Job : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఏపీఎస్ఎస్‌డీసీ ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు
Job : యువతలో వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించే విధంగా APSSDC ఆధ్వర్యంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. యువతకు ఉపాధి ధ్యేయంగా ప్రత్యేకంగా రూపొందించిన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా జిల్లాల వారీగా పదో తరగతి మొదలుకుని ఆపై చదువులు చదివి ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది.
రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఉద్యోగ మేళాలో నిర్వహిస్తూ కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది. ఇందులో భాగంగానే కర్నూలు జిల్లా కేంద్రంలోని స్థానిక STBC కళాశాలలో ఈ నెల 18న మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కర్నూలు జిల్లా ఉపాధి కల్పనా అధికారి తెలిపారు. ఈ జాబ్ మేళాలో L&T వంటి భారీ కంపెనీలు తమ సంస్థల్లో ఉద్యోగాలు భర్తీ చేసేందుకు పాల్గొంటున్నాయి. దీనికోసం పదో తరగతి నుంచి B.Sc, బి.టెక్ లేదా ITI ఇతర ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. వయసు 18 నుంచి 30 ఏళ్లలోపు వారు అర్హులు.
Job : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఏపీఎస్ఎస్‌డీసీ ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు
18న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ ఉద్యోగ మేళా నిర్వహణ జరుగనుంది. ఉద్యోగ మేళాను జిల్లాలోని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉపాధికల్పనా అధికారి కోరారు. ఈ ఉద్యోగం మేళాలో ఎంపికైన వారికి ఉద్యోగి అర్హతను బట్టి జీతం రూ.10 వేల నుంచి రూ.3.5 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. ఉద్యోగ మేళాకు హాజరయ్యే అభ్యర్థులు రెజ్యూమ్, విద్యార్హతా జిరాక్సులు, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్‌పోర్టు సైజ్ ఫొటో తీసుకురావాలని సూచించారు.
Chandrababu : రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం "సుపరిపాలనలో తొలి అడుగు" అనే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించింది. ఈ…
Pakiza : హాస్య నటిగా పాకీజా అలియాస్ వాసుకీ ఎన్నో చిత్రాలతో ప్రేక్షకల్ని మెప్పించారు. కొంతకాలంగా అవకాశాలు లేక తీవ్ర…
Rain Water : వర్షాకాలం సీజన్ వచ్చేసింది. వర్షంలో తడవడానికి ఇష్టపడని వారంటూ ఉండరు. అయితే వర్షంలో తడుస్తూ సంతోషంగా…
Gk Fact Osk : ప్రతి ఒక్కరు కూడా చికెన్ అంటే చాలా సంతోషంగా ఆరోజు భోజనాన్ని తినేస్తుంటారు. కోడి…
Sugar Patients : మధుమేహం వ్యాధి దీర్ఘకాలిక వ్యాధి. అదే ఒకసారి వచ్చినట్లయితే జీవితాంతం వరకు ఉంటుంది. జీవితాంతం చాలా…
Business : ప్రస్తుత కాలంలో బిజినెస్ అనేది బెస్ట్ ఆప్షన్ గా చాలామంది భావిస్తున్నారు. చేతిలో కొంత డబ్బు ఉంటె…
Beetroot Leaves : ఆకు కూరలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ ఆకు కూరల్లో కొవ్వు తక్కువగా ఉంటుంది. ప్రోటీన్లు,విటమిన్లు,…
Vijayasai Reddy : వైసీపీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే పార్టీకి, రాజకీయాలకు గుడ్‌బై చెబుతూ రాజీనామా చేసిన…
This website uses cookies.