Jobs In Amazon : అమెజాన్‌లో భారీగా ఉద్యోగాలు.. ఏడాదికి రూ.3.6 లక్షల ప్యాకేజీ
ప్రధానాంశాలు:
Jobs In Amazon : అమెజాన్‌లో భారీగా ఉద్యోగాలు.. ఏడాదికి రూ.3.6 లక్షల ప్యాకేజీ
Jobs In Amazon : ప్రపంచ టెక్ దిగ్గజం అమెజాన్ ఉద్యోగార్థులకు శుభవార్త చెప్పింది. బీటెక్, ఇతర గ్రాడ్యుయేట్ కోర్సులు పూర్తి చేసిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. కంపెనీ రొబోటిక్స్ ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్స్‌లో అసోసియేట్ పోస్టులను భర్తీ చేస్తోంది. ఎంపికైన అభ్యర్థులు గో- ఏఐ ఆపరేషన్స్ టీమ్‌లోని ML డేటా ఆపరేషన్స్ అసోసియేట్‌గా పనిచేయాల్సి ఉంటుంది.

Jobs In Amazon : అమెజాన్‌లో భారీగా ఉద్యోగాలు.. ఏడాదికి రూ.3.6 లక్షల ప్యాకేజీ
Jobs In Amazon ఏం చేయాలి ?
ML డేటా ఆపరేషన్స్‌లో అసోసియేట్‌గా.. అమెజాన్ ఇంటర్నల్ ఫుల్‌ఫిల్‌మెంట్ టెక్నాలజీస్ అండ్ రొబోటిక్స్ టీమ్‌తో సమన్వయం చేసుకుని పనిచేయాల్సి ఉంటుంది. ఆటోమేషన్‌లో రియల్ టైమ్, ఆఫ్‌లైన్ వీడియో, ఇమేజ్ ఆధారిత ఆడిటింగ్ సర్వీసెస్‌ని అందించాలి. 15 నుంచి 20 సెకన్ల షార్ట్ వీడియోలను రివ్యూ చేసి వాటిని జడ్జ్ చేయాలి. టూల్స్, రిసోర్సెస్ ఉపయోగించి ప్రొడక్ట్ లొకేషన్స్ గుర్తించి వ్యాలిడేట్ చేయడమో లేదా వాటిని మార్క్ చేసి పంపించడమో చేయాలి.
అర్హతలు : ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టుకి అప్లై చేసుకోవచ్చు. ఏదైనా నాన్ టెక్నికల్ రోల్‌లో 6 నెలల పాటు పనిచేసిన అనుభవం ఉండాలి. ఎక్కువ సమయం స్క్రీన్‌పై ఫోకస్ పెడుతూ పని చేయగలగాలి.
పని వేళలు : రోజుకు 9 గంటల పాటు పనిచేయాల్సి ఉంటుంది. వారంలో 5 రోజుల పాటు పని ఉంటుంది. నైట్ షిఫ్ట్ చేసిన వారికి అలవెన్స్ అందుతుంది. ఓ వైపు ఈ పని చేసుకుంటూనే మరోవైపు రోజువారీ ఆపరేషనల్ వర్క్ చేయాల్సి ఉంటుంది.
జీతం : ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా జీతం ఉంటుంది. కంపెనీలో చేరాక పీఎఫ్, మెడికల్ ఇన్సూరెన్స్ వంటి సౌకర్యాలు వర్తిస్తాయి. ఫ్రెషర్స్‌కి ఏడాదికి రూ.2.4 లక్షల నుంచి రూ.3.6 లక్షల మధ్య వేతనం అందనుంది.
దరఖాస్తు విధానం : ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు అమెజాన్ అధికారిక కెరీర్స్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. ఈ కింది అప్లికేషన్ ఫారం ఫిల్ చేయొచ్చు.