Good News : నిరుద్యోగులకు భారీ శుభవార్త.. భారీ జాబ్ మేళా..!
ప్రధానాంశాలు:
Good News : నిరుద్యోగులకు భారీ శుభవార్త.. భారీ జాబ్ మేళా..!
Good News : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించే విధంగా APSSDC ఆధ్వర్యం లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. ప్రత్యేకంగా రూపొందించిన స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా జిల్లాల వారీగా పదో తరగతి మొదలుకుని ఆపై చదువులు చదివిన యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది. ఇందులో భాగంగానే సత్యసాయి జిల్లాలోని పెనుకొండ పట్టణంలో గల పరిటాల శ్రీ రాములు కళాశాలలో ఈ నెల 3న మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నది. ఈ మెగా ఫెయిర్‌లో పలు ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయి. ఆక్సిస్, అపోలో, L&T construction, phonepe, KL గ్రూప్, అమెజాన్ వంటి ప్రముఖ కంపెనీలు తమ సంస్థల్లో ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ఈ జాబ్ ఫెయిర్ ద్వారా ముందుకు వచ్చాయి.
టెన్త్, ఇంటర్మీడియట్, ఐటిఐ, డిప్లమో, డిగ్రీ, బీటెక్, బీఎస్సీ, ఎమ్మెస్సీ, బయో టెక్నాలజీ, మైక్రో బయాలజీ (2023-2024 బ్యాచ్ లు) పూర్తి చేసి 35 ఏండ్ల వయసు వారు అర్హులు. ఈ మెగా జాబ్ మేళాను నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ కేశవరావు, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి అబ్దుల్ ఖయూం ఒక ప్రకటనలో కోరారు. ఉద్యోగాలకు ఎంపికైన వారు వారికీ నెలకు రూ 12 నుంచి రూ 20 వేల వరకు జీతం, ఇన్సెంటివ్, భోజనం, వసతి, రవాణా సౌకర్యం ఉంటుంది. వీరు ఉమ్మడి జిల్లాల్లో, హైదరాబాద్, బెంగళూరులో ఉద్యోగం చేయాల్సి ఉంటుందన్నారు. మేళాకు హాజరయ్యే అభ్యర్థులు రెజ్యూమ్, విద్యా అర్హత జిరాక్సులు, ఆధార్ కార్డ్ , పాన్ కార్డ్ , పాస్‌పోర్టు సైజ్ ఫొటో వెంట తీసుకురావాలని సూచించారు. 3న ఉదయం 9 గంటలకు ఇంటర్వ్యూలకు హాజరు కావాలన్నారు. మరిన్ని వివరాలకు కో ఆర్డినేటర్ ప్రసాద్ 96767 06976 నంబర్‌కు సంప్రదించాలని పేర్కొన్నారు.
Good News ఏపీఎస్ఎస్‌డీస్సీ
APSSDC అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి & వ్యవస్థాపకతను ప్రోత్సహించడానికి పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ (PPP) కార్పొరేషన్‌గా ఏర్పడిన లాభాపేక్షలేని సంస్థ. AP ప్రభుత్వం 49% వాటాతో మరియు 51% ప్రైవేట్ ఈక్విటీ కాంపోనెంట్‌తో కార్పొరేషన్‌గా విలీనం చేయబడింది. కార్పొరేషన్ కొత్తగా ఏర్పడిన నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మరియు ఆవిష్కరణల విభాగానికి ‘ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ’గా పనిచేస్తుంది. APSSDC GoAP యొక్క ‘నాలెడ్జ్ అండ్ స్కిల్స్ మిషన్’లో భాగంగా అధిక నాణ్యత గల నైపుణ్యం కలిగిన మానవశక్తిని అందించే ముఖ్యమైన పనిని కూడా అందిస్తుంది. ఇది రెండంకెల వృద్ధిని సులభతరం చేయడానికి AP ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏడు మిషన్లలో ఒకటి.