RRB Exams 2024 : ఆర్ఆర్‌బీ ప‌రీక్ష‌ల షెడ్యూల్‌ కొత్త తేదీలు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

RRB Exams 2024 : ఆర్ఆర్‌బీ ప‌రీక్ష‌ల షెడ్యూల్‌ కొత్త తేదీలు

 Authored By ramu | The Telugu News | Updated on :21 November 2024,7:00 am

ప్రధానాంశాలు:

  •  RRB Exams 2024 : ఆర్ఆర్‌బీ ప‌రీక్ష‌ల షెడ్యూల్‌ కొత్త తేదీలు

RRB Exams 2024 : దేశ వ్యాప్తంగా రైల్వే శాఖలోని వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న 41500 ఉద్యోగాల‌కు ఆర్ఆర్‌బి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే రైల్వే ఉద్యోగాలకు పోటీ పడే అభ్యర్థులకు ఆ శాఖ తాజాగా ముఖ్య స‌మాచారం అందించింది. దేశవ్యాప్తంగా రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు పరిధిలోని జోన్లలో వివిధ ఉద్యోగాల నియామక పరీక్షలకు సంబంధించి గతంలో నిర్వహణ తేదీలు ప్రకటించగా, తాజాగా ఎగ్జామ్‌ షెడ్యూల్‌ను ఖరారు చేసింది. ఈ పరీక్షలన్నీ నవంబర్‌, డిసెంబర్‌ నెలల్లో జరుగనున్నాయి. ఆర్ఆర్‌బి అసిస్టెంట్ లోకో పైలట్, ఆర్‌పిఎఫ్‌, టెక్నిషియ‌న్‌, జూనియ‌ర్ ఇంజినీర్ వంటి ప‌రీక్ష‌ల‌న్నీ సిబిటి విధానంలోనే ఉంటాయ‌ని అధికారులు తెలిపారు.

పరీక్షకు పది రోజుల ముందు ఎగ్జామ్‌ సిటీ, తేదీ వివరాలు, నాలుగు రోజుల ముందు అడ్మిట్‌ కార్డు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని రైల్వే శాఖ పేర్కొంది. పరీక్షకు ఆధార్‌ లింక్‌డ్‌ బయోమెట్రిక్‌ అథెంటికేషన్‌ తప్పనిసరి కాబట్టి అభ్యర్థులు ఒరిజినల్‌ ఆధార్‌ కార్డును తీసుకురావాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లలో మొత్తం 41500 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ వెలువ‌డింది. ఇందులో 18,799 అసిస్టెంట్ లోకో పైలట్, 452 రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పిఎఫ్‌), 14,298 టెక్నీషియన్ పోస్టులు, 7951 జూనియర్ ఇంజినీర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

RRB Exams 2024 ఆర్ఆర్‌బీ ప‌రీక్ష‌ల షెడ్యూల్‌ కొత్త తేదీలు

RRB Exams 2024 : ఆర్ఆర్‌బీ ప‌రీక్ష‌ల షెడ్యూల్‌ కొత్త తేదీలు

ఈ పోస్టులన్నీ సికింద్రాబాద్, అహ్మదాబాద్, అజ్మీర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్‌పూర్, చండీగఢ్, చెన్నై, గువాహటి, గోరఖ్‌పుర్, జమ్ము అండ్ శ్రీనగర్, కోల్‌కతా, మాల్దా, ముంబయి, ముజఫర్‌పుర్, పట్నా, ప్రయాగ్‌రాజ్, రాంచీ, సిలిగురి, తిరువనంతపురం ఆర్‌ఆర్‌బీ రీజియన్లలో ఉన్నాయి. అభ్యర్థులు ఇత‌ర పూర్తి స‌మాచారం కోసం https://www.rrbapply.gov.in/ అధికారిక వెబ్‌సైట్‌ను సంప్ర‌దించ‌గ‌ల‌రు.

ఆర్‌ఆర్‌బీ రాత పరీక్ష తేదీలు :
పోస్టులు కంప్యూటర్‌ ఆధారిక పరీక్ష నిర్వహణ తేదీలు
అసిస్టెంట్ లోకో పైలట్ (సీబీటీ-1) నవంబర్‌ 25, 26, 27, 28, 29
ఆర్‌పీఎఫ్‌ ఎస్సై డిసెంబర్‌ 2, 3, 9, 12
టెక్నీషియన్ డిసెంబర్‌ 18, 19, 20, 23, 24, 26, 28, 29
జూనియర్ ఇంజినీర్ డిసెంబర్ 13, 16, 17 RRB Exams 2024, RRB Exams, RRB, ALP, RPF SI, Technician, JE

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది