Telangana : నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..!
ప్రధానాంశాలు:
Telangana : నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..!
నిరుద్యోగుల విషయంలో ఈసారైనా కాంగ్రెస్ మాట నిలుపుకుంటుందో..?
Telangana : తెలంగాణ రాష్ట్ర కేబినెట్ Telangana సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి, అమలుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలుపై సమీక్షించిన మంత్రివర్గం, వాటి నిర్వహణకు త్వరలోనే గ్రీన్‌సిగ్నల్ ఇవ్వనుంది. దీనితో పాటు, అభివృద్ధి, సంక్షేమం, ఉద్యోగ నియామకాలు వంటి అంశాలపై మంత్రులు సమగ్రంగా చర్చించారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉత్సాహాన్నిచ్చే వార్తను మంత్రి పొన్నం ప్రభాకర్ ponnam prabhakar ఈ సందర్భంగా ప్రకటించారు.
Telangana : నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..!
Telangana : వచ్చే మార్చిలోపు లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు : తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన
ప్రస్తుతం 17 వేలకుపైగా ఉద్యోగాల నియామకాలకు సంబంధించిన జాబ్ క్యాలెండర్ సిద్ధంగా ఉందని మంత్రి వెల్లడించారు. వచ్చే మార్చిలోగా లక్ష ఉద్యోగాలు ఇవ్వాలనే లక్ష్యంతో మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తెలంగాణ కోసం యుద్ధం చేసిన అంశాలు నీళ్లు, నిధులు, నియామకాలు అని గుర్తు చేస్తూ, బీఆర్‌ఎస్ ప్రభుత్వం నియామకాల విషయంలో కేవలం నోటీసులకే పరిమితమైందని విమర్శించారు.
కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు 60 వేలకుపైగా ఉద్యోగాలను భర్తీ చేశామని ఆయన స్పష్టం చేశారు. క్యాటగిరేషన్ సమస్యల కారణంగా జాబ్ క్యాలెండర్ విడుదలలో కొంత ఆలస్యం జరిగినప్పటికీ, ఇప్పుడు అన్ని అడ్డంకులు తొలగిన నేపథ్యంలో భారీగా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయబోతున్నామని తెలిపారు. ఈ ప్రకటనతో రాష్ట్రంలోని నిరుద్యోగ యువతలో కొత్త ఆశలు చిగురించాయి. ప్రభుత్వ నియామకాలు కొనసాగుతాయని స్పష్టం చేస్తూ, అన్ని శాఖలతో సమన్వయం చేసి వేగంగా నియామక ప్రక్రియ చేపడతామని మంత్రి హామీ ఇచ్చారు.