Categories: Jobs EducationNews

Good News : నిరుద్యోగుల‌కు భారీ శుభ‌వార్త‌.. భారీ జాబ్ మేళా..!

Advertisement
Advertisement

Good News : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించే విధంగా APSSDC ఆధ్వర్యం లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. ప్రత్యేకంగా రూపొందించిన స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా జిల్లాల వారీగా పదో తరగతి మొదలుకుని ఆపై చదువులు చదివిన యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది. ఇందులో భాగంగానే సత్యసాయి జిల్లాలోని పెనుకొండ పట్టణంలో గ‌ల‌ పరిటాల శ్రీ రాములు కళాశాలలో ఈ నెల 3న మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్న‌ది. ఈ మెగా ఫెయిర్‌లో పలు ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయి. ఆక్సిస్, అపోలో, L&T construction, phonepe, KL గ్రూప్, అమెజాన్ వంటి ప్రముఖ కంపెనీలు తమ సంస్థల్లో ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ఈ జాబ్ ఫెయిర్ ద్వారా ముందుకు వ‌చ్చాయి.

Advertisement

టెన్త్‌, ఇంటర్మీడియట్, ఐటిఐ, డిప్లమో, డిగ్రీ, బీటెక్, బీఎస్సీ, ఎమ్మెస్సీ, బయో టెక్నాలజీ, మైక్రో బయాలజీ (2023-2024 బ్యాచ్ లు) పూర్తి చేసి 35 ఏండ్ల వయసు వారు అర్హులు. ఈ మెగా జాబ్ మేళాను నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ కేశవరావు, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి అబ్దుల్ ఖయూం ఒక ప్రకటనలో కోరారు. ఉద్యోగాలకు ఎంపికైన వారు వారికీ నెలకు రూ 12 నుంచి రూ 20 వేల వరకు జీతం, ఇన్సెంటివ్, భోజనం, వసతి, రవాణా సౌకర్యం ఉంటుంది. వీరు ఉమ్మడి జిల్లాల్లో, హైదరాబాద్, బెంగళూరులో ఉద్యోగం చేయాల్సి ఉంటుందన్నారు. మేళాకు హాజరయ్యే అభ్య‌ర్థులు రెజ్యూమ్, విద్యా అర్హత జిరాక్సులు, ఆధార్ కార్డ్ , పాన్ కార్డ్ , పాస్‌పోర్టు సైజ్ ఫొటో వెంట తీసుకురావాలని సూచించారు. 3న ఉదయం 9 గంటలకు ఇంటర్వ్యూలకు హాజరు కావాలన్నారు. మరిన్ని వివరాలకు కో ఆర్డినేటర్ ప్రసాద్ 96767 06976 నంబ‌ర్‌కు సంప్ర‌దించాల‌ని పేర్కొన్నారు.

Advertisement

Good News ఏపీఎస్ఎస్‌డీస్సీ

Good News : నిరుద్యోగుల‌కు భారీ శుభ‌వార్త‌.. భారీ జాబ్ మేళా..!

APSSDC అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి & వ్యవస్థాపకతను ప్రోత్సహించడానికి పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ (PPP) కార్పొరేషన్‌గా ఏర్పడిన లాభాపేక్షలేని సంస్థ. AP ప్రభుత్వం 49% వాటాతో మరియు 51% ప్రైవేట్ ఈక్విటీ కాంపోనెంట్‌తో కార్పొరేషన్‌గా విలీనం చేయబడింది. కార్పొరేషన్ కొత్తగా ఏర్పడిన నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మరియు ఆవిష్కరణల విభాగానికి ‘ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ’గా పనిచేస్తుంది. APSSDC GoAP యొక్క ‘నాలెడ్జ్ అండ్ స్కిల్స్ మిషన్’లో భాగంగా అధిక నాణ్యత గల నైపుణ్యం కలిగిన మానవశక్తిని అందించే ముఖ్యమైన పనిని కూడా అందిస్తుంది. ఇది రెండంకెల వృద్ధిని సులభతరం చేయడానికి AP ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏడు మిషన్లలో ఒకటి.

Advertisement

Recent Posts

YSR Congress Party : ఏపీ డిస్కమ్‌లు, అదానీ గ్రూపుల మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదు, విద్యుత్ ఒప్పందాల‌తో రాష్ట్రానికి గణనీయంగా ప్రయోజనం : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ

YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…

57 mins ago

Hair Tips : చిట్లిన జుట్టుకు ఈ హెయిర్ ప్యాక్ తో చెక్ పెట్టండి…??

Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…

2 hours ago

Bigg Boss Telugu 8 : ఎక్క‌డా త‌గ్గేదే లే అంటున్న గౌత‌మ్.. విశ్వక్ సేన్ సంద‌డి మాములుగా లేదు..!

Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజ‌న్ 8 చివ‌రి ద‌శ‌కు రానే వ‌చ్చింది. మూడు వారాల‌లో…

3 hours ago

Winter : చలికాలంలో గీజర్ వాడే ప్రతి ఒక్కరు తెలుసుకోవలసిన ముఖ్య విషయాలు…??

Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…

4 hours ago

Ind Vs Aus : సేమ్ సీన్ రిపీట్‌.. బ్యాట‌ర్లు చేత్తులెత్తేయ‌డంతో 150 ప‌రుగుల‌కే భార‌త్ ఆలౌట్

Ind Vs Aus : సొంత గ‌డ్డ‌పై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భార‌త జ‌ట్టుని వైట్ వాష్ చేసింది.…

5 hours ago

Allu Arjun : ప్లానింగ్ అంతా అల్లు అర్జున్ దేనా.. మొన్న పాట్నా.. రేపు చెన్నై తర్వాత కొచ్చి..!

Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule  ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…

5 hours ago

Wheat Flour : మీరు వాడుతున్న గోధుమపిండి మంచిదా.. కాదా.. అని తెలుసుకోవాలంటే… ఈ చిట్కాలను ట్రై చేయండి…??

Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…

6 hours ago

IPL 2025 Schedule : క్రికెట్ అభిమానుల‌కి పండగే పండ‌గ‌.. మూడు ఐపీఎల్‌ సీజన్ల తేదీలు వచ్చేశాయ్‌..!

IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికుల‌కి మంచి మ‌జా అందించే గేమ్ ఐపీఎల్‌. ధ‌నాధ‌న్ ఆట‌తో ప్రేక్ష‌కుల‌కి మంచి…

7 hours ago

This website uses cookies.