Software Job : దాదాపు ప్రతి వ్యాపారం సాంకేతికతపై మొగ్గు చూపడంతో సాఫ్ట్‌వేర్ డెవలపర్లకు అంతటా చాలా డిమాండ్ ఉంది. మిగతా రంగాలతో పోల్చితే అధిక జీతాలు మరియు వారంతపు సెలవులు ఉండడంతో చాలామంది ఈ రంగంవైపు పరుగులు తీస్తున్నారు. ప్రతి ఏడాది లక్షల మంది డిగ్రీ పట్టాలు అందుకుని బాహ్యా ప్రపంచంలోకి అడుగిడుతారు. అయితే ఈ పోటీ ప్రపంచంలో ఉద్యోగం లభించడం అంత సులువుగా లేదు. లక్షల మందితో పోటీ పడాలి కాబట్టి మీరు కళాశాల విద్యార్థిగా ఉన్నప్పటి నుంచే జాబ్ మార్కెట్ కు అవసరమైన స్కిల్స్ నేర్చుకోవాలి. అప్పుడే ఉద్యోగ వేటలో సఫలం కాగలుగుతారు. కెరీర్ డెవలప్‌మెంట్ లో ఈ గందరగోళానికి పరిష్కారంగా ఇంటర్న్‌షిప్ పూర్తి చేయడం ఎంతో ఉపయోగపడుతుంది. సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఈ ఇంటర్న్‌షిప్స్ పూర్తి చేస్తే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ప్రస్తుతం టెక్ ఇండస్ట్రీలో అందుబాటులో ఉన్న సాఫ్ట్‌వేర్ డెలవప్‌మెంట్ ఇంటర్న్‌షిప్ ఆపర్స్..
– హెల్త్ టెక్ కంపెనీ ఎక్స్‌ట్రా లివింగ్ (XtraLiving) ప్రైవేట్ కంపెనీ.
– వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో మూడు నెలల ఇంటర్న్‌షిప్ అవకాశం కల్పిస్తోంది.
– ఆండ్రాయిడ్, iOS యాప్ డెవలప్‌మెంట్‌లో వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నవారు సెప్టెంబర్ 26 లోపు ఇంటర్న్‌షాలా వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
– సెలక్ట్ అయిన వారు యాప్ ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్‌ను డెవలప్ చేయాల్సి ఉంటుంది.
– నెలకు రూ.7,500 స్టైఫండ్ లభిస్తుంది.
– హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే వెబ్‌ట్రాఫిక్లీ (WebTrafficly) టెక్ కంపెనీ.
– ఫుల్ టైమ్ ఆఫీస్ వర్క్ ఇంటర్న్‌షిప్ ఆఫర్ చేస్తోంది.
– ఇంటర్న్‌షిప్ వ్యవధి 6 నెలలు.
– ఇంటర్న్‌షాలా పోర్టల్ విజిట్ చేసి సెప్టెంబర్ 26లోపు దరఖాస్తు చేసుకోవాలి.
– ఎంపికైన వారు మొబైల్ యాప్స్, ప్లే స్టోర్, యాపిల్ స్టోర్‌లో హోస్ట్ యాప్‌లను డెవలప్ చేయడం, ఫైర్‌బేస్ మేనేజ్‌మెంట్ బాధ్యతలు చూసుకోవాలి.
– స్టైఫండ్ నెలకు రూ.4 వేల నుంచి రూ.10 వేల మధ్య ఉంటుంది.
– యూఎస్‌లోని శాన్‌ఫ్రాన్సిస్కో వేదికగా పనిచేసే స్విస్‌మోట్ (Swissmote Inc) కంపెనీ.
– వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో నెల రోజుల ఇంటర్న్‌షిప్ ఆఫర్ అందిస్తోంది.
– సెప్టెంబర్ 26లోపు ఇంటర్న్‌షాల పోర్టల్ విజిట్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు.
– జావా, ఐఓఎస్, స్విఫ్ట్ లేదా ఆండ్రాయిడ్ కోసం కోట్లిన్‌ని ఉపయోగించి మొబైల్ అప్లికేషన్‌లను డెవలప్ చేయడం, టెస్టింగ్, బగ్స్, ఇతర టెక్నికల్ గ్లిచ్‌లను గుర్తించి, పరిష్కరించడానికి సీనియర్ డెవలపర్‌లతో కలిసి పనిచేయాల్సి ఉంటుంది.
– మధ్యాహ్నం 1 నుంచి రాత్రి 10 గంటల వరకు వర్క్ చేయాల్సి ఉంటుంది.
– స్టైఫండ్ రూ.50,000 లభిస్తుంది.
టెక్‌హాన్స్ ఐటీ సర్వీసెస్
– టెక్‌హాన్స్ (Techenhance) కంపెనీ మొబైల్ యాప్ డెవలప్‌మెంట్‌పై ఇంటర్న్‌షిప్‌ను ఆఫర్ చేస్తోంది.
– వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో మూడు నెలల పాటు ఉంటుంది.
– అర్హులైన అభ్యర్థులు ఇంటర్న్‌షాలా పోర్టల్ విజిట్ చేసి సెప్టెంబర్ 29 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
– ఎంపికైన వారు క్లీన్, ఎఫీషియంట్, మెయింటెనబుల్ కోడ్ రాయాల్సి ఉంటుంది. దాని ఆధారంగా ఐఓఎస్, ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్‌లపై మొబైల్ యాప్ బిల్ట్, టెస్టింగ్, డెవలప్ చేయాలి, అప్లికేషన్స్ పనితీరు, క్వాలిటీ, రియాక్షన్స్ మానిటర్ చేయాలి.
– నెలకు రూ.8000 స్టైఫండ్ లభిస్తుంది.
ఫిట్‌సాగా(FitSaga)లో iOS యాప్ డెవలప్‌మెంట్
– ఫిట్‌సాగా సంస్థ రెండు నెలల పార్ట్‌టైమ్ ఇంటర్న్‌షిప్‌కు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతోంది.
– వర్క్ ఫ్రం హోమ్ విధానంలో
– దరఖాస్తుదారులకు MVVM ఆర్కిటెక్చర్, స్విఫ్ట్ కోర్ లైబ్రరీస్‌పై వర్క్ నాలెడ్జ్ తప్పనిసరి. JSON డేటా, Git వెర్షన్ కంట్రోల్ సిస్టమ్, కోడ్ డీబగ్గింగ్, ఆప్టిమైజేషన్ టెక్నిక్ వంటివాటిలో వర్క్ ఎక్స్ పీరియన్స్ ఉండాలి.
– అభ్యర్థులు ఇంటర్న్‌షాలా పోర్టల్ విజిట్ చేసి సెప్టెంబర్ 26లోపు దరఖాస్తు చేసుకోవాలి.
– నెలకు స్టైఫండ్ రూ.3 వేల నుంచి రూ.10 వేల ఉంటుంది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.