Job : నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్‌.. ఏపీఎస్ఎస్‌డీసీ ఆధ్వ‌ర్యంలో ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాలు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Job : నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్‌.. ఏపీఎస్ఎస్‌డీసీ ఆధ్వ‌ర్యంలో ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాలు

 Authored By ramu | The Telugu News | Updated on :18 September 2024,11:00 am

ప్రధానాంశాలు:

  •  Job : నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్‌.. ఏపీఎస్ఎస్‌డీసీ ఆధ్వ‌ర్యంలో ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాలు

Job  : యువతలో వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించే విధంగా APSSDC ఆధ్వర్యంలో ఏపీ రాష్ట్ర ప్ర‌భుత్వం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. యువతకు ఉపాధి ధ్యేయంగా ప్రత్యేకంగా రూపొందించిన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా జిల్లాల వారీగా పదో తరగతి మొదలుకుని ఆపై చదువులు చదివి ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది.

రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఉద్యోగ మేళాలో నిర్వహిస్తూ కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది. ఇందులో భాగంగానే కర్నూలు జిల్లా కేంద్రంలోని స్థానిక STBC కళాశాలలో ఈ నెల 18న మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కర్నూలు జిల్లా ఉపాధి కల్పనా అధికారి తెలిపారు. ఈ జాబ్ మేళాలో L&T వంటి భారీ కంపెనీలు తమ సంస్థల్లో ఉద్యోగాలు భర్తీ చేసేందుకు పాల్గొంటున్నాయి. దీనికోసం పదో తరగతి నుంచి B.Sc, బి.టెక్ లేదా ITI ఇతర ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. వయసు 18 నుంచి 30 ఏళ్లలోపు వారు అర్హులు.

Job నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్‌ ఏపీఎస్ఎస్‌డీసీ ఆధ్వ‌ర్యంలో ఉద్యోగ‌ ఉపాధి అవ‌కాశాలు

Job : నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్‌.. ఏపీఎస్ఎస్‌డీసీ ఆధ్వ‌ర్యంలో ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాలు

18న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ ఉద్యోగ మేళా నిర్వ‌హ‌ణ జ‌రుగ‌నుంది. ఉద్యోగ మేళాను జిల్లాలోని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉపాధికల్పనా అధికారి కోరారు. ఈ ఉద్యోగం మేళాలో ఎంపికైన వారికి ఉద్యోగి అర్హతను బట్టి జీతం రూ.10 వేల నుంచి రూ.3.5 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. ఉద్యోగ మేళాకు హాజరయ్యే అభ్య‌ర్థులు రెజ్యూమ్, విద్యార్హతా జిరాక్సులు, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్‌పోర్టు సైజ్ ఫొటో తీసుకురావాలని సూచించారు.

Advertisement
WhatsApp Group Join Now

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది