Jobs : ఆవిష్క‌ర‌ణ ప‌రిశోధ‌న గ‌మ్య‌స్థానంగా తెలంగాణ‌.. జీసీసీ కేంద్రాల‌తో హైద‌రాబాద్‌లో ఉద్యోగావ‌కాశాలు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Jobs : ఆవిష్క‌ర‌ణ ప‌రిశోధ‌న గ‌మ్య‌స్థానంగా తెలంగాణ‌.. జీసీసీ కేంద్రాల‌తో హైద‌రాబాద్‌లో ఉద్యోగావ‌కాశాలు..!

Jobs : గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ల (GCCలు) గమ్యస్థానంగా భారతదేశం మారింది. వీటిని ఆకర్షించడానికి తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ ఇతోధికంగా రాయితీలు ప్రకటిస్తున్నాయి. భారత్‌లో 2010 సంవత్సరంలో 700 జీసీసీలు ఉండగా వాటిలో 4 లక్షల మంది సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు పని చేశారు. అది 2023 నాటికి 1,600 జీసీసీలు ఏర్పాటవగా ఉద్యోగుల సంఖ్య 16.59 లక్షలకు చేరింది. ఇక 2028 నాటికి వీటి సంఖ్య 2,100కి చేరి 34 లక్షల […]

 Authored By ramu | The Telugu News | Updated on :14 September 2024,7:00 am

ప్రధానాంశాలు:

  •  Jobs : ఆవిష్క‌ర‌ణ ప‌రిశోధ‌న గ‌మ్య‌స్థానంగా తెలంగాణ‌.. జీసీసీ కేంద్రాల‌తో హైద‌రాబాద్‌లో ఉద్యోగావ‌కాశాలు..!

Jobs : గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ల (GCCలు) గమ్యస్థానంగా భారతదేశం మారింది. వీటిని ఆకర్షించడానికి తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ ఇతోధికంగా రాయితీలు ప్రకటిస్తున్నాయి. భారత్‌లో 2010 సంవత్సరంలో 700 జీసీసీలు ఉండగా వాటిలో 4 లక్షల మంది సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు పని చేశారు. అది 2023 నాటికి 1,600 జీసీసీలు ఏర్పాటవగా ఉద్యోగుల సంఖ్య 16.59 లక్షలకు చేరింది. ఇక 2028 నాటికి వీటి సంఖ్య 2,100కి చేరి 34 లక్షల మందికి ఉద్యోగాలు క‌ల్పించ‌నున్న‌ట్లు అంచనా. సాంప్ర‌దాయ ఐటీ సంస్థ‌ల్లో ఎంట్రీ లెవల్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లకు వార్షిక సగటు వేతనం రూ.5.7 లక్షలు అంద‌నుంది. మూడేండ్ల అనుభవముంటే రూ.11.7 లక్షలు. జీసీసీల్లో ఎంట్రీ లెవెల్‌లో ఏఐ, ఎంల్‌ ఇంజినీర్లకు రూ.8.20 లక్షల వరకు, మూడేళ్ల అనుభవముంటే రూ.21.8 లక్షలు అందుతుంది.

Jobs జీసీసీలు అంటే ?

అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాలకు చెందిన అంతర్జాతీయ కార్పొరేట్‌ సంస్థలు తమ ప్రధాన కార్యాలయాలకు పొరుగు, ప్రాసెస్‌ సేవలను అందించేందుకు నైపుణ్యంతో పాటు, చవకగా మానవ వనరులు లభించే ఇతర దేశాల్లో ఏర్పాటు చేసుకునే ఉప కార్యాలయాలనే గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్లు(జీసీసీ)లుగా పేర్కొంటారు. ఆయా సంస్థలు ఇటీవల వీటిని ఐటీ, ఆర్‌అండ్‌డీ, ఫైనాన్స్, టెలికాం, బ్యాంకింగ్, వినియోగదారుల మద్దతు వంటి బహుళ సేవలను అందించే సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నాయి.వీటిలో నూతన టెక్నాలజీ అభివృద్ధితోపాటు స్థానిక స్టార్టప్‌లు, ఐటీ కంపెనీల భాగస్వామ్యంతో కొత్త ఉత్పత్తులను సిద్ధం చేస్తున్నాయి. ఇందుకు భారీస్థాయిలో ఏఐ, ఎంఎల్, జెన్‌ ఏఐ, బ్లాక్‌చైన్, ఐవోటీ, క్లౌడ్, ఆగ్‌మెంటెడ్‌ రియాలిటీ, వర్చువల్‌ రియాలిటీ వినియోగాన్ని పెంచుతున్నాయి.

Jobs ఆవిష్క‌ర‌ణ ప‌రిశోధ‌న గ‌మ్య‌స్థానంగా తెలంగాణ‌ జీసీసీ కేంద్రాల‌తో హైద‌రాబాద్‌లో ఉద్యోగావ‌కాశాలు

Jobs : ఆవిష్క‌ర‌ణ ప‌రిశోధ‌న గ‌మ్య‌స్థానంగా తెలంగాణ‌.. జీసీసీ కేంద్రాల‌తో హైద‌రాబాద్‌లో ఉద్యోగావ‌కాశాలు..!

నిపుణులైన మానవ వనరుల లభ్యత, దేశ జనాభాలో 20-34 ఏళ్లలోపు యువత 24% ఉండటం, పైగా ఆంగ్ల భాషలో ప్రావీణ్యం కలిగి ఉండటం, మొత్తం పట్టభద్రుల్లో 24% సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మేథమెటిక్స్‌ (స్టెమ్‌) పట్టభద్రులే ఉండటంతో తమ జీసీసీ ఏర్పాటుకు కార్పొరేట్‌ సంస్థలు భారత్‌నే ఎంచుకుంటున్నాయి.వీటిలో 57% బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు చెందినవి. మరో 29% టెక్నాలజీ, మీడియా, టెలికం రంగాలకు సంబంధించినవి. ఇవి ప్రధానంగా బెంగళూరు, హైదరాబాద్, పుణె, చెన్నై, దిల్లీల్లో కొలువుదీరాయి. వీటికి సంబంధించిన పెట్టుబడుల ఆకర్షణలో నాలుగేళ్లుగా హైదరాబాద్‌ నగరం దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ విభాగంలో బెంగళూరును దాటేసింది.ఏఐ/ఎంఎల్, డేటా ఎనలిటిక్స్, సైబర్‌ సెక్యూరిటీ, క్లౌడ్‌ కంప్యూటింగ్, రోబోటిక్స్‌ ప్రాసెస్‌ ఆటోమేషన్‌లలో నిపుణులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. హైదరాబాద్‌ జీసీసీల్లో టెక్నాలజీ, లైఫ్‌ సైన్సెస్, కన్సల్టింగ్‌ రంగాల వాటా ఎక్కువ ఉంది.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది