Indian Postal Jobs : ఇండియన్ పోస్టల్ పేమెంట్ డిపార్ట్మెంట్ నుండి భారీ నోటిఫికేషన్ విడుదల…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Indian Postal Jobs : ఇండియన్ పోస్టల్ పేమెంట్ డిపార్ట్మెంట్ నుండి భారీ నోటిఫికేషన్ విడుదల…!

 Authored By ramu | The Telugu News | Updated on :26 March 2024,10:00 am

Indian Postal Jobs  : నిరుద్యోగ యువతకు శుభవార్త. పోస్టల్ శాఖలో పనిచేయాలనుకునే వ్యక్తులకు తపాలా శాఖ నుండి మంచి అవకాశం లభించింది. ఇండియన్ పోస్ట్ బ్యాంకులో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు తాజాగా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇక ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఈ కథనాన్ని పూర్తిగా చదవండి.

Indian Postal Jobs నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ

ఈ భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ నుండి విడుదల కావడం జరిగింది.

Indian Postal Jobs ఖాళీలు…

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా ఇండియన్ పోస్ట్ బ్యాంకులో ఖాళీగా ఉన్న 47 ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అయితే ఈ ఖాళీలు అనేవి రాష్ట్రాల వారీగా విభజించి ఉంటాయి. వాటి పూర్తి వివరాలు క్రింది విధంగా ఉన్నాయి

బీహార్: 5
ఢిల్లీ: 1
గుజరాత్: 8
హర్యానా: 4
జార్ఖండ్: 1
కర్ణాటక: 1
మధ్యప్రదేశ్: 3
మహారాష్ట్ర: 2
ఒడిశా: 1
పంజాబ్: 4
రాజస్థాన్: 4
తమిళనాడు: 2
ఉత్తరప్రదేశ్: 11

Indian Postal Jobs  విద్యాహత…

ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకునేవారు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ డిగ్రీ ని కలిగి ఉండాలి. ఇక ఇండియన్ పోస్ట్ బ్యాంక్ నోటిఫికేషన్ ప్రకారం MBA విద్యార్హత కలిగి ఉన్న విద్యార్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతున్నట్లు తెలుస్తోంది.

జీతం : ఈ ఉద్యోగానికి ఎంపికైన వారికి నెలకు 30,000 రూపాయలు జీతం చెల్లించబడుతుంది.

వయస్సు : ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకునే వారు కనిష్టంగా 21 నుండి గరిష్టంగా 35 సంవత్సరాలు కలిగి ఉండాలి.

రుసుము : ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ ఫీజ్ చెల్లించాల్సి ఉంటుంది. SC,ST లకు 150 రూపాయలు ఇతర వర్గాలకు 750 రూపాయలు.

ముఖ్యమైన తేదీలు : ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : మార్చి 15 2024.

దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ : ఏప్రిల్ 5 2024.

ఎలా అప్లై చేయాలి : ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకునే వారు సంబంధిత ఆఫీసియల్ వెబ్ సైట్ లోకి వెళ్లి మీ పూర్తి వివరాలను నమోదు చేసి సబ్ మిట్ చేయాల్సి ఉంటుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది