Home » Jobs Education » Notification Released For 1673 Posts In Telangana High Court Jobs
Jobs Education

Telangana High Court : గుడ్‌న్యూస్‌.. తెలంగాణ హైకోర్టులో 1673 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల….!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: January 4, 2025, 7:00 am
Advertisement

Telangana High Court : నిరుద్యోగ యువతకు శుభవార్త. తాజాగా  Telangana  తెలంగాణ రాష్ట్రంలోని న్యాయశాఖ మంత్రిత్వ శాఖ మరియు సబార్డినేట్ సర్వీస్ కోసం వివిధ స్థానాలలో ఖాళీగా ఉన్నటువంటి1673 పోస్టుల భర్తికి తెలంగాణ హైకోర్టు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. దీనిలో స్టైనగ్రాఫర్ గ్రేడ్ 3 ,జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ , అసిస్టెంట్ ,ఎగ్జామినర్, ఆఫీస్ సబార్డినేట్ ,టైపిస్ట్ ,సిస్టం అనలిస్ట్ ,కంప్యూటర్ ఆపరేటర్ ,వంటి పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. వీటిలో మొత్తం 1673 ఖాళీలు ఉండగా ,1277 టెక్నికల్ , 184 నాన్ టెక్నికల్ , తెలంగాణ జ్యుడీషియల్ మినిస్ట్రియల్ , సభార్డినేట్ సర్వీస్ కలిపి 212 ఖాళీలు ఉన్నాయి.

Advertisement

Telangana High Court : గుడ్‌న్యూస్‌.. తెలంగాణ హైకోర్టులో 1673 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల….!

Telangana High Court నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ …

ఈ నోటిఫికేషన్ మనకు తెలంగాణ న్యాయశాఖ మంత్రిత్వ శాఖ మరియు సబర్డినేట్ సర్వీస్ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు భర్తీకి హైకోర్టు విడుదల చేయడం జరిగింది.

Advertisement

Telangana High Court మొత్తం ఖాళీలు…

ఈ నోటిఫికేషన్ ద్వారా టెక్నికల్ ,నాన్ టెక్నికల్ మొత్తం కలిపి 1673 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

విద్యార్హత : ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి అనుకునేవారు పదో తరగతి , ఇంటర్మీడియట్ , సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత విభాగంలో పని అనుభవం కలిగి ఉండాలి.

Advertisement

వయోపరిమితి : ఈ నోటిఫికేషన్ కు అప్లై చేయాలి అనుకునే వారి వయసు 18 నుంచి 34 సంవత్సరాల మధ్య ఉండాలి. అదేవిధంగా SC-ST లకు ఐదేళ్లు OBC లకు మూడు సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.

దరఖాస్తు చేయు విధానం : ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి అనుకునేవారు సంబంధిత అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్లి ఆన్లైన్ ప్రక్రియ ద్వారా అప్లై చేసుకోగలరు.

రుసుము :  ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి అనుకునే OBC లు రూ.600 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ,ఈడబ్ల్యూఎస్ ,ఎక్స్ సర్వీస్ మెన్, పీడబ్ల్యూబిడిఎస్ , అభ్యర్థులు రూ.400 చెల్లించాలి.

ఎంపిక విధానం : ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారికి ముందుగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించి అనంతరం మెరిట్ లిస్ట్ , స్కిల్ టెస్ట్ ,షార్ట్ హ్యాండ్ ఇంగ్లీష్ ,సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు .

Advertisement

Telangana High Court Jobs ముఖ్యమైన తేదీలు….

దరఖాస్తు ప్రారంభ తేదీ… 08-01 -2025

దరఖాస్తు చివరి తేదీ… 31-01-2025

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి