Unemployed : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలో నిరుద్యోగ భృతి పథకం అమలు…!
ప్రధానాంశాలు:
ఏపీలో ఈ ఏడాది చివర్లో నిరుద్యోగ భృతి పథకం అమలు
Unemployed : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వరుస తీపి కబుర్లు అందజేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా నిరుద్యోగ యువతకు భరోసా కలిగించే ప్రకటన చేశారు గిద్దలూరు టీడీపీ ఎమ్మెల్యే అశోక్ రెడ్డి. ఈ ఏడాది చివరినాటికి నిరుద్యోగ భృతి పథకం అమలులోకి రానుందని తెలిపారు. డిగ్రీ పూర్తిచేసి రెండు సంవత్సరాల వ్యవధిలో ఉద్యోగం లేని యువతికి నెలకు రూ.3,000 భృతి రూపంలో అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ పథకం ద్వారా వేలాది మంది నిరుద్యోగ యువతకు ఆర్థిక సహాయం లభించనుంది.

Unemployed : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలో నిరుద్యోగ భృతి పథకం అమలు…!
Unemployed నిరుద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి
ఇంటర్మీడియట్ వరకు మాత్రమే చదివిన వారికి ఈ భృతి వర్తించదని క్లారిటీ ఇచ్చారు. డిగ్రీ పూర్తిచేసినవారికే ఈ పథకానికి అర్హత ఉంటుందని చెప్పారు. యువతకు ఉపాధి కల్పించేందుకు కూటమి ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంటోందని ఆయన వివరించారు. రాష్ట్రంలో నిరుద్యోగత సమస్యను పరిష్కరించడానికి ఇది ఒక ముందడుగుగా నిలవనుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇక దీనికి సంబంధించి అధికారికంగా ప్రభుత్వం నుంచి ఇంకా ప్రకటన వెలువడలేదు. ఎన్నికల సమయంలో కూటమి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అశోక్ రెడ్డి చేసిన ఈ ప్రకటన ద్వారా నిరుద్యోగ యువతలో కొత్త ఆశలు చిగురించాయి. అధికారిక ఉత్తర్వులు వెలువడితే, పథకం అమలు ఎప్పుడు, ఎలా ప్రారంభమవుతుందనేది మరింత స్పష్టత వస్తుంది.