SSC Jobs : 10th అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు… ఎలా అప్లై చేయాలంటే…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

SSC Jobs : 10th అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు… ఎలా అప్లై చేయాలంటే…!

 Authored By ramu | The Telugu News | Updated on :29 June 2024,6:00 pm

SSC Jobs : ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నటువంటి నిరుద్యోగులకు శుభవార్త. తాజాగా ప్రభుత్వ సంస్థలలో ఒకటైనటువంటి SSC స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అయితే ఈ ఉద్యోగాలకు 10వ తరగతి పాస్ అయితే చాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం మీ సొంతం చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మల్టీ టాస్కింగ్ స్టాప్ మరియు అవల్దార్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మరి దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఈ కథనాన్ని పూర్తిగా చదవండి.

SSC Jobs నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ

మనకు ఈ భారీ రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ ప్రభుత్వ సంస్థలలో ఒకటైనటువంటి SSC స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి విడుదల కావడం జరిగింది.

SSC Jobs ఖాళీలు…

ఈ భారీ రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 8326 పోస్టులను భర్తీ చేయనున్నారు. దీనిలో మల్టీ టాస్కింగ్ పోస్టులు 4887 అలాగే 3439 హవల్దార్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

SSC Jobs విద్యార్హత…

ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునేవారు ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయస్సు…

ఈ ప్రభుత్వ ఉద్యోగులకు అప్లై చేయాలి అనుకునే వారి యొక్క వయసు కనిష్టంగా 18 నుండి గరిష్ట 27 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీతం…

ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 18 వేల నుండి 22వేల జీతం వస్తుంది.

ఎంపిక విధానం…

ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించి తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ నిర్వహించి , ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది.

రుసుము…

ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే జనరల్ ఓబీసీ , ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.100 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పిడబ్ల్యుడి మాజీ సైనికులు మహిళలకు ఎలాంటి ఫీజు ఉండదు.

SSC Jobs 10th అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఎలా అప్లై చేయాలంటే

SSC Jobs : 10th అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు… ఎలా అప్లై చేయాలంటే…!

దరఖాస్తు విధానం…

ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అనుకునేవారు సంబంధిత ఆఫీసియల్ వెబ్ సైట్ లోకి వెళ్లి మీ పూర్తి వివరాలు నమోదు చేసే సబ్ మిట్ చేయాల్సి ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు…

దరఖాస్తు ప్రారంభ తేదీ : 27/06/2024

దరఖాస్తు చివరి తేదీ : 31/7/2024.

ramu

Tandu Ramalingaiah ( Ramu ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15 years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : thetelugunews1@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి