AP Health Department : ఏపీ ఆరోగ్య శాఖలో భారీగా ఉద్యోగాలు
AP Health Department : ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య సదుపాయాల విస్తరణను లక్ష్యంగా పెట్టుకుని భారీగా పోస్టులు భర్తీ చేయడానికి ఆమోదం తెలిపింది. అర్బన్ క్లినిక్స్ ఏర్పాటు కోసం గతంలో విడుదలైన ఉత్తర్వుల్లో కొన్ని మార్పులు చేస్తూ తాజాగా G.O.Rt.No.357 ను విడుదల చేసింది. వీటిలో కొన్ని కాంట్రాక్ట్ విధానంలో, మరికొన్ని ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనున్నట్లు పేర్కొంది.
AP Health Department : ఏపీ ఆరోగ్య శాఖలో భారీగా ఉద్యోగాలు
తాజా ఉత్తర్వుల ప్రకారం అర్బన్ క్లినిక్స్ లోని మానవ వనరుల నియామకానికి సంబంధించి వివిధ పోస్టులు భర్తీ కానున్నాయి. మొత్తం 560 మెడికల్ ఆఫీసర్లను కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమించనున్నారు. వీరికి నెలవారీ జీతం రూ. 61,960/- లభిస్తుంది. అదేవిధంగా 1,120 స్టాఫ్ నర్సు పోస్టులు కాంట్రాక్ట్ పద్ధతిలో నియమిస్తారు.
వీరికి నెలకు వేతనం రూ. 22,500/- . ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు 560. వీరికి నెల జీతం రూ. 23,393/-. ఫార్మసిస్ట్ పోస్టులు 560. వీరికి నెల జీతం రూ.23,500/. డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు 560. ఔట్ సోర్సింగ్ విధానం ద్వారా భర్తీ. వీరికి నెలకు రూ.18,450/- జీతం. శానిటరీ అటెండెంట్ / లోవర్ గ్రేడ్ సర్వీసెస్ పోస్టులు 560. ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ. వీరికి నెలవారీ జీతంగా రూ.15,000/- చెల్లించనున్నారు. ఈ ఉత్తర్వు ప్రకారం తదుపరి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
Anitha : ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనపై…
Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాజాగా మరోసారి దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి కనిపించడం ప్రస్తుతం సోషల్…
Buddha Venkanna : తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బుద్ధా వెంకన్న వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు…
Chamala Kiran Kumar Reddy : తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు విషయంలో సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు…
3 Jobs AI : కృత్రిమ మేధస్సు (AI) విస్తృతంగా ప్రవేశించడంతో భారతీయ ఉద్యోగ రంగంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.…
Kingdom : యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘కింగ్డమ్’ జూలై 31న భారీ…
Linguda Vegetable : ప్రకృతి ఇచ్చే ప్రతి ఒక్క కూరగాయ అయినా పనులైన ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. అందులో ఆకుపచ్చని…
Supreme Court : తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పును వెలువరించింది. ఈ…
This website uses cookies.