
Oriental Jobs : ఓరియంటల్ ఇన్సూరెన్స్‌లో 500 అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్.. తెలుగు రాష్ట్రాల్లో 26 ఖాళీలు
Oriental Jobs : కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రముఖ పబ్లిక్ సెక్టార్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ ఒరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (OICL), 500 క్లాస్-3 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.దేశవ్యాప్తంగా ఖాళీలను భర్తీ చేయనుండగా, తెలుగు రాష్ట్రాల్లో 26 పోస్టులు ఉన్నాయి. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 2025 ఆగస్టు 2, ఆఖరి తేదీ: 2025 ఆగస్టు 17. టైర్-1 (ప్రిలిమ్స్) పరీక్ష: సెప్టెంబర్ 7న, టైర్-2 (మెయిన్స్) పరీక్ష: అక్టోబర్ 28.
Oriental Jobs : ఓరియంటల్ ఇన్సూరెన్స్‌లో 500 అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్.. తెలుగు రాష్ట్రాల్లో 26 ఖాళీలు
అర్హతలు చూస్తే.. అభ్యర్థులు ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. ఎస్‌ఎస్‌సీ / ఇంటర్ / డిగ్రీలో ఇంగ్లిష్ సబ్జెక్ట్‌లో ఉత్తీర్ణత తప్పనిసరి. దరఖాస్తు చేసే రాష్ట్రం / యూనియన్ టెరిటరీ ప్రాదేశిక భాషలో చదవడం, రాయడం, మాట్లాడడం వచ్చి ఉండాలి. వయస్సు 21 నుంచి 30 సంవత్సరాల మధ్య (2025 జూలై 31 నాటికి), వయోపరిమితిలో ఎస్సీ/ఎస్టీకి 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు చూస్తే.. ఎస్సీ / ఎస్టీ / దివ్యాంగులు / ఎక్స్-సర్వీస్‌మెన్: ₹100, ఇతర వర్గాల అభ్యర్థులు: ₹850. ఎంపిక ప్రక్రియ టైర్-1 (ప్రిలిమినరీ పరీక్ష): మొత్తం 100 మార్కులకు, 1 గంట వ్యవధిలో రాయాలి, అంశాలు: ఇంగ్లిష్ లాంగ్వేజ్, రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ, టైర్-2 (మెయిన్స్ పరీక్ష): మొత్తం 250 మార్కులకు, 2 గంటల వ్యవధిలో. అంశాలు: ఇంగ్లిష్, రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ అవేర్‌నెస్.రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్ తర్వాత తుది ఎంపిక జరుగుతుంది. ఎంపికైన అభ్యర్థులకు నెల జీతం ₹22,405 నుంచి ₹62,265 వరకు చెల్లిస్తారు. ఇతర అలవెన్సులతో కలిపి వేతనం మరింతగా పెరుగుతుంది. మరిన్ని వివరాలకి వెబ్‌సైట్: https://orientalinsurance.org.in చూడండి.
LPG Gas Cylinder Subsidy: దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న బడ్జెట్ 2026 సమయం దగ్గరపడుతోంది. ఫిబ్రవరి 1న…
Today Gold Rate 13 January 2026 : ప్రస్తుతం మార్కెట్‌లో బంగారం Today Gold price , వెండి…
Karthika Deepam 2 Today Episode : స్టార్ మా ప్రసారం చేస్తున్న కార్తీక దీపం 2 సీరియల్ జనవరి…
Bhartha Mahasayulaki Wignyapthi : మాస్ మహారాజ రవితేజ కొత్త Mass Raviteja సినిమా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ పై…
Chandrababu Sankranthi Kanuka : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చేనేత కార్మికులకు సంక్రాంతి పండుగ వేళ కూటమి ప్రభుత్వం గొప్ప ఊరటనిచ్చింది. చేనేత…
Mahindra XUV 7 XO : భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో ప్రియమైన SUVలలో ఒకటిగా ఉన్న మహీంద్రా XUV700, ఇప్పుడు…
Mana Shankara Vara Prasad Garu Movie Collections : బాక్సాఫీస్ వద్ద మొదటి రోజే అన్ని చోట్లా ఎక్స్‌లెంట్…
Goat Head Curry : మటన్ ప్రియులకు మేము మరొక ఆరోగ్యకరమైన ఆహారాన్ని పరిచయం చేస్తున్నాం. మేక తలకాయ కూర.…
This website uses cookies.