RRB Exams 2024 : దేశ వ్యాప్తంగా రైల్వే శాఖలోని వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న 41500 ఉద్యోగాలకు ఆర్ఆర్‌బి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే రైల్వే ఉద్యోగాలకు పోటీ పడే అభ్యర్థులకు ఆ శాఖ తాజాగా ముఖ్య సమాచారం అందించింది. దేశవ్యాప్తంగా రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు పరిధిలోని జోన్లలో వివిధ ఉద్యోగాల నియామక పరీక్షలకు సంబంధించి గతంలో నిర్వహణ తేదీలు ప్రకటించగా, తాజాగా ఎగ్జామ్ షెడ్యూల్‌ను ఖరారు చేసింది. ఈ పరీక్షలన్నీ నవంబర్, డిసెంబర్ నెలల్లో జరుగనున్నాయి. ఆర్ఆర్‌బి అసిస్టెంట్ లోకో పైలట్, ఆర్‌పిఎఫ్, టెక్నిషియన్, జూనియర్ ఇంజినీర్ వంటి పరీక్షలన్నీ సిబిటి విధానంలోనే ఉంటాయని అధికారులు తెలిపారు.
పరీక్షకు పది రోజుల ముందు ఎగ్జామ్ సిటీ, తేదీ వివరాలు, నాలుగు రోజుల ముందు అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని రైల్వే శాఖ పేర్కొంది. పరీక్షకు ఆధార్ లింక్‌డ్ బయోమెట్రిక్ అథెంటికేషన్ తప్పనిసరి కాబట్టి అభ్యర్థులు ఒరిజినల్ ఆధార్ కార్డును తీసుకురావాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లలో మొత్తం 41500 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడింది. ఇందులో 18,799 అసిస్టెంట్ లోకో పైలట్, 452 రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పిఎఫ్), 14,298 టెక్నీషియన్ పోస్టులు, 7951 జూనియర్ ఇంజినీర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ఈ పోస్టులన్నీ సికింద్రాబాద్, అహ్మదాబాద్, అజ్మీర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్‌పూర్, చండీగఢ్, చెన్నై, గువాహటి, గోరఖ్‌పుర్, జమ్ము అండ్ శ్రీనగర్, కోల్‌కతా, మాల్దా, ముంబయి, ముజఫర్‌పుర్, పట్నా, ప్రయాగ్‌రాజ్, రాంచీ, సిలిగురి, తిరువనంతపురం ఆర్‌ఆర్‌బీ రీజియన్లలో ఉన్నాయి. అభ్యర్థులు ఇతర పూర్తి సమాచారం కోసం https://www.rrbapply.gov.in/ అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించగలరు.
ఆర్‌ఆర్‌బీ రాత పరీక్ష తేదీలు :
పోస్టులు కంప్యూటర్ ఆధారిక పరీక్ష నిర్వహణ తేదీలు
అసిస్టెంట్ లోకో పైలట్ (సీబీటీ-1) నవంబర్ 25, 26, 27, 28, 29
ఆర్‌పీఎఫ్ ఎస్సై డిసెంబర్ 2, 3, 9, 12
టెక్నీషియన్ డిసెంబర్ 18, 19, 20, 23, 24, 26, 28, 29
జూనియర్ ఇంజినీర్ డిసెంబర్ 13, 16, 17 RRB Exams 2024, RRB Exams, RRB, ALP, RPF SI, Technician, JE
Exit polls Maharashtra : బుధవారం జరిగిన మహారాష్ట్ర మరియు జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలలో అనేక ఎగ్జిట్ పోల్స్ బిజెపి నేతృత్వంలోని…
Mohini Dey : స్టార్ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ar rahman భార్య సైరా బాను Saira Banu…
CBSE Board Exam 2025 : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) నవంబర్ 20, 2024 బుధవారం…
Gautam Adani : రూ. 2,110 కోట్ల లంచం కేసులో Billionaire industrialist Gautam Adani అదానీ గ్రూప్ ఛైర్మన్…
Nokia x200 5G : ఒకప్పుడు కీ బోర్డ్ ఫోన్లలో రారాజుగా మార్కెట్ ని శాసించిన నోకియా స్మార్ట్ ఫోన్…
Gautam Adani : అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు మరియు చైర్మన్, బిలియనీర్ గౌతమ్ అదానీతో పాటు మరో ఏడుగురు ఎగ్జిక్యూటివ్‌లు…
Foods : ప్రతి ఒక్క అమ్మాయి అందంగా కనిపించాలి అని ఖచ్చితంగా కోరుకుంటుంది. అయితే దానికి మీరు ఏం చేస్తున్నారు అన్నది…
Stock Market : భారత స్టాక్ మార్కెట్లు గురువారం ఉదయం లాభాలతో సానుకూలంగా ప్రారంభమైన తర్వాత ప్రతికూల స్థాయికి జారుకుని…
This website uses cookies.