Indian Air Force : నిరుద్యోగులకు శుభవార్త… ఇంటర్, డిప్లమా అర్హతతో ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాలు… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Indian Air Force : నిరుద్యోగులకు శుభవార్త… ఇంటర్, డిప్లమా అర్హతతో ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాలు…

Indian Air Force : ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో కింది స్థాయి పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఉన్నారు. అగ్నిపథ్ పథకం కింద రిక్రూట్మెంట్ లు కూడా జరుగుతున్నాయి. అలాగే అభ్యర్థులు జూలై 8 నుండి 28 వరకు నమోదు చేసుకునేందుకు అనుమతి కూడా ఇచ్చారు. 12వ తరగతి ఉత్తీర్ణత మరియు డిప్లోమా గాడ్యుయేట్ పారిశ్రామిక శిక్షణ పొందినటువంటి వారు అవివాహిత పురుష మరియు మహిళ అభ్యర్థులు ఎవరైనా ఉంటే ఆన్ లైన్ విధానంలో నమోదు […]

 Authored By ramu | The Telugu News | Updated on :22 June 2024,9:00 am

ప్రధానాంశాలు:

  •  Indian Air Force : నిరుద్యోగులకు శుభవార్త... ఇంటర్, డిప్లమా అర్హతతో ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాలు...

Indian Air Force : ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో కింది స్థాయి పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఉన్నారు. అగ్నిపథ్ పథకం కింద రిక్రూట్మెంట్ లు కూడా జరుగుతున్నాయి. అలాగే అభ్యర్థులు జూలై 8 నుండి 28 వరకు నమోదు చేసుకునేందుకు అనుమతి కూడా ఇచ్చారు. 12వ తరగతి ఉత్తీర్ణత మరియు డిప్లోమా గాడ్యుయేట్ పారిశ్రామిక శిక్షణ పొందినటువంటి వారు అవివాహిత పురుష మరియు మహిళ అభ్యర్థులు ఎవరైనా ఉంటే ఆన్ లైన్ విధానంలో నమోదు చేసుకోవచ్చు.
ఎంపికైనటువంటి అభ్యర్థులకు మొదటి ఏడాదిలో రూ.30వేలు, రెండవ ఏడాదిలో రూ.33 వేలు,మూడవ ఏడాదిలో రూ.36,500 అందిస్తారు. అలాగే నాలుగవ ఏడాది రూ.40 వేలు వేతనాలు నిర్ణయించటం జరుగుతుంది. ఫస్ట్ ఏడాది రూ.9 వేలు, రెండవ ఏడాది రూ.9,900, మూడవ ఏడాది 10,950, అలాగే నాలుగవ ఏడాదిలో రూ.12,వేలు సేవా నిధిగా ప్రభుత్వం మీకు అందిస్తుంది. అంతే 4 ఏళ్ల సర్వీసు తర్వాత వడ్డీతో సహా 10.4 లక్షల వరకు ఇవ్వటం జరుగుతుంది…

వయోపరిమితి వివరాలు :
దరఖాస్తులను సమర్పించాలి అనుకునే అభ్యర్థులకు జులై 3, 2004 మరియు జనవరి 3, 2008 మధ్యన జన్మించిన వారై ఉండాలి. అభ్యర్థి అన్ని పరీక్ష దశలను క్లియర్ చేసినట్లయితే రిజిస్ట్రేషన్ తేదీల్లోగా వర్తించే విధంగా గరిష్టంగా 21 సంవత్సరాల వరకు కూడా వయోపరిమితి అనేది పరిగణించడం జరుగుతుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఫస్ట్ దశలో ఆన్ లైన్ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. అభ్యర్థులకు నమోదు ఉచితం. కానీ పరీక్ష ఫీజు మాత్రం రూ.550 చెల్లించాల్సి ఉంటుంది. పరీక్ష అయిన తరువాత రోజు 18/10/2024. ఆన్ లైన్ పరీక్షలలో అర్హత సాధించినటువంటి అభ్యర్థులు శారీరక దారుడ్య పరీక్షలకు కూడా లోబడి ఉంటారు. కావున 7 నిమిషాలలో 1.6 కి.మీ.m. రన్నింగ్, మహిళలకు 8 నిమిషాలు, పుష్ అప్స్, సీట్ అప్స్ లాంటివి చేస్తారు. వైద్య పరీక్షలు కూడా నిర్వహించడం జరుగుతుంది…

Indian Air Force నిరుద్యోగులకు శుభవార్త ఇంటర్ డిప్లమా అర్హతతో ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాలు

Indian Air Force : నిరుద్యోగులకు శుభవార్త… ఇంటర్, డిప్లమా అర్హతతో ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాలు…

12వ తరగతి మరియు మూడు సంవత్సరాల డిప్లో మా, రెండు సంవత్సరాల పారిశ్రామిక శిక్షణ ఉత్తీర్ణులు అయినటువంటి వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు గణితం మరియు ఫిజిక్స్ మరియు ఇంగ్లీష్ లాంటి సబ్జెక్టులతో ఈ అర్హతకు ఉత్తీర్ణులు కావలసి ఉంటుంది ఈ మూడు సబ్జెక్టులలో కనీస 50% మార్కులు వచ్చి ఉండాలి.12 తరగతి ఉత్తీర్ణత కావాలి అనుకుంటే ఇంగ్లీషులో 50% మార్కులు కచ్చితంగా సాధించాలి. పురుషులు 152.5 మరియు మహిళలు 152. సెం.మీ.m.ఎత్తుగా ఉండి తీరాలి. ఆసక్తి మరియు అర్హత ఉన్నటువంటి అభ్యర్థులు https://agnipathvayu.cdac.in/AV/ వెబ్ సైట్ ని సందర్శించాల్సి ఉంటుంది…

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది