limited : కోల్ ఇండియా లిమిటెడ్‌లో 640 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తులు
ప్రధానాంశాలు:
Coal India Limited : కోల్ ఇండియా లిమిటెడ్‌లో 640 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తులు
Coal India Limited : కోల్ ఇండియా లిమిటెడ్ CIL, గేట్ రిక్రూట్‌మెంట్ 2024 ద్వారా మేనేజ్‌మెంట్ ట్రైనీస్ MT ప్రకటనను విడుదల చేసింది. ఈ మేనేజ్‌మెంట్ ట్రైనీ రిక్రూట్‌మెంట్‌లో దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులందరూ 29 అక్టోబర్ 2024 నుండి 28 నవంబర్ 2024 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Coal India Limited ఖాళీల వివరాలు
మేనేజ్‌మెంట్ ట్రైనీ ఇ-2 గ్రేడ్ : 640 పోస్టులు (జనరల్- 190, ఈడబ్ల్యూఎస్- 43, ఎస్సీ- 67, ఎస్టీ- 34, ఓబీసీ- 124)
విభాగాల వారీగా ఖాళీలు : మైనింగ్- 263; సివిల్- 91; ఎలక్ట్రికల్- 102; మెకానికల్- 104; సిస్టమ్- 41; ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్- 39.
అర్హత : కనీసం 60 శాతం మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ (మైనింగ్/ సివిల్/ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్), బీఈ, బీటెక్ (కంప్యూటర్ సైన్స్/ కంప్యూటర్ ఇంజినీరింగ్/ ఐటీ/ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్), ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు గేట్-2024 అర్హత సాధించి ఉండాలి.
వయో పరిమితి : 30-09-2024 నాటికి 30 సంవత్సరాలు మించకూడదు.
జీత భత్యాలు : నెలకు రూ.50,000- రూ.1,60,000.
ఎంపిక ప్రక్రియ : గేట్-2024 స్కోర్, రూల్ ఆఫ్ రిజర్వేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.
దరఖాస్తు రుసుము : జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1180. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌లో.
ముఖ్య తేదీలు :
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 29-10-2024.
ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 28-11-2024.
ముఖ్యాంశాలు :
640 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి కోల్ ఇండియా లిమిటెడ్ దరఖాస్తులు కోరుతోంది.
బ్యాచిలర్స్ డిగ్రీ, బీటెక్, గేట్ 2024 ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తుకు అర్హులు.
అభ్యర్థులు నవంబర్ 11వ తేదీలోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.